శుక్రవారం రాత్రి నాగపూర్ మేయో ఆసుపత్రి నుంచి చెప్పకుండా వెళ్లిపోయిన ‘కరోనా’ అనుమానితుల్లో నలుగురు శనివారం తిరిగి వచ్చారు. ఆసుపత్రిలో విడిగా ఏర్పాటు చేసిన వార్డులో తిరిగి చేరారు. నిన్న ఐదుగురు వ్యక్తులు ‘కరోనా’ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. అందులో ఓ వ్యక్తికి కరోనా లేదని పరీక్షల్లో తేలింది. మిగిలిన నలుగురి రిపోర్టులు రావలసి ఉండగా, రాత్రి వారంతా పరారైనట్టు అధికారులు చెప్పారు. ఆ అనుభవంతో.. శనివారం తిరిగొచ్చిన పేషెంట్లకు కాపలాగా మేయో ఆసుపత్రి ప్రత్యేక వార్డు వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
2020-03-14మొబైల్ ఫోన్లపై పన్నును పెంచాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ప్రస్తుతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మోతాదు మొబైల్ ఫోన్లపై 12 శాతంగా ఉంది. దాన్ని 18 శాతానికి పెంచుతూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. మొబైల్ ఫోన్లపై 12 శాతం పన్ను ఉన్నప్పుడే.. వాటిలో వాడే కొన్ని పరికరాలపై 18 శాతం పన్ను ఉండేది. దాన్ని 12 శాతానికి తగ్గించాలి పరిశ్రమ వర్గాలు కోరగా.. కేంద్రం మొబైల్ ఫోన్లపైనే పన్నును పెంచింది.
2020-03-14‘కరోనా వైరస్’ కారణంగా ఈ నెల 31వ తేదీవరకు పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్ళు మూసివేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో పదో తరగతి పరీక్షలను మాత్రం షెడ్యూలు ప్రకారం నిర్ణయించాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. శాసనసభ సమావేశాలను కూడా కుదించాలని శనివారం ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. షెడ్యూలు ప్రకారం ఈ నెల 20వ తేదీవరకు శాసనసభ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చను చేపట్టి సమావేశాలను ముగించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
2020-03-14ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఈ రోజుకు ఏడాది అయిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య గుర్తు చేశారు. ముఖ్యమంత్రికి, వివేకా కుటుంబ సభ్యులకు గుర్తు చేస్తున్నానంటూ... ‘‘ఈ ఏడాదిలో మీ ప్రభుత్వం ఏం సాధించింది?’’ అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించింది. ఒక రాష్ట్ర డీజీపీ కోర్టు ముందు ఐదున్నర గంటల పాటు నిలబడే పరిస్థితిని సిఎం కల్పించారని వర్ల ఆరోపించారు. ఈ దుస్థితి దేశంలో మరే డీజీపీకీ రాలేదని వ్యాఖ్యానించారు.
2020-03-14నిన్న నిర్బంధం నుంచి విడుదలైన జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా శనివారం శ్రీనగర్ సబ్ జైలులో తన కుమారుడు ఒమర్ అబ్దుల్లాను కలిశారు. కాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేశాక మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్, ఒమర్, మెహబూబా ముఫ్తీలతో పాటు పలు పార్టీలకు చెందిన అనేక మంది రాజకీయ నాయకులను నిర్బంధించారు. గత వారమే ఒమర్ అబ్దుల్లాకి 50 నిండాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా తల్లి, సోదరి జైలుకే వెళ్ళి కలిశారు.
2020-03-14చైనాలోని హుబీ ప్రావిన్సులో విజృంభించి ప్రపంచమంతా వ్యాపించింది ‘కరోనా వైరస్’. ఆ దేశంలో ఇప్పుడు ‘కరోనా’ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. అయితే, భూమి గుండ్రంగా ఉందన్నట్టు.. చైనా నుంచి వ్యాపించి తిరిగి చైనాకు దిగుమతి అవుతోంది ఈ మహమ్మారి. తాజా సమాచారం ప్రకారం... చైనాలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో నలుగురికి దేశీయంగా వైరస్ వ్యాపిస్తే.. ఏడుగురు వ్యక్తులు విదేశాల నుంచి వచ్చారు. ఇటలీ, అమెరికా, సౌదీ అరేబియాల నుంచి చైనాలోని షాంగై, బీజింగ్, గన్షు ప్రావిన్సులకు వచ్చిన ఏడుగురికి ‘కరోనా’ ఉన్నట్టు తేల్చారు.
