భారత దేశం - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ప్రవహిస్తున్న 54 నదులు, వాటి చుట్టూ అల్లుకున్న జానపద గాథలు ఇరు దేశాల ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి సాక్ష్యాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మంగళవారం మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కుషియారా నదీ జలాల పంపిణీపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో ఇండియా వైపు దక్షిణ అస్సాం ప్రాంతానికి, బంగ్లాదేశ్ వైపు సిల్హెట్ ప్రాంతానికి ప్రయోజనం కలగనుంది.

2022-09-06

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ను కలిశారు. నర్సాపురంలో తాను భగవత్ ను కలసి ఆయన ఆశీస్సులు తీసుకున్నట్టు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో వెల్లడించారు. భగవత్ మార్గదర్శక వాక్కులు వినే గొప్ప అవకాశం లభించిందని వైసీపీ ఎంపీ పేర్కొన్నారు. మోహన్ భగవత్ పశ్చిమ గోదావరి జిల్లాలో ‘గోదావరి సంగమం’ పేరిట జరిగిన ఆర్ఎస్ఎస్ సభలకు హాజరయ్యారు. ఆయన తిరిగి వెళ్తున్న సమయంలో రైలులో ఎంపీ కలిశారు.

2021-12-27

ఆగస్టు 14ను ‘విభజన ఘోరాల స్మారక దినం’గా పాటిస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీకి మహాత్మాగాంధీ మనుమడు రాజ్ మోహన్ గాంధీ ఓ సూటి ప్రశ్న వేశారు. ‘మతి లేని విద్వేషానికి, హింసకు లక్షలాది మంది మన సోదరీ సోదరులు నిరాశ్రయులయ్యారు, చాలా మంది మరణించారు’ అని మోదీ చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ, ‘మన సోదర సోదరీమణుల్లో నిరాశ్రయులైన లేదా చంపబడ్డ ముస్లింలను కూడా చేర్చారా?’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ‘అవును’ అని మోదీ సమాధానం చెబితే అది ఒక కొత్త రోజు అవుతుందని గాంధీ ఎన్.డి. టీవీకి రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

2021-08-18

ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రధాన పూజారి పోస్టుకు ‘మళయాళ బ్రాహ్మణులు’ మాత్రమే అర్హులని పేర్కొంటూ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ పై స్టే ఇవ్వడానికి కేరళ హైకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని సవివరంగా పరిశీలించాల్సి ఉందని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని జస్టిస్ సి.టి. రవికుమార్, జస్టిస్ మురళి పురషోత్తమన్ లతో కూడిన బెంచ్ పేర్కొంది. బోర్డు నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరుతూ పూజారి విష్ణునారాయణన్ పిటిషన్ దాఖలు చేశారు. ఒక్క కులం తప్ప మిగిలిన అర్హతలు ఉన్న మరికొంతమంది కూడా కోర్టును ఆశ్రయించారు.

2021-07-28

కాకతీయ రాజులు 13వ శతాబ్దంలో నిర్మించిన రామప్ప (రుద్రేశ్వర) దేవాలయాన్ని చారిత్రక సాంస్కృతిక సంపదగా ‘యునెస్కో’ గుర్తించింది. తెలంగాణలోని నేటి ములుగు (పాత వరంగల్) జిల్లాలో ఈ శైవ ఆలయం ఉంది. ఇక్కడి శిల్పాలు గొప్ప కళాత్మక నాణ్యతతో ప్రాంతీయ నృత్య రీతులను, కాకతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని యునెస్కో ఒక ప్రకటనలో పేర్కొంది. చైనాలోని సాంగ్-యువాన్ ప్రపంచ ఎంపోరియాన్ని, ఇరాన్ లోని ట్రాన్స్-ఇరానియన్ రైల్వేను, స్పెయిన్ లోని పాసియో డెల్ ప్రాడో - బ్యూన్ రెటిరో సాంస్కృతిక ప్రదేశాన్ని కూడా యునెస్కో తాజాగా గుర్తించింది.

