రష్యాలో సుఖోయ్ సూపర్ జెట్ 100 విమానం అత్యవసరంగా నేలకు దించే సమయంలో దగ్ధమై 41 మంది మరణించారు. ప్రమాద సమయంలో సిబ్బందితో కలసి మొత్తం 78 మంది విమానంలో ఉండగా 37 మంది బయటపడ్డారు. విమానం మాస్కో నుంచి ముర్ మాన్స్క్ వెళ్ళడానికి టేకాఫ్ అయిన అరగంట లోపే అత్యసవర స్థితి నెలకొంది. దీంతో మాస్కోలోని షెరెమెట్యెవో విమానాశ్రయానికి మరలించారు. అయితే, విమానం అతి వేగంతో రన్ వేపై దిగడంతో మంటలు చెలరేగాయి. తప్పించుకునే సమయం కూడా లేక సగం మందికి పైగా ప్రయాణీకులు ఆహుతైపోయారు.
2019-05-05 Read Moreగత 48 గంటల్లో తాము 350 ఇస్లామిక్ జీహాదీ, హమస్ లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. హమస్ రాకెట్ లాంచింగ్ ప్రదేశాలు, ఉగ్రవాద దళాలు, కమాండ్&శిక్షణా కేంద్రాలు, ఆయుధ స్థావరాలు, నిఘా పోస్టులు, మిలిటరీ ఆవరణలు తమ లక్ష్యాల్లో ఉన్నాయని ఇజ్రాయిల్ సోమవారం ఉదయం ప్రకటించింది. అదే 48 గంటల్లో గాజా నుంచి ఇజ్రాయిల్ పౌరులపై 690 రాకెట్లు ప్రయోగించారని, వాటిలో 240 రాకెట్లను ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ మిసైళ్ళు కూల్చేశాయని ఐడిఎఫ్ ట్విట్టర్లో పేర్కొంది.
2019-05-06 Read Moreబీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఉత్తరప్రదేశ్ ఎస్.పి.- బి.ఎస్.పి. కూటమి నేతలను పాకిస్తానీయులుగా అభివర్ణించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకోసం అయోధ్యకు వెళ్తున్న కరసేవకులపై అప్పటి యూపీ సిఎం, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కాల్పులు జరిపారని, ఆ సందర్భంలో 500 మంది చనిపోయారని వరుణ్ గాంధీ ఆరోపించారు. వరుణ్ గాంధీ ఈసారి తన తల్లి మేనకా గాంధీ స్థానమైన పిలిభిత్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇంతకు ముందు వరుణ్ గాంధీ పోటీ చేసిన సుల్తాన్ పూర్ లోక్ సభ స్థానం నుంచి ఈసారి మేనకా గాంధీ పోటీ చేస్తున్నారు.
2019-05-06 Read Moreలోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ రోజున ఉదయం 9:00 గంటల సమయానికి 51 లోక్ సభ నియోజకవర్గాల్లో సగటున 11.68 శాతం ఓట్లు నమోదయ్యాయి. అత్యధికంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఏడు నియోజకవర్గాల్లో సగటున 14.49 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్ లోని లడక్ నియోజకవర్గంలో కేవలం 0.80 శాతం ఓట్లు పోలయ్యాయి. ఉత్తరప్రదేశ్ 14 నియోజకవర్గాల్లో 9.82 శాతం, బీహార్ ఐదు నియోజకవర్గాల్లో 11.51 శాతం, మధ్యప్రదేశ్ 7 నియోజకవర్గాల్లో 11.82 శాతం, రాజస్థాన్ 12 నియోజకవర్గాల్లో 13.38 శాతం, జార్ఖండ్ 4 నియోజకవర్గాల్లో 13.46 శాతం పోలింగ్ నమోదైంది.
2019-05-06మహర్షి సినిమా విడుదలకు మరో మూడు రోజులే ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 04:05 గంటలకు ‘‘చోటి చోటి బాతే’’ పాట వీడియో ప్రివ్యూ ఉంటుందని చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి తెలిపారు. మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్ స్నేహంపై చిత్రించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
2019-05-062019 లోక్ సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. 7 రాష్ట్రాల్లోని 51 లోక్ సభ స్థానాలకు ఈ దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ దిగ్గజాలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలు కూడా వీటిలో ఉన్నాయి. మొత్తంగా 96,088 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 8.76 కోట్ల మంది ఓటర్లు నమోదై ఉన్నారు. ఐదో విడత పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్ల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. మహిళా ఓటర్లు 4.13 కోట్లు కాగా, పురుష ఓటర్లు 4.63 కోట్లు.
2019-05-06ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈవీఎంలకు అనుసంధానమైన వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశంపై 23 పార్టీలు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో... చంద్రబాబు ఢిల్లీలో వివిధ పార్టీల నేతలతో చర్చించనున్నారు. మంగళవారం రాత్రికి ఢిల్లీ నుంచి కోల్ కత వెళ్తారు. పశ్చిమ బెంగాల్ లోక్ సభ ఎన్నికల్లో మమతా బెనర్జీకి మద్ధతుగా చంద్రబాబు 8, 9 తేదీల్లో ప్రచారం చేయనున్నారు. తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు.
2019-05-06ప్రముఖ ప్రజా గాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు (65) ఆదివారం గుండెపోటుతో మరణించారు. శనివారం రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో హైదరాబాద్ విద్యానగర్ లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొదుతుండగానే గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. రామారావు భౌతిక కాయాన్ని విద్యానగర్ సంస్థ కార్యాలయం (మార్క్స్‌భవన్)లో ఉంచారు. సోమవారం ఉదయం 10 గంటలకు రామారావు అంత్యక్రియలు హైదరాబాద్ అంబర్ పేట స్మశానవాటికలో నిర్వహించనున్నారు.
2019-05-05ఎన్నికల్ కోడ్ పేరిట అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు పనుల సమీక్షను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్ళీ ప్రారంభించారు. సోమవారం ఆయన నేరుగా ప్రాజెక్టు స్థలం వద్దకు వెళ్లి పనులను పర్యవేక్షించబోతున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11న అసెంబ్లీకి, లోక్ సభ సీట్లకు పోలింగ్ పూర్తయినా మే 23వ తేదీవరకు కోడ్ అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో...పోలింగ్ ముగిశాక పోలవరంపై చంద్రబాబు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం వివాదాస్పదమైంది. దాంతో గత రెండు వారాల్లో సమీక్ష చేయలేదు.
2019-05-06తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సోమవారం జరగనుంది. 195 జడ్పీటీసీ, 2097 ఎంపీటీసీ స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగాల్సి ఉండగా వాటిలో రెండు జడ్పీటీసీలు, 69 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 539 జడ్పీటీసీ, 5857 ఎంపీటీసీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 1,56,55,897గా ఉంది. తొలి విడత ఎంపీటీసీ స్థానాలకు 7072 మంది, జడ్పీటీసీ స్థానాలకు 882 మంది పోటీ పడుతున్నారు. ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ జరుగుతుంది.
2019-05-06 Read More