కాశ్మీర్ వివాదంలో ఇండియావైపు నిలిచే దేశాలు తమ క్షిపణులను ఎదుర్కోవలసి ఉంటుందని పాకిస్తాన్ మంత్రి అలి అమీన్ గండాపూర్ హెచ్చరించారు. అలి పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వంలో కాశ్మీర్ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. కాశ్మీర్ విషయంలో ఉద్రిక్తతలు పెరిగితే పాకిస్తాన్ యుద్ధం చేయక తప్పని పరిస్థితి వస్తుందని అలి పేర్కొన్నారు. ‘‘ఒక క్షిపణి ఇండియా పైకి వెళ్తే మరొకటి దానికి మద్ధతు ఇచ్చిన దేశంపైకి వెళ్తుంది’’ అని హెచ్చరించారు.
2019-10-29 Read Moreఆగస్టు 5వ తేదీన కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఒక విదేశీ బృందం మంగళవారం ఆ రాష్ట్రంలో పర్యటించింది. దేశంలోని రాజకీయ నాయకులనే కాశ్మీర్లో అడుగు పెట్టనివ్వని కేంద్ర ప్రభుత్వం, యూరోపియన్ పార్లమెంటరీ బృందపు ‘అనధికార’ పర్యటనకు ఏర్పాట్లు చేయడం వివాదాస్పదమైంది. ఈ బృందంలోని ముఖ్యులు జాత్యహంకార, ముస్లిం వ్యతిరేక పార్టీల ప్రతినిధులు కావడమే అందుకు కారణం. భారీ భద్రత మధ్య శ్రీనగర్లో కర్ఫ్యూ వాతావరణంలో ఈ బృందం పర్యటన సాగింది.
2019-10-29కాశ్మర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత స్థానికేతరులపై ఉగ్రవాద దాడులు పెరిగాయి. మంగళవారం కుల్గాం జిల్లాలో ఐదుగురు కాశ్మీరీయేతర కూలీలను ఉగ్రవాదులు కాల్చి చంపారు. మృతులంతా పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ జిల్లాకు చెందినవారు. వారిలో ముగ్గురిని షేక్ కమ్రుద్దీన్, షేక్ మహ్మద్ రఫీక్, షేక్ ముర్న్సులిన్ లుగా గుర్తించారు. యూరోపియన్ పార్లమెంటేరియన్లు కాశ్మీర్లో పర్యటిస్తున్న రోజునే ఈ ఘటన జరగడం గమనార్హం.
2019-10-29ముఖ్యమంత్రి పీఠాన్ని సగం సగం కాలం (50:50) పంచుకుందామన్న హామీ ఏదీ శివసేనకు ఇవ్వలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. మరో ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఉద్ఘాటించారు. ఎన్నికల అవగాహనలో భాగంగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తనకు 50:50 ఫార్ములాపై హామీ ఇచ్చారని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే చెప్పిన నేపథ్యంలో ఫడ్నవీస్ స్పందించారు. బీజేపీ శాసనసభా పక్ష నేత ఎన్నిక బుధవారం లాంఛనమేనని ఆయన చెప్పారు.
2019-10-29‘‘తండ్రి జైల్లో ఉన్న దుష్యంత్ చౌతాలా ఎవరూ ఇక్కడ (మహారాష్ట్రలో) లేరు’’... బిజెపిపై శివసేన నేత సంజయ్ రౌత్ విసిరిన వ్యంగ్యాస్తం ఇది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యంపై ప్రశ్నించినప్పుడు ఆయన ఇలా స్పందించారు. హర్యానాలో మెజారిటీ లేక జెజెపి అధినేత దుష్యంత్ చౌతాలాను కలుపుకోవడానికి, తీహార్ జైలులో ఉన్న ఆయన తండ్రి అజయ్ చౌతాలాను ఉపయోగించుకుంది బీజేపీ. మహారాష్ట్రలో ఇలాంటి ఒత్తిళ్లు నెరవేరవని శివసేన స్పష్టం చేసింది. శరద్ పవార్ ఎప్పటికీ బీజేపీతో కలవరని కూడా సంజయ్ వ్యాఖ్యానించారు.