2021-07-25

మాంసాహారం తినడం కూడా నేరం అన్నట్టుగా ఆటవికంగా మూక హత్యలు చేసిన ఉదంతాలు గత ఏడేళ్లలో ఎన్నో వెలుగు చూశాయి. వాటిపైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ తాజాగా స్పందించారు. మూక హత్య (Lynching)లకు పాల్పడినవారు హిందూత్వ వ్యతిరేకులని భగవత్ వ్యాఖ్యానించారు. విశ్వాసాలను బట్టి ప్రజలను విభజించకూడదని కూడా ఆయన పేర్కొన్నారు. దేశంలో ఐక్యత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్న భగవత్, ఐక్యతకు ప్రాతిపదిక జాతీయత, పూర్వీకుల వైభవమేనని సూత్రీకరించారు.

2021-07-04

వ్యవస్థీకృత జాతి వివక్షను ధ్వంసం చేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ మెచెలి బాచెలెట్ పిలుపునిచ్చారు. వ్యవస్థీకృతమైన వివక్షకు సంస్థాగతమైన స్పందన తప్పదని స్పష్టం చేశారు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ను శ్వేతజాతి పోలీసు అధికారి క్రూరంగా గొంతుపై తొక్కి చంపిన ఉదంతం నేపథ్యంలో జరిగిన అధ్యయనానికి సంబంధించిన నివేదికను ఆమె సోమవారం విడుదల చేశారు. అమెరికా, యూరప్ ఖండాల్లో 250 మంది ఆఫ్రికన్లు మరణించగా, అందులో కనీసం 190 మంది పోలీసు వ్యవస్థల చేతుల్లోనే బలయ్యారని చెప్పారు.

2021-06-28 Read More

నేపాల్ మాజీ రాజు గ్యానేంద్ర, రాణి కోమల్ రాజ్య లక్ష్మీదేవి కరోనా బారిన పడ్డారు. ఆ దంపతులిద్దరూ కొద్ది రోజుల క్రితం ఇండియా వచ్చి హరిద్వార్ లో కుంభమేళాలో పాల్గొన్నారు. ఏప్రిల్ 11న హరిద్వార్ చేరుకున్న గ్యానేంద్ర అక్కడ నిరంజని అఖారాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ కైలాసానంద గిరిని కలుసుకున్నారు. మాస్కు లేకుండానే సాధువులు, భక్తులతో చర్చించారు. గ్యానేంద్రను మత పెద్దలు ‘హిందూ సమ్రాట్’గా కీర్తించారు. సత్కరించారు. ఏప్రిల్ 12న నిరంజని అఖారా ప్రదర్శనలో కూడా గ్యానేంద్ర పాల్గొన్నారు.

2021-04-20

ముస్లింలతో ఐక్యతా ప్రక్రియను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు విచ్ఛిన్నం చేశారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఐక్యతా మార్గం నుంచి ముస్లింలను వేరు చేయడానికి వారిలో వేర్పాటు భావనను ఔరంగజేబు కల్పించారని భగవత్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆదివారం ‘ఐతిహాసిక కాలజ్ఞానం: ఒక భారతీయ వివేచన’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి భగవత్ హాజరయ్యారు. భారతీయ దృక్పథం నుంచి దేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ‘మేధో యోధులు’ అవసరమని భగవత్ పేర్కొన్నారు.

2021-02-21

కరోనా మహమ్మారి దేశంపై విరుచుకుపడకుండా ఏ దేవుడూ ఆపలేదు. ఆ వర్గం, ఈ వర్ణం అనే తేడా లేకుండా అన్ని సమూహాలకూ వ్యాపించింది. వైరస్ దెబ్బకు అన్ని మతాల దేవాలయాలనూ మూసివేశారు. ఏ దైవదూతా విరుగుడును కనిపెట్టలేదు. వైరస్ సోకినవారిని రక్షించడానికీ, ఇప్పుడు టీకా రూపంలో విరుగుడును తేవడానికి కృషి చేసింది డాక్టర్లు, శాస్త్రవేత్తలు. ఆ కృషిలో ఇంకా అనేక మంది భాగస్వాములు. టీకా పంపిణీ సమయానికి మాత్రం దేవుళ్లు వచ్చేశారు! టీకాల డబ్బాకు హారతులిస్తున్న మహిళామణులను పై ఫొటోలో చూడండి. ఈ అజ్ఞానానికి మందుందా?

2021-01-15
First Page 1 2 3 4 5 6 7 8 9 10 Last Page