ఢిల్లీలో దాడులకు గురై ఓ చిన్న ఆసుపత్రిలో చిక్కుకున్న బాధితులకోసం అర్దరాత్రి తన ఇంటినే కోర్టుగా మార్చిన న్యాయమూర్తి.. 1984 ఘటనలను పునరావృతం కానివ్వబోమన్న ధీశాలి.. జస్టిస్ మురళీధర్ హఠాత్తుగా బదిలీ అయ్యారు. బదిలీ ప్రతిపాదన కొద్ది రోజుల క్రితం చేసిందే అయినా.. బుధవారం రాత్రికి రాత్రి రాష్ట్రపతి నోటిఫికేషన్ (పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ) జారీ చేయడం ఆశ్చర్యకరం. ఢిల్లీ హత్యాకాండపై విచారణ కోరినవారి విన్నపాన్ని ఢిల్లీ హైకోర్టు వినబోతున్న తరుణంలో.. జరిగిన ఈ బదిలీ సాధారణం కాదు.
2020-02-26ఆర్థిక మందగమనం సామాన్యులను బాధిస్తున్న వేళ అంబానీ (ముఖేష్) మాత్రం ప్రపంచ కుబేరుల జాబితాలో పైపైకి పోతున్నారు. చైనా సంస్థ ‘హురూన్’ తాజాగా వెలువరించిన మహా సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ 9వ స్థానాన్ని సాధించారు. అంబానీ సంపద గత ఏడాది కంటే 24 శాతం పెరిగి 67 బిలియన్ డాలర్లకు (రూ. 4.8 లక్షల కోట్లకు) చేరింది. జెఫ్ బెజోస్ సంపద 5 శాతం తగ్గినా నెంబర్ 1 స్థానంలో ($140 బిలియన్) కొనసాగగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ ($107 బిలియన్), బిల్ గేట్స్ ($106 బిలియన్), వారెన్ బఫెట్ ($106 బిలియన్)తో తర్వాత స్థానాల్లో ఉన్నారు.
2020-02-26 Read Moreమతోన్మాదం ఢిల్లీని తగలబెడుతోంది. ఖజూరికాస్ ప్రాంతానికి 1.5 కిలోమీటర్ దూరంలో గామ్రి ఎక్స్టెన్షన్లో ఓ 85 ఏళ్ల మహిళ (అక్బారి)ని సజీవ దహనం చేశారు ఉన్మాద మూక. ‘జై శ్రీరాం’ నినాదాలు చేస్తూ ఓ 100 మంది గుంపు మంగళవారం ఆ ప్రాంతంలో చెలరేగిపోయారు. ముస్లింల ఇళ్లు, షాపులు లక్ష్యంగా దాడులు చేశారు. ఈ క్రమంలోనే రెడీమేడ్ వస్త్రాల వ్యాపారి మహ్మద్ సయాద్ సల్మాని భవనానికి నిప్పు పెట్టారు. నాలుగు అంతస్థుల ఆ భవనం మూడో అంతస్తులో ఉన్న సల్మాని తల్లి అక్బారి మంటల్లో చిక్కుకొని చనిపోయారు.
2020-02-26 Read More‘‘సరైన సమయం అంటే ఎప్పుడు మిస్టర్ మెహతా?! నగరం తగలబడుతోంది’’- విద్వేష ప్రసంగాలపై ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేయకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు భారత సొలిసిటర్ జనరల్ (ఎస్.జె)కు వేసిన ప్రశ్న ఇది. పిటిషనర్లు కేవలం మూడు వీడియో క్లిప్పులను మాత్రమే సమర్పించడాన్ని ప్రశ్నించిన ఎస్.జె, కేసు నమోదుకు ఇది సమయం కాదని వాదించారు. ఆ వాదనను కొట్టిపారేసిన జస్టిస్ మురళీధర్ ‘‘ఆస్తుల ధ్వంసంపై ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేసినవారు.. ఈ ప్రసంగాలపై ఎందుకు చేయడంలేదు? మీరు ఆ నేరాన్నే గుర్తించడంలేదా?’’ అని ప్రశ్నించారు.
