2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి 290కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించారు. ఇప్పుడాయన తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే తరహాలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించారు. స్వరూపానంద సూచనలమేరకు నిన్న 9 లోక్ సభ స్థానాలకు మాత్రం అభ్యర్ధుల ప్రకటన చేసిన జగన్, ఆదివారం మిగిలిన ఎంపీ అభ్యర్ధులను కూడా ప్రకటించారు.
2019-03-17సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. శనివారం అర్ధరాత్రి దాటాక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తే సమావేశమైన లక్ష్మీనారాయణ, ఆదివారం ఉదయం లాంఛనంగా పార్టీలో చేరారు. లక్ష్మీనారాయణతోపాటు ఆయన తోడల్లుడు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ మాజీ ఉపకులపతి రాజగోపాల్ కూడా జనసేనలో చేరారు. 2014లో పార్టీ ఏర్పాటుకు కొద్ది రోజులు ముందే కలసి పని చేద్దామని లక్ష్మీనారాయణను తాను ఆహ్వానించానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పారు.
2019-03-172019 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల జాబితాలు విడుదలయ్యాయి. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయ లోని తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ప్రెస్ మీట్ లైవ్ చూడండి.
2019-03-17మోదీ - షా బృందానికి గట్టి వ్యతిరేకిగా ఉన్న బీజేపీ నేత శత్రుఘ్న సిన్హాకు ఈసారి పార్టీ లోక్ సభ సీటు దక్కే అవకాశం లేదు. ఆయన ప్రాతినిధ్యం వహించిన పాట్నా సాహిబ్ లోక్ సభ స్థానం నుంచి ఈసారి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పోటీ చేయవచ్చని తెలుస్తోంది. మరోవైపు.. శత్రుఘ్న సిన్హా కూడా మళ్లీ అదే స్థానం నుంచి మహాకూటమి అభ్యర్ధిగానో లేక స్వతంత్రంగానో పోటీ చేేసే అవకాశం ఉంది. ‘‘ఎన్నికలకు సంబంధించినంతవరకు పాట్నా నా మొదటి, రెండవ, చివరి ఛాయిస్’’ అని సిన్హా ఇంతకు ముందే చెప్పారు.
2019-03-17 Read Moreసీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం అర్ధరాత్రి దాటాక సమావేశమయ్యారు. కొంత కాలం క్రింత స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి ప్రవేశించారు. సొంత పార్టీ ఏర్పాటు చేసి పోటీ చేయాలని ప్రయత్నించిన ఆయన తర్వాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అధికార తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని ఇటీవల ఆయనపై ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ జనసేన అధినేతతో భేటీ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2019-03-17తెలుగుదేశం పార్టీ నేతలు ఆదాల ప్రభాకరరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారంనాడు వైఆస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వై.ఎస్.ఆర్.సి. తరపున గెలిచి తర్వాత టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుక తిరిగి సొంత గూటికి చేరారు. మరోవైపు మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా శనివారమే వై.ఎస్.ఆర్.సి. తీర్ధం పుచ్చుకున్నారు. వీరిలో ఆదాల ప్రభాకరరెడ్డిది ప్రత్యేకమైన కథ. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్ధుల మొదటి జాబితాలో నెల్లూరు రూరల్ స్థానాన్ని ఆదాలకు కేటాయించారు. సీటు ప్రకటించిన రెండు రోజుల్లోనే ఆయన పార్టీ మారడం గమనార్హం.
2019-03-17వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ ను కోరారు. పార్టీ సీనియర్లతో సహా శనివారం గవర్నర్ ను కలసిన జగన్, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ‘సిట్’తో న్యాయం జరగదని ఉద్ఘాటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన జగన్, హత్యలో చంద్రబాబు ప్రమేయం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ‘వాళ్లే హత్య చేయిస్తారు. వాళ్ళే దొంగ దొంగ అంటారు’ అని జగన్ వ్యాఖ్యానించారు.
2019-03-17ఏపీ అసెంబ్లీ ఎన్నికలకోసం 15 మందితో టీడీపీ రెండో జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. నిమ్మక జయకృష్ణ (పాలకొండ), ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ (పిఠాపురం), వంతాల రాజేశ్వరి (రంపచోడవరం), గన్ని వీరాంజనేయులు (ఉంగుటూరు), కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ (పెడన), ఉప్పులేటి కల్పన (పామర్రు), పర్స వెంకటరత్నం (సూళ్ళూరుపేట), బండి జయరాజు (నందికొట్కూరు), బిసి జనార్ధనరెడ్డి (బనగానపల్లె), కాలవ శ్రీనివాసులు (రాయదుర్గ్), పయ్యావుల కేశవ్ (ఉరవకొండ), జెసి అస్మిత్ రెడ్డి (తాడిపత్రి), కె. ఈరన్న (మడకశిర), దమ్మాలపాటి రమేష్ (మదనపల్లి), ఎఎస్ మనోహర్ (చిత్తూరు) ఈ జాబితాలో ఉన్నారు.
2019-03-17‘‘చనిపోయింది మీ చిన్నాన్న అనే మానవత్వం కూడా లేకుండా దోషులను కాపాడే ప్రయత్నం చేస్తారా’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ఉద్ధేశించి ప్రశ్నించారు. శనివారం తిరుపతిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన చంద్రబాబు, వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని బహిరంగ సభలో ప్రస్తావించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని సాక్ష్యాలను తారుమారు చేశారని, అలా చేసినవారు శిక్షార్హులని చంద్రబాబు విమర్శించారు.
2019-03-17విశాఖపట్నంలోని శారదా పీఠం అధిపతి స్వరూపానంద సూచనమేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు తొమ్మిది లోక్ సభ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధుల ఎంపికను పూర్తి చేసినా తొలి జాబితాను 9 లోక్ సభ స్థానాలకే పరిమితం చేశారు. పార్టీ అధ్యక్షులు, కోర్ కమిటీ చర్చించి మొత్తం అభ్యర్ధుల ఎంపికను పూర్తి చేసినట్టు రాజ్యసభ సభ్యలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. మిగిలిన అభ్యర్ధుల జాబితాను ఆదివారంనాడు ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారు.
2019-03-16