ఇజ్రాయిల్ వైమానిక దళం శుక్రవారం గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రిపై దాడి చేసింది. ఆసుపత్రి ప్రవేశ ప్రాంతంలో బాంబులు కురిపించడంతో కొన్ని పదుల మంది ప్రాణాలు కోల్పోయారు. నిరంతర దాడుల్లో గాయపడి అల్-షిఫా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఇతర దేశాలకు పంపేందుకు గాను, అంబులెన్సుల కాన్వాయ్ ఈజిప్టు సరిహద్దుకు బయలుదేరిన సమయంలో బాంబుదాడి జరిగిందని పాలస్తీనా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చెల్లాచెదురుగా పడిన శవాలు, ధ్వంసమైన అంబులెన్సులతో ఆసుపత్రి ప్రాంగణం భయానకంగా మారింది.

2023-11-03
First Page 1 Last Page