2020-02-26 Read Moreఢిల్లీ హత్యాకాండలో ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ ఒకరు ప్రాణాలు కోల్పాయారు. అంకిత్ శర్మ అనే ఆ యువ అధికారి మృతదేహాన్ని బుధవారం ‘చాంద్ బాగ్’లోని ఓ మురికి కాల్వలో కనుగొన్నారు. శర్మ 2017లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరారు. చాంద్ బాగ్ ప్రాంతంలో నివశిస్తున్న అంకిత్ శర్మ, మంగళవారం సాయంత్రం అల్లర్లు జరుగుతున్న వేళ ఇంటికి వస్తుండగా దుండగులు దాడి చేసినట్టు సమాచారం. అప్పటినుంచి ఆయన కనిపించడంలేదు. అంకిత్ తండ్రి రవీందర్ శర్మ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేశారు.
2020-02-26మూడు రోజుల క్రితం బిజెపి నేత కపిల్ మిశ్రా చేసిన విద్వేష ప్రసంగం వీడియోను ఢిల్లీ హైకోర్టు బుధవారం వీక్షించింది. హింసాకాండకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ లపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్. మురళీధర్, జస్టిస్ తల్వంత్ సింగ్.. పోలీసుల ప్రేక్షక పాత్రపై చీవాట్లు పెట్టారు. దాడులకు ప్రేరేపించినవారిని వదిలేయకపోయి ఉంటే పరిస్థితి తీవరించేది కాదని వారు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ తరపున హాజరయ్యానన్న భారత సొలిసిటర్ జనరల్ (ఎస్.జి)పై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.
2020-02-26 Read Moreఢిల్లీ హింసాకాండలో గాయపడిన 22 ముస్లింలను ముస్తఫాబాద్ లోని చిన్న క్లినిక్ నుంచి పెద్ద ఆసుపత్రికి తరలించేందుకు తగిన భద్రత కల్పించాలని పోలీసు అధికారులను హైకోర్టు ఆదేశించింది. అసాధారణంగా మంగళవారం అర్ద రాత్రి దాటాక 12.30 గంటలకు జస్టిస్ ఎస్. మురళీధర్ ఇంటిలోనే ప్రత్యేకంగా విచారణ జరిపి ఉత్తర్వులు ఇచ్చింది. దాడుల్లో గాయపడిన ముస్లింలు ముస్తఫాబాద్ లోని చిన్న క్లినిక్ (అల్ హింద్ ఆసుపత్రి)లో చేరారు. వారిని జీటీబీ ఆసుపత్రికి వెళ్లలేకపోతున్నారని న్యాయవాది సురూర్ మందర్ న్యాయమూర్తులకు నివేదించారు.
2020-02-26 Read Moreఈశాన్య ఢిల్లీ హింసాకాండ తీవ్ర రూపం దాల్చడంతో మంగళవారం రాత్రి నాలుగుచోట్ల కర్ఫ్యూ విధించారు. మౌజ్ పూర్, జఫ్రాబాద్, చాంద్ బాగ్, కరవాల్ నగర్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి... ‘కనిపిస్తే కాల్చివేయమని’ ఉత్తర్వులు ఉన్నాయని, అందువల్ల వీధుల్లోకి రావద్దని మైకుల్లో హెచ్చరికలు జారీ చేశారు. అధికారికంగా మాత్రం ‘కనిపిస్తే కాల్చివేత’ ఆదేశాలు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. అల్లరి మూకలను గుర్తించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. అల్లర్లపై 11 ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
2020-02-25ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఇ.డి.బి) మాజీ సీఈవో జె. కృష్ణకిషోర్ సస్పెన్షన్ ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) రద్దు చేసింది. ఐఆర్ఎస్ అధికారి అయిన కృష్ణకిషోర్ తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతిస్తూ... ఆయనకు నిలిపివేసిన జీతభత్యాలను చెల్లించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చంద్రబాబు హయాంలో కీలక పాత్ర పోషించిన కృష్ణకిషోర్ పైన కొత్త ప్రభుత్వం అవినీతి ఆరోపణలు మోపి సస్పెండ్ చేసింది. దీంతో ఆయన ‘క్యాట్’ను ఆశ్రయించారు.
2020-02-25రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూముల్లో 1251.5 ఎకరాలను పేదల ఇళ్ళ స్థలాలకోసం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అది కూడా రాజధాని వెలుపల ప్రాంతాల్లోని వారికి కావడం గమనార్హం. పెద కాకాని, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలు, విజయవాడ నగరంలోని మొత్తం 54,307 మందికి సెంటు చొప్పున స్థలం ఇస్తామని జీవోలో పేర్కొన్నారు. నవులూరు, క్రిష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడం గ్రామాలకు చెందిన భూమిని ఇందుకోసం వినియోగించనున్నారు.
2020-02-25