తెలంగాణ సిఎంగా రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రిగా భట్టివిక్రమార్కతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క (డి. అనసూయ), తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. తొలి కూర్పులో సిఎం సహా నలుగురు రెడ్లు, ఇద్దరు ఎస్.సి.లు, ఒక ఎస్.టి, ఇద్దరు బి.సి.లు ఉన్నారు. బ్రాహ్మణ, కమ్మ, వెలమ కులాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. విస్తరణ తర్వాత ఈ పొందిక మారుతుంది.
2023-12-07తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రమాణం చేశారు. హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టివిక్రమార్క, మంత్రులుగా మరో 10 మంది ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.
2023-12-07"లక్ష కోట్ల రూపాయల ఆస్తులు ఉండగా, లక్ష రూపాయల విలువైన చెప్పులు వేసుకుని, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్‌లో తాగే జగన్... బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయలలో నిర్మించిన రాజభవనాలకు తోడు ఇప్పుడు విశాఖపట్నంలో మరొకటి నిర్మిస్తున్న జగన్ పేదవాడు ఎలా అవుతాడు?"- తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రశ్నించారు. యువగళం పాదయాత్ర రెండో దశలో మూడవ రోజు ఆయన తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ప్రసంగించారు.
2023-11-29రాజధాని అమరావతిని చంపేసిన పాపంలో మొదటి ముద్దాయి మాజీ సి.ఎం. చంద్రబాబేనని జైభీమ్ భారత్ అధ్యక్షుడు, మాజీ జడ్జి జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను 2,3,4వ ముద్దాయిలుగా శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. 33 వేల ఎకరాలు రాజధానికోసం ఇచ్చిన రైతులు, నిరుపేదలు రోడ్డున పడటానికి కారణం ‘ఆ నలుగురు దుర్మార్గులే’నని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు మంచిదేనని, అదే సమయంలో అందులో జరిగిన అవినీతి అక్రమాలనూ తేల్చాలని శ్రవణ్ ఉద్ఘాటించారు.
2023-11-27మూణ్ణెల్ల తర్వాత తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం వస్తుందని, ‘సైకో జగన్’ లండన్ పిచ్చాసుపత్రికి వెళ్తాడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులన్నిటికీ వడ్డీతో కలిపి తాము కేసులు పెడతామని హెచ్చరించారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుతో సెప్టెంబర్ 9న ఆగిన ‘యువగళం’ పాదయాత్రను లోకేష్ సోమవారంనాడు పున:ప్రారంభించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 52 రోజులపాటు జైల్లో పెట్టారని, ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారని లోకేష్ విమర్శించారు.
2023-11-27 Read Moreపల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కొత్తఅంబాపురంలో టీడీపీ నేత పత్తి రామారావు హత్యను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. రామారావును వై.సి.పి. రౌడీ మూక హత్య చేసిందన్న లోకేశ్, "పల్నాడును సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా జగన్ రెడ్డి?" అని ప్రశ్నించారు. వై.సి.పి.కి రోజులు దగ్గరపడే టి.డి.పి. కార్యకార్తలపై రోజుకో దాడి, హత్యలకు పాల్పడుతోందని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నెత్తుటి దాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్నారు.
2023-11-18త్యాగాలు లేకుండా ఏ ఒక్క ప్రజకు విముక్తి లభించదని హమాస్ పొలిట్‌బ్యూరో చైర్మన్ ఖాలీద్ మషల్ ఉద్ఘాటించారు. “దేశాలు సులభంగా స్వాతంత్ర్యం పొందలేవు, హిట్లర్ దాడి నుండి తమను తాము విముక్తి గావించుకోడానికి రష్యన్లు రెండవ ప్రపంచ యుద్ధంలో 30 మిలియన్ల మందిని బలిదానం చేశారు. వియత్నామీయులు అమెరికన్లను ఓడించే వరకు 3.5 మిలియన్ల మందిని త్యాగం చేశారు. USSR మరియు USAని ఓడించడానికి ఆఫ్ఘనిస్తాన్ మిలియన్ల మంది అమరవీరులను త్యాగం చేసింది. అల్జీరియన్లు 130 ఏళ్లలో 6 మిలియన్ల మంది అమరవీరులను బలి ఇచ్చారు. పాలస్తీనియన్లు అన్నింటిలాగే ఒక జాతి." అని ఖాలిద్ వ్యాఖ్యానించారు.
2023-11-18జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్న ప్రజల సంక్షేమం రాష్ట్రంలో ఎక్కడా కనిపించడంలేదని సిపిఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ. గఫూర్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ చేపట్టిన జాతాల సందర్భంగా కష్టాలు చెప్పుకున్నవాళ్ళే తప్ప హాయిగా ఉన్నామన్నవాళ్ళు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం బుధవారం విజయవాడలో నిర్వహించిన ‘‘ప్రజారక్షణ భేరి’’ బహిరంగ సభలో గఫూర్ ప్రసంగించారు. కరువు, నిరుద్యోగంతో ప్రజలు పెద్ద ఎత్తున వలస పోతున్నారని, జగన్ ఆయన భజన బృందం మాత్రమే సుఖంగా ఉన్నారని పేర్కొన్నారు. ‘‘వైసిపి నాయకులు, కాంట్రాక్టర్లు, ప్రజాధనాన్ని కొల్లగొట్టేవారు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ఆక్రమించేవారు బాగ
2023-11-15ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బానిసలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు వ్యాఖ్యానించారు. దేశంలో మోదీ పీడను, రాష్ట్రంలో మోదీ బానిసల పీడను వదలించుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలో సిపిఎం నిర్వహించిన ‘‘ప్రజారక్షణ భేరి’’ బహిరంగ సభలో రాఘవులు ప్రసంగించారు. విభజన తర్వాత మొదటి ఐదేళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం, గత నాలుగున్నరేళ్ళలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేశాయని రాఘవులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. .
2023-11-15ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుమతి లేకుండా చంద్రబాబునాయుడును జైల్లో పెట్టే సాహసం సిఎం జగన్మోహన్ రెడ్డి చేయలేరని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఉద్ఘాటించారు. బుధవారం విజయవాడలో సిపిఎం నిర్వహించిన ‘‘ప్రజారక్షణ భేరి’’ బహిరంగ సభలో రాఘవులు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో బిజెపికి ఒక్క ఎంపి, ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల కంటే ఇక్కడే అత్యంత బలంగా ఉందని రాఘవులు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 3 ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఊడిగం చేయడమే అందుకు కారణమని దుయ్యబట్టారు. ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఆంధ్ర దేశానికి గతంలో ఎన్నడూ కలగలేదని వ్యాఖ్యానించా
2023-11-15