2020-03-14 Read Moreగత నెలలో మతోన్మాద అల్లరి మూకలు దేశ రాజధానిలో విధ్వంసం సృష్టించాయి. 50 మందికి పైగా మరణించారు. మసీదులు, ఇళ్ళు దగ్ధమయ్యాయి. భయం వెన్నాడుతుండగా మనుషుల మధ్య కొత్త కంచెలు పుట్టుకొస్తున్నాయి. కాలనీలు, మసీదుల రక్షణకు వివిధ ప్రాంతాల్లో స్థానికులు ఇనుప గేట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ముస్తఫాాబాద్, ఇందిరా విహార్, భాగీరథీ విహార్..ఇలా పలు ప్రాంతాల్లో కొత్తగా వీధులకు గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. చమన్ పార్కులోని మసీదుకు రక్షణగా ఓ గేటును ఏర్పాటు చేశారు.
2020-03-14 Read Moreకరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఐదుగురు వ్యక్తులు నాగపూర్ లోని మేయో ఆసుపత్రి నుంచి పరారైనట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. వారిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో అధికార యంత్రాంగం కలవరపాటుకు గురైంది. నగరంలోని పోలీసులను అలర్ట్ చేసి గాలింపు చేపట్టారు. వారిని ట్రేస్ చేశామని పోలీసులు శనివారం ప్రకటించారు. శుక్రవారం సాయంత్రమే ఆసుపత్రిలో చేరిన ఆ ఐదుగురిలో ఒకరికి ‘కరోనా నెగెటివ్’ తేలగా, మిగిలిన నలుగురి రిపోర్టులకోసం వేచి చూస్తున్నారు.
2020-03-14కుంభకోణాలతో సంక్షోభంలో చిక్కుకున్న ‘ఎస్’ బ్యాంకుపై మారటోరియాన్ని ఈ నెల 18న ఎత్తివేయనున్నారు. ఈ ప్రైవేటు బ్యాంకు పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో షేర్ల విలువ కూడా పెరిగింది. ఈ పునర్నిర్మాణ పథకాన్ని కేంద్రం నిన్న (మార్చి 13) నోటిఫై చేసింది. దాని ప్రకారం మూడో పని దినాన మారటోరియాన్ని తొలగిస్తారు. బ్యాంకు డిపాజిటర్లు రూ. 50 వేల కంటే ఎక్కువ విత్ డ్రా చేసుకునే అవకాశం లేకుండా రిజర్వు బ్యాంకు ఈ నెల 5న ఆంక్షలు విధించింది. అప్పట్లో ఏప్రిల్ 3 వరకు ఆ పరిమితి ఉంటుందని చెప్పారు.
2020-03-14 Read Moreఅంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గితే భారత ప్రభుత్వం పన్నులు పెంచింది. పెట్రోల్, డీజిల్ లపై లీటరుకు రూ. 3 చొప్పున సుంకాలను పెంచుతూ శనివారం నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక ఎక్సైజ్ సుంకం రూ. 2, రోడ్ సెస్ మరో రూపాయి పెంచారు. దీంతో కేంద్ర పన్నుల వాటా లీటరు పెట్రోలుపై రూ. 22.98కి, డీజిలుపై రూ. 18.83కి పెరిగింది. ముడి చమురు ధర పెరిగినప్పుడు వేగంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ముడి చమురు ధర తగ్గినప్పుడు మాత్రం ఎక్కువ ప్రయోజనాన్ని ప్రభుత్వం, కంపెనీలు పంచుకుంటున్నాయి.
2020-03-14