మాల్దీవుల (Maldives) నుంచి భారత సైనిక దళాలను ఉపసంహరించాలని ఆ దేశ నూతన అధ్యక్షుడు మహ్మద్ ముయిజు (Mohamed Muizzu) అధికారికంగా భారత దేశాన్ని కోరారు. మాల్దీవుల అధ్యక్షుడిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ముయిజు భారత దళాలను వెనుకకు పంపుతానని మరోసారి ప్రతినబూనారు. సైనిక దళాల ఉపసంహరణ ద్వారా మాల్దీవుల ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను గౌరవించాలని అధ్యక్షుడు ఇండియాను కోరినట్లు ఆయన కార్యాలయం శనివారం వెల్లడించింది.
2023-11-18భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)కు చెందిన మానవ రహిత వైమానిక వాహనం (యు.ఎ.వి) ‘తపస్’ ఆదివారం కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో కూలిపోయింది. సాంకేతిక లోపంతోనే ‘తపస్’ కూలిపోయిందని పేర్కొన్న DRDO, ఈ ఘటనతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. కూలిన ఘటనపై సదరు సంస్థ విచారణ చేపట్టింది. ‘తపస్’ ఓ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరన్స్ (MALE) డ్రోన్. వాయుమార్గంలో నిఘా కార్యకలాపాలకు ఉద్ధేశించినది. ఇప్పటివరకు ఈ యు.ఎ.వి.ని 200 సార్లు ప్రయోగాత్మకంగా పరీక్షించారు.
2023-08-20ప్రస్తుతం యుద్ధక్షేత్రంగా మారిన ఉక్రెయిన్ 2012, 2021 మధ్య మిలిటరీ వ్యయాన్ని భారీగా (142 శాతం) పెంచి రికార్డులకెక్కింది. 2021లో ఆ దేశం మిలిటరీపై $5.9 బిలియన్లు ఖర్చు చేసింది. ఇది ఉక్రెయిన్ 2021 అంచనా జీడీపీలో 3.26 శాతం. 2012లో ఆ దేశ మిలిటరీ వ్యయం జీడీపీలో కేవలం 1.6 శాతం. NATOను నమ్మి పొరుగున ఉన్న మిలిటరీ సూపర్ పవర్ తో శక్తికి మించి తలపడి అసాధారణంగా మిలిటరీ వ్యయాన్ని పెంచిన ఉక్రెయిన్, ఇప్పుడు విధ్వంసాన్ని చవి చూస్తోంది.
2022-04-25ప్రపంచ మిలిటరీ వ్యయంలో భారత దేశం మూడో స్థానంలో కొనసాగింది. 2021లో ఇండియా మిలిటరీపై 76.6 బిలియన్ డాలర్లు (రూ. 5,87,292 కోట్లు) ఖర్చు చేసిందని, ఇది 2020తో పోలిస్తే 0.9 శాతం ఎక్కువని స్టాక్ హోం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (SIPRI) సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. $801 బిలియన్ల వ్యయంతో అమెరికా ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా, చైనా $293 బిలియన్లు ఖర్చు చేసినట్టుగా ‘సిప్రి’ అంచనా వేసింది.
2022-04-25ప్రపంచ మిలిటరీ వ్యయం చరిత్రలో మొదటిసారిగా 2 ట్రిలియన్ డాలర్లు దాటింది. 2021 సంవత్సరంలో అన్ని దేశాలూ కలిపి $2113 బిలియన్లు మిలిటరీపై ఖర్చు చేశాయని స్టాక్ హోం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (SIPRI) తాజా నివేదికలో పేర్కొంది. ఈ మొత్తం భారత కరెన్సీలో 162,00,371 కోట్ల రూపాయలు. భారత దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో సుమారు 55 శాతం. ప్రపంచ మిలిటరీ వ్యయం పెరగడం వరుసగా ఇది ఏడో సంవత్సరం. కరోనా కాలంలో రికార్డు స్థాయిలో పెరిగింది.
