ప్రపంచం అప్పు రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం పబ్లిక్, ప్రైవేటు మొత్తం అప్పు 188 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ. 13,350 లక్షల కోట్లు)గా ఉందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా చెప్పారు. ప్రపంచం మొత్తం చేస్తున్న ఉత్పత్తి విలువకు ఇది 230 శాతం. 2016లో 164 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ప్రపంచ అప్పు కొద్ది కాలంలోనే అసాధారణంగా పెరిగింది. మొత్తం అప్పుల్లో ప్రైవేటు రంగం రుణాల వాటా ఎక్కువ. దీంతో ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు ప్రభుత్వాలు, ప్రజలు ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తోందని క్రిస్టలినా చెప్పారు.
2019-11-07 Read Moreఊహించినట్టుగానే ఉల్లిపాయ ధర రూ. 100ను తాకింది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీలోని కొన్ని మార్కెట్లలో ఈ వారం ఉల్లి రిటైల్ ధర కేజీకి రూ. 100 పలికింది. దక్షిణ భారతంలోని చాలా మార్కెట్లలో కేజీకి రూ. 80 నుంచి 90 వరకు పలికింది. మహారాష్ట్రలోని హోల్ సేల్ మార్కెట్లలో కేజీ రూ. 55 చొప్పున అమ్ముడైనట్టు వ్యాపార వర్గాల సమాచారం. అయితే, వచ్చే 15 రోజుల్లో 3000 టన్నుల ఉల్లిపాయలు దిగుమతి అవుతున్నందున ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు.
2019-11-07 Read Moreతెలుగు అగ్ర కథానాయకుడు మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా వెండితెరపై కనిపించబోతున్నాడు. ఒక ప్రేమకథతో అశోక్ గల్లా సినీ ప్రపంచానికి పరిచయం కాబోతున్నాడు. ఇంకా పేరు పెట్టని ఆ సినిమా నవంబర్ 10వ తేదీన హైదరాబాద్ నగరంలో ప్రారంభం కాబోతోంది. శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో అశోక్ తల్లి పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
2019-11-07రో‘హిట్’ శర్మ మరోసారి విశ్వరూపం చూపించాడు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండో టి20 పోటీలో 43 బంతుల్లో 85 పరుగులు బాది ఇండియాకు తేలిగ్గా విజయాన్ని అందించాడు. అందులో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 154 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఇది తేలికపాటి లక్ష్యమే. అయితే, మొదటి టి20 పోటీలో బంగ్లాదేశ్ అనూహ్య విజయం సాధించిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఇండియా కేవలం 15.4 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ ను సమం చేసింది. ఇక 3వ టి20 ఎవరు గెలిస్తే వారిదే సిరీస్.
2019-11-07సామాజిక మాథ్యమాల్లో ఆధ్యాత్మిక గురువులు, బాబాలుగా దర్శనమిస్తున్నవారికి దూరంగా ఉండాలని భారత ఆర్మీ తన జవాన్లను హెచ్చరించింది. ఆర్మీ గుట్టు తెలుసుకోవడానికి పాకిస్తాన్ ఏజంట్లు ఆధ్యాత్మిక అవతారం ఎత్తుతున్నారని వచ్చిన సమాచారంతో ఈ హెచ్చరిక చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో సైనిక దళాల కదలికలపై సమాచారం సేకరించేందుకు పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజంట్లు ఆధ్యాత్మిక గురువుల్లా జవాన్లకు వల విసురుతున్నారని ఓ ఆర్మీ అధికారి గురువారం చెప్పారు. 150 ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించారు.
2019-11-07ఇండియా, బంగ్లాదేశ్ మధ్య టి20 సిరీస్ రెండో పోటీలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 153 పరుగులు చేసింది. గురువారం రాజ్ కోట్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలో నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయింది. తొలి మ్యాచ్ లో అసాధారణ విజయాన్ని నమోదు చేసిన బంగ్లాదేశ్ సిరీస్ (మూడు మ్యాచ్ ల)ను గెలవడంకోసం ప్రయత్నిస్తోంది.
2019-11-07ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇటీవల మధు రెండు మోకాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. తాడేపల్లిలో సిఎం నివాసానికి దగ్గర్లోనే మధు నివాసం కూడా ఉంది.
2019-11-07ఆర్టీసీపై తప్పుడు సమాచారం ఇచ్చారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో... తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు క్షమాపణ చెప్పారు. రికార్డులను పూర్తిగా పరిశీలించాక తాజా నివేదిక ఇచ్చామని రామకృష్ణారావు చెప్పడంతో... ఇంతకు ముందు నివేదికను పరిశీలించకుండానే ఇచ్చారా? అని ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాటుకు మన్నించాలని రామకృష్ణారావు కోరగా... క్షమాపణలు చెప్పడం తమ ప్రశ్నలకు సమాధానం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
2019-11-07ఆర్టీసీపై అధికారులు సమర్పించిన రెండు నివేదికల్లో పొంతన లేని లెక్కలపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డట్టారంటూ తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.కె. జోషి మాట్లాడుతూ... హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడం తాను ఇదివరకు పని చేసిన రాష్ట్రాల్లో చూడలేదని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాలతో గురువారం విచారణకు రామకృష్ణారావుతో పాటు ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ సునీల్ శర్మ హాజరయ్యారు.
2019-11-07గురువారం అమరావతి సచివాలయంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) సమావేశం జరుగుతుండగా ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. అధికారులతో సమావేశం ముగిశాక సభ్యులతో చర్చిస్తుండగా ఆయనకు చెమటలు పట్టి వాంతి కావడంతో సచివాలయంలోనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత విజయవాడకు తరలించారు. అయితే, తరలించాలని నిర్ణయించిన తర్వాత ఆంబులెన్స్ రావడానికి అరగంట పట్టడం చర్చనీయాంశమైంది.
2019-11-07