ఏపీ శాసన మండలిలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్టణానికి తరలించేందుకు రూపొందించిన ‘వికేంద్రీకరణ’ బిల్లును, రాజధాని ప్రాంత అభివ్రుద్ధి ప్రాధికార సంస్థ (సి.ఆర్.డి.ఎ) చట్టాన్ని రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి నిర్ణయించింది. మండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత ఉండటంతో ప్రభుత్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి.
2020-01-22చైనాలో సరికొత్త లక్షణాలతో విరుచుకుపడిన న్యూమోనియా మహమ్మారి ‘కరోనావైరస్’ బుధవారం రాత్రి వరకు 17 మందిని బలి తీసుకుంది. హుబీ ప్రావిన్సులో 69 కొత్త కేసులు నమోదు కాగా 8 మంది చనిపోయారు. ఇప్పటిదాకా చైనాలో 543 మందికి వైరస్ సోకినట్టు అధికారిక నివేదికలు అందాయి. హుబి ప్రావిన్సు రాజధాని ‘వుహాన్’లో టూరిజం అధికారులు గ్రూపు టూర్లను రద్దు చేశారు. లెవల్ 2 ‘హెల్త్ ఎమర్జెన్సీ రెస్పాన్స్’ను జారీ చేశారు.
2020-01-22రాజధాని రైతులకు మద్ధతుగా ఫిబ్రవరి 2న బిజెపితో కలసి భారీ కవాతును నిర్వహించనున్నట్టు జనసేన ప్రకటించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద గల సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ మైదానం వరకు ఈ కవాతు సాగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. రాజధానిపై ఉమ్మడిగా ఉద్యమించాలని నిర్ణయించిన జనసేన, బిజెపి నేతలు.. బుధవారం సమావేశంలో కవాతు ఆలోచన చేశారు.
2020-01-22బుధవారం సామాజిక మాథ్యమాల్లో తమిళ, తెలుగు హీరోల అభిమానుల మధ్య వివాదం తలెత్తింది. పరస్పర అవహేళనలతో పోస్టులు పెడుతున్నారు. #TeluguRealHeroes #UnrivalledTamilActors #AsuranKaaBaapNaarappa అనే ‘హ్యాష్ ట్యాగ్’లు ట్రెండింగ్ అయ్యాయి. తమిళ సూపర్ హిట్ సినిమా ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ పోస్టరుతో వెంకటేశ్ అభిమానులు పెట్టిన పోస్టు వివాదానికి కేంద్ర బిందువుగా చెబుతున్నారు. అదే కారణమా లేక మరొకటా అని తేలాల్సి ఉంది.
2020-01-22రైతులకు వ్యతిరేకంగా భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రంగంలోకి దింపడం ప్రాధాన్యత సంతరించుకుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాగానే రోహత్గీ భారత 14వ అటార్నీ జనరల్ గా నియమితులయ్యారు. 2014 జూన్ 19న బాధ్యతలు స్వీకరించారు. మోడీ ఆయనను ఎందుకు ఎంచుకున్నారంటే.. ఫ్లాష్ బ్యాక్ లోకి పోవాలి. 2002 గుజరాత్ అల్లర్లు, ఫేక్ ఎన్కౌంటర్ల కేసుల్లో మోడీ ప్రభుత్వం తరపున రోహత్గీ సుప్రీంకోర్టులో వాదించారు మరి!
2020-01-22రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రాష్ట్ర హైకోర్టులో రైతులు దాఖలు చేసిన పిటిషన్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ రంగంలోకి దిగారు. ఆయనకు ఫీజు చెల్లించేందుకు వీలుగా రూ. 5 కోట్లను ప్లానింగ్ శాఖ కార్యదర్శికి విడుదల చేయాలని, అందులో కోటి రూపాయలను అడ్వాన్సుగా రోహత్గీకి చెల్లించాలని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెంబర్ 1) ఇచ్చింది.
2020-01-22సౌర ఇంథన ఉత్పత్తి సంస్థల్లో 2025 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలన్న లక్ష్యాన్ని గుజరాతీ బిలియనీర్ గౌతమ్ అదానీ వెల్లడించారు. దాంతోపాటు.. 2030 నాటికి మొత్తం పునరుత్పాదక ఇంథన శక్తుల్లో నెంబర్ 1 కావాలన్న ఆకాంక్షనూ వ్యక్తీకరించారు. బుధవారం ‘లింక్డ్ ఇన్’ పోస్టులో ఈ అంశాలను ప్రస్తావించారు. 2019లో అదానీ గ్రూపు సౌర ఇంథనంలో ప్రపంచంలో 6వ స్థానంలో నిలిచింది. ముందుగా ఇండియాలో అతి పెద్ద పునరుత్పాదక ఇంథన కంపెనీగా 2020లో అవతరిస్తామని అదానీ పేర్కొన్నారు.
2020-01-22ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మళ్లీ గెలుస్తారని సర్వేలు చెబుతుండటంతో.. ఆ రాష్ట్ర ఎన్నికలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తామిద్దరు, కేంద్ర మంత్రులతో పాటు దేశం మొత్తం నుంచి తమ సిఎంలను ప్రచారానికి దించుతున్నారు. బుధవారం బిజెపి విడుదల చేసిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సిఎంల పేర్లున్నాయి. అందరూ కలసి 5000 బహిరంగ సభల్లో పాల్గొనాలని ప్లాన్ చేశారు.
2020-01-22 Read Moreకేంద్రంలో బి.జె.పి. సొంతగా మెజారిటీ సాధించి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక...దేశంలో ప్రజాస్వామ్యం తిరోగమించింది!. ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ ‘‘డెమోక్రసీ ఇండెక్స్’’ ఐదేళ్ళ డేటాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మోడీ అధికారం చేపట్టిన మొదటి సంవత్సరం ‘డెమోక్రసీ ఇండెక్స్’లో ఇండియా స్కోరు 7.92గా ఉంది. 2015లో 7.74కు తగ్గి 2016లో స్వల్పంగా పెరిగింది (7.81కి). తిరిగి 2017లో 7.23కు, 2019లో ఏకంగా 6.90కు పడిపోయింది.
2020-01-22‘2019 ప్రజాస్వామ్య సూచీ’ ప్రపంచ ర్యాంకులలో ఇండియా 10 స్థానాలు దిగజారి 51కి చేరింది. ఒక్క ఏడాదే సూచీ 7.23 పాయింట్ల (2018) నుంచి 6.90 స్థాయికి పడిపోయింది. ‘‘పౌర హక్కుల పతనం’’మే ఇందుకు ప్రధాన కారణంగా ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఇఐయు) విశ్లేషించింది. ‘‘ప్రజాస్వామ్య తిరోగమనం’’గా దీన్ని అభివర్ణించింది. ఈ సంస్థ 2016 నుంచి ‘డెమోక్రసీ ఇండెక్స్’ను ప్రకటిస్తోంది. 2019 ర్యాంకులను బుధవారం వెల్లడించింది.
2020-01-22