2022-04-25భారత-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరిపించే కొన్ని ఆహ్లాదకర సన్నివేశాలు శనివారం కనిపించాయి. సరిహద్దుల పొడవునా పలుచోట్ల ఇరు దేశాల సైనికులు స్వీట్లు పంచుకొని నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. లడఖ్ లో గత 18 నెలలుగా ఉద్రిక్తతలకు కేంద్ర బిందువులుగా ఉన్న హాట్ స్ప్రింగ్స్, డెంచోక్ లతో పాటు సిక్కింలోని నాథులా, కోంగ్రా లా బోర్డర్ పోస్టుల వద్ద భారత, చైనా సైనికులు స్వీట్లు పంచుకొని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
2022-01-01అరుణాచల్ ప్రదేశ్ లోని మరో 15 ప్రాంతాలకు చైనా తన భాషలో పేర్లు పెట్టింది. గ్జిజాంగ్ దక్షిణ భాగంలోని ‘జాంగ్నాన్’లో 15 ప్రాంతాల పేర్లను చైనీస్ అక్షరాలు, టిబెటన్-రోమన్ వర్ణమాల ప్రకారం ప్రామాణీకరించినట్టు ఆ దేశ పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాటిలో 8 నివాస ప్రాంతాలు కాగా నాలుగు పర్వతాలు, రెండు నదులు, ఒకటి పర్వత దారి. ఇవన్నీ చైనా దక్షిణ టిబెట్ గా భావించే భారత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లోనివే. గతంలో ఒకసారి 6 ప్రాంతాల పేర్లను ఇలాగే ప్రామాణీకరించింది చైనా.
2021-12-30తమ జలాల్లోకి ప్రవేశించిన అమెరికా యుద్ధనౌకను తాము దూరంగా తరిమినట్టు చైనా పిఎల్ఎ దక్షిణ ధియేటర్ కమాండ్ సోమవారం ప్రకటించింది. దక్షిణ చైనా సముద్రంలోని పారాసెల్ దీవుల వద్ద ఈ పరిణామం చోటు చేసుకుంది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు హక్కు లేదని అంతర్జాతీయ కోర్టు చెప్పిన తీర్పు వార్షికోత్సాన అమెరికా నౌక ‘యుఎస్ఎస్ బెన్ ఫోల్డ్’ ఈ కవ్వింపు చర్యకు దిగింది. కవ్వింపు చర్యలను వెంటనే ఆపాలని తాము అమెరికాను కోరినట్టు పిఎల్ఎ తెలిపింది. అయితే, ఈ అంశంపై అమెరికా నౌకా దళం వెంటనే స్పందించలేదు.
2021-07-12ఆప్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగడంతో తాలిబన్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. శని, ఆదివారాల్లో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లోని పలు కీలక జిల్లాలను వారు ఆక్రమించారు. వాటిలో కాందహార్ ప్రావిన్సులో కీలకమైన పంజ్వాయ్ జిల్లా ఒకటి. కాందహార్ అనగానే ఇండియాకు ఒక చేదు అనుభవం గుర్తుకొస్తుంది. 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి కాందహార్ తరలించారు. అటువైపు తాలిబన్లు, ఇటువైపు ప్రస్తుత ఎన్ఎస్ఎ అజిత్ దోవల్ చర్చలు జరిపాక... ఇండియా జైళ్ళలో ఉన్న మాసూద్ అజర్ తదితరులను విడుదల చేశారు.
2021-07-04సుమారు రూ. 70 వేల కోట్ల రూపాయల (9.3 బిలియన్ డాలర్ల) రఫేల్ యుద్ధ విమానాల అమ్మకపు ఒప్పందంలో అవినీతి జరిగిందనే అనుమానంతో ఫ్రాన్స్ నేషనల్ ఫైనాన్సియల్ ప్రాసిక్యూటర్ ఆఫీసు (పి.ఎన్.ఎఫ్) విచారణకు ఆదేశించింది. దర్యాప్తుకోసం ఒక జడ్జిని నియమించినట్టు ప్రకటించింది. 36 విమానాల కొనుగోలుకోసం 2016లో ఇండియా కుదుర్చుకున్న ఒప్పందంలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే ఆరోపణలు వచ్చాయి. ప్రపంచంలో ఎవరూ చెల్లించనంత ఎక్కువ ధరకు కొనుగోలు చేయడమే ఇందుకు కారణం.
2021-07-03