కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన తూర్పు, దక్షిణ తెలంగాణలకే మంత్రివర్గంలో ప్రాధాన్యత లభించింది. గురువారం ప్రమాణం చేసిన 12 మందిలో అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు (ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు) ఉన్నారు. ఉమ్మడి నల్గొండ నుంచి ఇద్దరు (ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి), ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి ఇద్దరు (రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు), ఉమ్మడి వరంగల్ నుంచి ఇద్దరు (సీతక్క, కొండా సురేఖ), ఉమ్మడి కరీంనగర్ నుంచి ఇద్దరు (శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్), ఉమ్మడి మెదక్ నుంచి దామోదర రాజనరసింహ ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబా
2023-12-07ఏపీలో రైతు భరోసా పథకం కింద ఐదో ఏడాది ఇవ్వాల్సిన మొత్తంలో రూ. 4000ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం విడుదల చేసారు. మొత్తం 53.53 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 2,204.77 కోట్లను జమ చేస్తున్నట్లు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన సభలో సి.ఎం. లాంఛనంగా ప్రకటించారు. చంద్రబాబు పాలన అంటే కుంభకోణాలు తప్ప చెప్పటానికి ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? అని జగన్ ప్రశ్నించారు.
2023-11-07బీహార్ తరహాలో కులాలవారీగా జనాభా వివరాలను సేకరించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఈ నెల 20 తర్వాత సమగ్ర కులగణన చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి చెప్పారు. అణగారిన వర్గాలకు మరింత భద్రత కల్పించే ఉద్ధేశంతో... సమాజంలో ఉన్న ఆర్థిక-సామాజిక స్థితి, విద్య, ఉపాధి, జనాభా సమతుల్యత వంటి అంశాలతో కులగణన జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
2023-11-03దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవరించిన వేళ.. కేంద్ర ప్రభుత్వం 9,79,327 ఖాళీ పోస్టులపై కదలకుండా కూర్చుంది. ఒక్క కేంద్ర ప్రభుత్వ శాఖలలోనే ఇన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉండటం ఆశ్చర్యకరమైన విషయమైతే.. అందులో 70 శాతం వ్యూహాత్మకంగా ముఖ్యమైన రక్షణ, రైల్వే, హోం శాఖలలోనే ఉండటం గమనార్హం. గురువారం కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఇచ్చిన సమాధానం ప్రకారం.. రక్షణ శాఖ (సివిల్)లోనే 2,64,706 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 2,93,943 ఖాళీలతో రైల్వే శాఖ ప్రథమ స్థానంలో ఉండగా, హోం శాఖ 1,43,536 ఖాళీలతో మూడో స్థానంలో ఉంది.
2023-02-022014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు.. పోలవరం ప్రాజెక్టు భూసేకరణకోసం రూ. 3431.59 కోట్లు, పునరావాసానికి రూ. 2110.23 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భూసేకరణ, పునరావాసం సహా అనుమతించిన ఖర్చులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యమూ లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా భూసేకరణ కింద రూ. 3,779.5 కోట్లకు, పునరావాస పనులకు కింద రూ. 2,257.29 కోట్లకు బిల్లలు సమర్పించినట్టు కేంద్రం గురువారం లోక్ సభలో వివరించింది.
2023-02-02పోలవరం నిర్వాసిత కుటుంబాలకు కేంద్రమే నగదు బదిలీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ప్రతికూల స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టు ఆమోదానికి అనుగుణంగా లేదని జలవనరుల శాఖ మంత్రి గురువారం లోక్ సభలో తేల్చి చెప్పారు. ‘‘పోలవరం నిర్వాసితులకు నేరుగా నగదు బదిలీ చేయాలని 2022 ఏప్రిల్ లో ఏపి ప్రభుత్వం విన్నవించింది. అయితే, ఈ సూచన.. ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రమే చేపట్టేలా భారత ప్రభుత్వం ఇచ్చిన ఆమోదానికి అనుగుణంగా ఉన్నట్టు మేం భావించలేదు’ అని మంత్రి స్పష్టం చేశారు.
2023-02-02భారత్ తమ మిత్ర దేశమని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఉద్ఘాటించారు. భారత పర్యటన కోసం వచ్చిన హసీనాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం రాష్ట్రప్రతి భవన్ లో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని మాట్లాడుతూ.. ఎప్పుడు ఇండియాకు వచ్చినా తనకు సంతోషం కలుగుతుందని, బంగ్లా విమోచన యుద్ధంలో ఇండియా పాత్రను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటామని చెప్పారు. రక్షణ, వాణిజ్యం, నదీ జలాల పంపకం వంటి అనేక అంశాలలో పరస్పర సహకారంపై మోదీ, హసీనా చర్చలు జరపనున్నారు.
2022-09-06తెలంగాణ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. సుమారు ఆరు నెలల తర్వాత సమావేశం కాబోతున్న అసెంబ్లీ, మండలి కేవలం మూడు రోజుల పాటు (6, 12, 13 తేదీల్లో) పని చేయనున్నాయి. మొదటి రోజు సంతాప తీర్మానాల తర్వాత శాసనసభ వాయిదా పడుతుంది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే పి. జనార్ధన్ రెడ్డి లకు సభ నివాళులు అర్పించనుంది. శాసన మండలిలో తొలిరోజు వరద నష్టాలపై స్వల్పకాలిక చర్చ ఉంది.
2022-09-06ఆయిల్ కంపెనీల ఆట బాగుంది! 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను శనివారం రూ. 102.50 మేరకు తగ్గించాయి. వెంటనే.. ఈ నిర్ణయం హోటళ్ళకు, టీ స్టాళ్ళకు నూతన సంవత్సరాన ఉపశమనం అనే వార్తలు వచ్చాయి. ఈ ‘కథ’నానికి నేపథ్యంలో.. ఢిల్లీలో సిలిండర్ ధర డిసెంబర్ 1న రూ. 2,000.50 నుంచి 2,101కి పెరిగింది. అంతకు ముందు నవంబర్ 1న ఏకంగా రూ. 266 పెంచారు. అంటే రెండు నెలల్లో రూ. 366 పెంచి ఇప్పుడు 102 తగ్గించి నూతన సంవత్సర కానుక అంటున్నారు!
2022-01-01ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) పథకానికి సంబంధించి 10వ వాయిదా డబ్బు జనవరి 1న విడుదల కానుంది. 10 కోట్లకు పైగా లబ్దిదారులకు (రైతు కుటుంబాలకు) రూ. 20,000 కోట్లకు పైగా మొత్తాన్ని పిఎం నరేంద్ర మోదీ బదిలీ చేస్తారని ఆయన కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పథకంలో అర్హులైన రైతులకు కేంద్రం ఏటా రూ. 6000 మొత్తాన్ని మూడు వాయిదాల్లో విడుదల చేస్తోంది. గత 9 విడతల్లో ఇప్పటివరకు లక్షా 60 వేల కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.
2021-12-29