ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతాన్ని పోలీసులు సోమవారం దిగ్బంధించారు. ఆ ప్రాంతవాసులు 200 మందిని ‘కరోనా’ పరీక్షలకోసం తరలించారు. ఇది జరిగాక రాత్రికి ఓ షాక్. ఈ నెల13-15 తేదీల్లో నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో ప్రార్ధనలకు హాజరైన తెలంగాణవాసులు ఆరుగురు చనిపోయారు. 10వ తేదీన ఆ మసీదుకు మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిజిస్తాన్ ల నుంచి చాలా మంది వచ్చారు. అప్పటినుంచి ‘కరోనా’ వ్యాపిస్తోందని సందేహం. రెండు రోజుల క్రితం 30 మందిని పరీక్షలకోసం తీసుకెళ్లగా.. వారిలో ఏడుగురికి ‘కరోనా పాజిటివ్’ తేలింది. మసీదులో కొందరికి.. వారి ద్వారా ఎందరికో.. వైరస్ సోకి ఉంటుందని భయపడుతున్నారు.
2020-03-30ఈ నెల 13-15 తేదీల్లో నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో ప్రార్ధనలకోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన ఆరుగురు మరణించినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి వెల్లడించింది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, అపోలో, గ్లోబల్ ఆసుపత్రులలో ఒక్కొక్కరు, నిజామాబాద్, గద్వాల్ ప్రాంతాల్లో ఒక్కొక్కరు మృత్యువాత పడినట్టు సిఎంఒ ట్విట్టర్ ద్వారా తెలిపింది. శనివారం మరణించిన వృద్ధుడితో కలిపి ఆరుగురా.. లేక సోమవారమే ఆరుగురు మరణించారా? అన్న విషయంలో స్పష్టత లేదు. ఢిల్లీ ప్రార్ధనలకోసం వెళ్లివచ్చినవారిని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నట్టు సిఎంఒ పేర్కొంది.
2020-03-30టోక్యో ఒలింపిక్స్ కచ్చితంగా ఏడాది వాయిదా పడ్డాయి. 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ క్రీడోత్సవాలను నిర్వహించాలని సోమవారం నిర్ణయించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి), అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపిసి), టోక్యో 2020 నిర్వహణ కమిటీ, టోక్యో మెట్రోపాలిటన్ సంస్థ, జపాన్ ప్రభుత్వం ఈ కొత్త తేదీలపై సోమవారం అంగీకారానికి వచ్చాయి. ఒలింపిక్స్ ఈ ఏడాది జూలై 24 నుంచి జరగాల్సి ఉండగా ‘కరోనా’ కారణంగా వాయిదా వేశారు. 2021 జూలై 23- ఆగస్టు 8 తేదీల్లో ఒలింపిక్స్, ఆగస్టు 24- సెప్టెంబర్ 5 తేదీల్లో పారాలింపిక్స్ నిర్వహించనున్నారు.
2020-03-30ప్రైవేటు కంపెనీలు జీతాల్లో కోత విధించడానికి వీల్లేదని కొద్ది రోజుల క్రితం హుకుం జారీ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఇప్పుడందుకు భిన్నంగా స్పందించారు. సిఎం నుంచి సర్పంచ్ వరకు, ఐఎఎస్ నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల వరకు అందరి వేతనాల్లోనూ కొత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల ఛైర్మన్ల జీతాల్లో 75 శాతం.. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జీతాల్లో 60 శాతం, మిగిలిన ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, నాలుగో తరగతి ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించనున్నట్టు సమాచారం. ఉద్యోగులతోపాటు పెన్షనర్లకు చెల్లించే మొత్తంలోనూ 50 శాతం కోత పడనుంద
2020-03-30అమెరికా క్రూడాయిల్ ధర 18 సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం 20 డాలర్ల కంటే తక్కువ స్థాయికి చేరింది. ‘కరోనా వైరస్’ దెబ్బకు డిమాండ్ తగ్గిపోవడంతో ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు తగ్గుతున్నాయి. అమెరికా ఆయిల్ బెంచ్ మార్క్ అయిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లేదా డబ్ల్యుటిఐ (బ్యారెల్) ధర 19.92 డాలర్లకు తగ్గింది. ఒక్క రోజులో 6 శాతం తగ్గి యూరప్ ఉదయానికి 20 డాలర్లకంటే కొద్దిగా పైకి చేరింది. అంతర్జాతీయ బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ 10 శాతం తగ్గి బ్యారెల్ ధర 22.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 2002 నుంచి ఇదే అత్యల్పం.