2019-10-29భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయడానికి ఇంకా 19 రోజులే (నవంబర్ 17వరకు) సమయం ఉంది. అయితే, అందులో సుప్రీంకోర్టు పని దినాలు కేవలం 8. ఆ రోజుల్లోనే బాబ్రీ మసీదు-రామజన్మభూమి భూ వివాదం, శబరిమల, రాఫేల్ ఒప్పందం సహా 5 కీలక అంశాలపై తీర్పులు వెలువడాల్సి ఉంది. వీటిని జస్టిస్ రంజన్ గొగోయ్ ఇస్తారని సమాచారం. ప్రస్తుతం దీపావళి సెలవుల్లో ఉన్న సుప్రీంకోర్టు నవంబర్ 4న పున:ప్రారంభం అవుతుంది.
2019-10-29 Read Moreరాజకీయ నాయకులు ఫేస్‌బుక్ ద్వారా ఇచ్చే వాణిజ్య ప్రకటనల్లో అసత్యాలు చెప్పడానికి అనుమతిస్తున్న సంస్థ విధానాన్ని సొంత ఉద్యోగులే తప్పు పట్టారు. ఫేస్‌బుక్ రాజకీయ ప్రకటనల విధానాన్ని వ్యతిరేకిస్తూ వందల మంది సంస్థ ఉద్యోగులు సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కు లేఖ రాశారు. ‘‘ఫేస్‌బుక్ ప్రాథమిక ఉద్ధేశానికే ఇది ముప్పు’’ అని వారు హెచ్చరించారు. ఆ విధానాన్ని వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. అయితే, రాజకీయ నాయకుల ప్రసంగాలను సెన్సార్ చేసేది లేదని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి బెర్టీ థామ్సన్ స్పష్టం చేశారు.
2019-10-29 Read Moreగోదావరి – కృష్ణా అనుసంధానానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. పోలవరం కుడి కాలువ సామర్ధ్యాన్ని పెంచి కృష్ణా నదికి... అక్కడినుంచి సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి, వెలిగొండ ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు నీటిని తరలించాలన్నది ప్రణాళిక. ఈ ప్రాజెక్టుకు రూ. 60 వేల కోట్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనా. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో ఈ అంశంపై చర్చించారు.
2019-10-29ఫిలిప్పైన్స్ లోని బువాల్ ప్రాంతానికి 14 కిలోమీటర్ల తూర్పున మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉపరితలానికి 15.3 లోతున సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. భూకంప కేంద్రానికి 16.3 కిలోమీటర్ల దూరంలోనే దవావో పట్టణం ఉంది. భవనాలు, ఇళ్లకు నష్టం జరిగిందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లిందని ఆ నగర పాలక యంత్రాంగం తెలిపింది. విద్యాలయాలన్నిటికీ ఈ రోజు సెలవు ప్రకటించింది.
2019-10-29విశాలాంధ్ర పత్రిక సంపాదకునిగా సుదీర్ఘ కాలం పని చేసిన చక్రవర్తుల రాఘవాచారి (81) సోమవారం తెల్లవారుఝామున హైదరాబాదులో మరణించారు. ఆయన గత కొంత కాలంగా కిడ్నీ కేన్సర్ కు చికిత్స తీసుకుంటున్నారు. జర్నలిస్టుగా, కమ్యూనిస్టుగా ఆయన తెలుగు నేలకు సుపరిచితులు. రాఘవాచారి భౌతిక కాయాన్ని తొలుత హైదరాబాద్ లోని మఖ్దూం భవన్ లో కొంత సమయం ఉంచి విజయవాడ తరలించారు. అక్కడ విశాలాంధ్ర కార్యాలయంలో అభిమానుల నివాళుల తర్వాత భౌతిక కాయాన్ని సిద్ధార్ధ మెడికల్ కళాశాలకు అప్పగించారు.
2019-10-28