2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడిని స్మరించుకుంటున్న డిసెంబర్ 13నే... ఇటీవల ప్రారంభించిన నూతన భవనంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ... ఇద్దరు దుండగులు కలర్ స్మోక్ బాంబులు విసిరి కలకలం రేపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితులు సాగర్ శర్మ, మనోరంజన్ సందర్శకుల పాస్ లతో పార్లమెంటు గ్యాలరీలోకి చేరారు. సభ్యులు మాట్లాడుతుండగా సాగర్ శర్మ స్మోక్ బాంబులు విసిరి గ్యాలరీలోనుంచి సభా మందిరంలోకి దూకాడు. అతనిని ఎంపిలు పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మనోరంజన్ ను కూడా పార్లమెంటు లోపలే పట్టుకున్నారు. మరో ఇద్దరిని పార్లమెంటు వెలుపల అరెస్టు చేసినట్టు సమాచారం.
2023-12-13నాగాలాండ్ మొత్తంలో సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం (AFSPA) అమలును మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేేంద్ర హోం శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల నాగాలాండ్ లో కూలీలను ఉగ్రవాదులుగా భావించి ఆర్మీ జవాన్లు కాల్చి చంపడం తీవ్ర నిరసనలకు దారి తీసిన నేపథ్యంలో.. ఈ చట్టాన్ని రద్దు చేసే అవకాశాలను పరిశీలించడానికంటూ కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే చట్టం పొడిగింపు నిర్ణయం వెలువడటం గమనార్హం.
2021-12-30ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలు చదువుకోవచ్చని, పని చేయవచ్చని తాలిబన్లు పేర్కొన్నారు. అయితే, మహిళల హక్కులు షరియా చట్టానికి లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. తాలిబన్ల ప్రధాన అధికార ప్రతినిధి జబుహుల్లా ముజాహిద్ మంగళవారం తొలి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళలు ఇంతకు ముందులా మీడియాలో పనిచేయవచ్చా? అన్న విలేకరుల ప్రశ్నకు, ఆ విషయం ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తీసుకోబోయే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని బదులిచ్చారు. ఇలాంటి మరికొన్ని అంశాలపై కొద్దిగా వేచి చూడాలని చెప్పారు.
2021-08-17ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం దేశమేనని, ఇస్లామిక్ చట్టాలే అమలవుతాయని దేశాన్ని అదుపులోకి తీసుకున్న తాలిబన్లు స్పష్టం చేశారు. అయితే, తాము (తాలిబన్) 20 ఏళ్ళ క్రితంలా లేమని, కొన్ని విషయాల్లో మార్పును చూస్తారని అభయమిచ్చారు. మంగళవారం తాలిబన్ల తొలి పత్రికా సమావేశంలో ఆ సంస్థ అధికార ప్రతినిధి జబుహుల్లా ముజాహిద్ మాట్లాడారు. 20 ఏళ్ళ ఆక్రమణ నుంచి ‘విముక్తి’ పొందినందుకు ఆఫ్ఘన్ ప్రజలను ఆయన అభినందించారు. ‘స్వేచ్ఛ, స్వాతంత్రం’ ప్రతి జాతికీ న్యాయబద్ధమైన హక్కు అని ముజాహిద్ ఉద్ఘాటించారు.
2021-08-17తాలిబన్ల భయానికి విమానంపైన వేలాడుతూ అయినా దేశం దాటుదామనుకున్న ఇద్దరు ఆప్ఘన్లు దారుణ మరణానికి గురయ్యారు. అమెరికా సైనిక రవాణా విమానం టైర్లను పట్టుకొని వేలాడిన ఇద్దరు... ఆ విమానం గాల్లోకి లేచాక పట్టుతప్పి పడిపోయారు. ఈ హృదయ విదారక దృశ్యం వీడియోలో రికార్డయింది. అంతకు ముందు కాబూల్ విమానాశ్రయంలో వేలాది మంది విమానం చుట్టూ చేరి ఎలాగైనా చోటు సంపాదించాలని చేసిన ప్రయత్నం తాలిబన్ల భయాన్ని కళ్ళకు కట్టింది. ఆఫ్ఘన్ అధ్యక్షుడు దేశం వదిలి పారిపోగా... తాలిబన్లు కాబూల్ ను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.