2020-03-30 Read Moreఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (70) ‘కరోనా క్వారంటైన్’లోకి వెళ్లనున్నట్టు తాజా వార్త. నెతన్యాహు సలహాదారుల్లో ఒకరికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ పరిణామం అనివార్యమైంది. ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. నెతన్యాహు సలహాదారు రివ్కా పలుచ్ కు ‘కరోనా పాజిటివ్’ తేలింది. దీంతో ప్రధాని కూడా ‘క్వారంటైన్’లోకి వెళ్తారని వచ్చిన వార్తలను తొలుత ఆయన కార్యాలయం ఖండించింది. కొద్ది గంటల వ్యవధిలోనే అందుకు భిన్నమైన ప్రకటన వెలువడింది. ప్రధాని, ఆయన సమీప సిబ్బంది కూడా పరీక్షల ఫలితాలు వచ్చేవరకు విడిగా ఉంటారని ప్రభుత్వం తెలిపింది.
2020-03-30స్పెయిన్ దేశంలో ‘కరోనా’ మహమ్మారిపై యుద్ధం కోసం నియమితుడైన సైన్యాధిపతి వంటివాడు హెల్త్ ఎమర్జెన్సీ చీఫ్ ఫెర్నాండో సైమోన్. తాజాగా ఆయనే కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్పెయిన్ ఆరోగ్య శాఖ అధికారి మారియా జోస్ సియెర్రా సోమవారం నిర్ధారించారు. ‘కరోనా’ వ్యాప్తిని అరికట్టే చర్యలను ఫెర్నాండో పర్యవేక్షిస్తున్నారు. ఆయన నేరుగా ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తో మాట్లాడుతుంటారు. ఇటలీ తర్వాత అత్యధిక ‘కరోనా’ మరణాలు నమోదైన దేశం స్పెయిన్. గత 24 గంటల్లో కూడా 812 మంది వైరస్ కారణంగా చనిపోయారు.
2020-03-30‘కరోనా వైరస్’తో మరణించిన 74 సంవత్సరాల హైదరాబాదీ అంత్యక్రియలు శనివారం జరిగాయి. ఆయన కుటుంబ సభ్యులు ‘హోం క్వారంటైన్’లో ఉండగా.. కేవలం ఆరోగ్య కార్యకర్తలతోనే అంత్యక్రియలు జరిగాయి. 21 రోజుల ‘లాక్ డౌన్’ నిబంధనల ప్రకారం అంత్యక్రియలలో 20 మందికి మించి పాల్గొనకూడదు. ఈ వృద్ధుడు చనిపోయాక నమూనాలను పరీక్షలకు పంపగా ‘కరోనా’ నిర్ధారణ అయింది. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో ‘కరోనా’తో 68 సంవత్సరాల మహిళ మరణించినప్పుడు.. దహనం విషయంలో స్పష్టత కోసం స్మశానవాటిక సిబ్బంది ఆలస్యం చేశారు. ఆ తర్వాత వైద్య సిబ్బంది పర్యవేక్షణలో అంత్యక్రియలు జరిగాయి.
2020-03-30‘కరోనా’ కేసులు పెరుగుతున్నందున వెంటిలేటర్లను ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఆటోమొబైల్ కంపెనీలను కోరింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో 14,000 వెంటిలేటర్లు ‘కోవిడ్ 19’ పేషెంట్లకోసం సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. వచ్చే రెండు నెలల్లో 30,000 వెంటిలేటర్లను ఉత్పత్తి చేయవలసిందిగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)ను కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే కోరింది. నోయిడా లోని అగ్వా హెల్త్ కేర్ మరో 10 వేల వెంటిలేటర్ల తయారీకి ఆర్డర్లు తీసుకుంది. 11.9 లక్షల ఎన్95 మాస్కులు అందుబాటులో ఉన్నాయని, దేశీయ ఉత్పత్తిదారులు ప్రస్తుతం రోజుకు 50 వేల మాస్కులను తయారు చేస్తున్నారని కేంద్రం పేర్కొంది.
2020-03-30గుజరాత్, గోవా రాష్ట్రాలు మాత్రమే కేంద్ర బలగాలను తీసుకున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో రాజస్థాన్ కు చెందిన కార్మికులు 2 లక్షల మంది ఉన్నారని, వారంతా తిరిగి వెళ్లిపోతామని గొడవ చేయడంవల్ల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బలగాలను కోరిందని ఆయన చెప్పారు. దేశంలోని మరే రాష్ట్రమూ కేంద్ర బలగాలను అడగలేదని, అడిగితే ఇస్తామని పేర్కొన్నారు. కేంద్ర బలగాల అవసరం రాకుండా ప్రజలే సామాజిక దూరం, స్వీయ నియంత్రణ పాటించాలని కిషన్ రెడ్డి సూచించారు.
2020-03-30