సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీసు రికార్డుల్లో మరో మైలురాయిని అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరింది. ఆదివారం నాటికి (11 రోజుల్లో) ఇండియాలో రూ. 279.15 కోట్లు వసూలు చేసిన జైలర్ సినిమా, విదేశాల్లో మరో 220.85 కోట్లు రాబట్టింది. అమెరికాలో మంచి ఫలితాలు సాధించి గల్ఫ్ దేశాల్లో సరికొత్త రికార్డులు నమోదు చేసింది. అత్యధిక వసూళ్ళు సాధించిన రజినీకాంత్ సినిమాల్లో జైలర్ రెండవది. ఇంతకు ముందు రోబో-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 723 కోట్లు రాబట్టింది.

2023-08-20

రూ. 15,993 కోట్ల అంచనా వ్యయంతో 75.3 కి.మీ. పొడవున నిర్మించ తలపెట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనా అందలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అధికార వైసీపీ ఎం.పి.లు ఎంవీవీ సత్యనారాయణ (విశాఖ), బివి సత్యవతి (అనకాపల్లి) అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి కౌశల్ కిశోర్ లోక్ సభలో బదులిచ్చారు. 2018 సెప్టెంబరులో లైట్ మెట్రో ప్రాజెక్టు (42.55 కి.మీ) కోసం ప్రతిపాదన అందిందని, అయితే దానికి నిధులివ్వలేమని కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకు తెలిపిందని వివరించారు.

2023-02-02

ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో శంకుస్థాపన చేశారు. నవంబర్ 21 ప్రపంచ ఫిషరీస్ దినోత్సవమని గుర్తు చేసిన ముఖ్యమంత్రి, ఈ వర్శిటీతో రాష్ట్రంలో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటివరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రమే అక్వా యూనివర్శిటీలు ఉన్నాయని సిఎం జగన్ చెప్పారు.

2022-11-21

రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆరవ కిస్తీ కింద రూ. 879 కోట్ల గ్రాంటు విడుదలైంది. దీంతో కలిపి ఈ ఏడాది ఇప్పటిదాకా రెవెన్యూ లోటు గ్రాంటు కింద రాష్ట్రానికి వచ్చిన మొత్తం రూ. 5,274 కోట్లు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రూ. 6,793 కోట్లు అందగా, దక్షిణాదిన మరో లోటు రాష్ట్రమైన కేరళకు రూ. 6,587 కోట్లు విడుదలయ్యాయి. ఆరవ వాయిదా కింద కేరళకు రూ. 1098 కోట్లు విడుదలయ్యాయి.

2022-09-06

ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన రెవెన్యూ లోటు గ్రాంటులో ఆరవ నెలవారీ వాయిదా తాజాగా విడుదలైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం 14 రాష్ట్రాలకు రూ. 7,183 కోట్లు విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను బదలాయించిన తర్వాత కూడా రూ. 86,201 కోట్ల మేరకు రెవెన్యూ లోటు గ్రాంటును ఇవ్వాల్సి ఉంటుందని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. అందులో ఇప్పటివరకు రూ. 43,100 కోట్లు విడుదలయ్యాయి.

2022-09-06

చైనా సారథ్యంలో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (RCEP) నూతన సంవత్సరం తొలి రోజున అమల్లోకి రానుంది. తొలుత ఈ ఒప్పందం 10 దేశాల్లో (చైనా, జపాన్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, ఆసియాన్ 6 దేశాల్లో) అమలు కానుంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 15 దేశాలు 2020లో RCEPపై సంతకాలు చేశాయి. ఇండియా చర్చల దశలోనే వైదొలగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 30 శాతం కలిగి.. 220 కోట్ల ప్రజలున్న ప్రాంతంలో అమలు కాబోతున్న RCEP అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.

2021-12-30

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో జనవరి 10 నుంచి 12 వరకు జరగనున్న Vibrant Gujarat పెట్టుబడుల సదస్సుకు రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్ హాజరు కానున్నారు. ఆ దేశ తూర్పు, ఆర్కిటిక్ ప్రాంతాల అభివృద్ధి విభాగం మంత్రి అలెక్సి చెకున్కోవ్, ఫార్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన నలుగురు గవర్నర్లు కూడా ఇండియా రానున్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచీ నిర్వహిస్తున్న Vibrant Gujarat సదస్సుకు ప్రధానిగా కూడా మోదీ అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నారు.

2021-12-29

భారత జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూపు పరమైంది. అప్పుల్లో మునిగిన ఎయిర్ ఇండియా అమ్మకానికి ప్రభుత్వం నిర్వహించిన టెండర్ ప్రక్రియలో ‘టాటా సన్స్’ అనుబంధ సంస్థ విజయం సాధించింది. పోటీదారైన స్పైస్ జెట్ ప్రమోటర్లను ఓడించి 100 శాతం వాటాకు రూ. 18,000 కోట్లు చెల్లించడానికి టాటా గ్రూపు ముందుకొచ్చింది. ఎయిర్ ఇండియాకు ఉన్న అప్పులు రూ. 15,300 కోట్లను స్వీకరించి మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించనుంది.

2021-10-08

కరోనా మహమ్మారి విలయతాండవంలోనూ సంపదను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకున్న అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ తొలిసారి ‘అసమానత’ గురించి ప్రస్తావించారు. 1991లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి మూడు దశాబ్దాలైన సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఆయనో వ్యాసం రాశారు. ఇండియాలో మూడు దశాబ్దాల ఆర్థిక సంస్కరణలు పౌరులకు అసమానంగా ప్రయోజనాలను చేకూర్చాయని అంబానీ పేర్కొన్నారు. కొరతల నుంచి సమృద్ధి వరకు పయనించిన ఇండియా, 2051 నాటికి సమాన, సుస్థిర శ్రేయో వ్యవస్థగా రూపాంతరం చెందాల్సి ఉందన్నారు.

2021-07-24

గాంధీనగర్ రైల్వే స్టేషన్ పైన నిర్మించిన ఐదు నక్షత్రాల హోటల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ తరహా హోటల్ నిర్మాణం ఇండియాలో మొదటిగా మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనే చేపట్టారు. ఈ విలాసవంతమైన హోటల్ ను రైల్వే శాఖ, గాంధీనగర్ రైల్వే- అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జి.ఎ.ఆర్.యు.డి) సంయుక్తంగా చేపట్టాయి. దీంతోపాటు ప్రధాని అహ్మదాబాద్ సైన్స్ సిటీనీ, కొత్త రైళ్ళను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

2021-07-16
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page