2021-08-16అనూహ్యమైన వేగంతో ఆప్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు, ఆదివారం రాజధాని కాబూల్ ను చుట్టుముట్టారు. తాజాగా ఆ దేశ అధ్యక్షుడి భవనాన్ని అదుపులోకి తెచ్చుకున్నట్టు ప్రకటించారు. అందుకు కొద్ది గంటల ముందే ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని దేశం వదిలిపోయారు. ఆయన తజికిస్తాన్ వెళ్లినట్టు ఓ ప్రభుత్వ ప్రతినిధి అనధికారికంగా చెప్పారు. కాగా, ఘని ఎక్కడున్నారో విచారిస్తున్నామని తాలిబన్ ప్రతినిధి చెప్పారు. ప్రభుత్వ రక్షక దళాల్లో అధిక భాగం కాబూల్ చుట్టూనే మోహరించినా, పెద్దగా ప్రతిఘటన లేకుండానే రాజధాని తాలిబన్ల వశమవుతోంది.
2021-08-15ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మిజోరాం సరిహద్దుల్లో సోమవారం హింస చెలరేగింది. మిజోరాం వైపు నుంచి దుండగులు జరిపిన కాల్పుల్లో అస్సాం పోలీసులు ఆరుగురు మరణించినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. కాల్పులు, రాళ్ళదాడిలో కాచర్ జిల్లా ఎస్.పి. సహా 50 మంది గాయపడినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. అయితే, అస్సాం పోలీసులే హింసను ప్రారంభించారని మిజోరాం ప్రభుత్వం ఆరోపించింది. అస్సాం ఐజిపి నాయకత్వంలో 200 మంది సి.ఆర్.పి.ఎఫ్. డ్యూటీ పోస్టును దాటి మిజోరాం పోలీసు పోస్టుపైకి వచ్చారని పేర్కొంది.
2021-07-26చైనా జాతీయులు, ప్రాజెక్టులపై ఉగ్రవాద దాడులకు పాల్పడినవారు ఎవరైనా, తమంతట తాము చైనా శత్రువుల శిబిరంలోకి చేరినట్టేనని ఆ దేశ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ హెచ్చరించింది. అలాంటివారి నిర్మూలనకోసం పాకిస్తాన్ చేసే ప్రయత్నాలకు చైనా ధృఢంగా మద్ధతు ఇస్తుందని శుక్రవారం తన సంపాదకీయంలో పేర్కొంది. ఉత్తర పాకిస్తాన్లో ఉగ్రవాద దాడిలో 9 మంది చైనీయులు సహా 12 మంది మరణించిన నేపథ్యంలో ఈ సంపాదకీయం వెలువడింది.
2021-07-16తమ ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం... గత నెలలో పాకిస్తాన్ నుంచి 10,000 మంది ‘జిహాదీ’ ఫైటర్లు ఆప్ఘనిస్తాన్ లోకి ప్రవేశించారని ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ఆరోపించారు. శుక్రవారం తాష్కెంట్ లో జరిగిన మధ్య ఆసియా, దక్షిణాసియా అనుసంధాన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కొద్ది అడుగుల దూరంలో కూర్చొని ఆ దేశంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఘని. కొద్ది నిమిషాల తర్వాత స్పందించిన ఇమ్రాన్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణల్లో ‘ప్రతికూల పాత్ర’ పోషిస్తున్నామన్న ఆరోపణలు బాధించాయన్నారు.
2021-07-16భారతీయ ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ బహుమతి గ్రహీత డానిష్ సిద్ధిఖి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల దాడిలో మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ భద్రతా దళాల వాహన శ్రేణిలో వెళ్తుండగా పాకిస్తాన్ సరిహద్దు పోస్టు వద్ద తాలిబన్లు దారికాచి దాడి చేసినట్టు సమాచారం. సిద్ధిఖి రాయిటర్స్ వార్తా సంస్థకు ఇండియాలో చీఫ్ ఫొటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆయన ఆప్ఘనిస్తాన్ వెళ్లారు. ఇటీవల కోవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా ఇండియాలో సామూహిక శవదహనాలపై ఆయన తీసిన ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
2021-07-16