వివాదాస్పద రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు శనివారం ఉదయం తీర్పు ఇచ్చింది. వివాదాస్పద 2.7 ఎకరాల స్థలంలో రామాలయం నిర్మించాలని, మసీదు కోసం 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాబ్రీ మసీదు కూల్చివేతను చట్ట విరుద్ధ చర్యగా ప్రకటిస్తూనే.. ఆ స్థలం రామ జన్మభూమిగా ఉన్న విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ తీర్పు చెప్పింది. మసీదు కింద మరో నిర్మాణం ఉందన్న ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికను ఉటంకించింది.
2019-11-09అయోధ్య రామ జన్మభూమి - బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు శనివారం ఉదయం 10:30 గంటలకు తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపిన విషయం తెలిసిందే. 40 రోజుల పాటు నిత్యం చేపట్టిన హియరింగ్ ఈ నెల 16న ముగిసింది. ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసే (17వ తేదీ) లోపు ఈ వివాదంపై తీర్పు ఇవ్వాలనే కృత నిశ్చయంతో త్వరితగతిన విచారణను ముగించారు.
2019-11-08కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లకు కల్పించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) భద్రతను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. జడ్ ప్లస్ కేటగిరి భద్రతను మాత్రం కొనసాగించాలని నిర్ణయించింది. కుటుంబం మొత్తానికి 100 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించనున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాకు అనధికారికంగా వెల్లడించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కల్పించిన ఎస్పీజీ భద్రతను కూడా ఆగస్టులో కేంద్రం ఉపసంహరించింది.
2019-11-08ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని సరిదిద్దే స్థితిలో ప్రభుత్వం లేకపోవడంతో ఇండియా క్రెడిట్ రేటింగ్ ప్రమాదంలో పడింది. మూడీస్ ఇన్వెస్టర్స్ సంస్థ ఇండియా ‘క్రెడిట్ రేటింగ్’ను ‘స్టేబుల్ (స్థిరం)’ నుంచి ‘నెగెటివ్ (నిరాశపూరిత)’ స్థితికి తగ్గించింది. పెట్టుబడి గ్రేడులో మూడీస్ రేటింగ్ స్కేలులో ఉన్న 10 స్థాయిలలో చివరి నుంచి రెండవదైన Baa2కు ఇండియా పడిపోయింది. అప్పుల భారం పెరగడంతోపాటు బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడటాన్ని ‘మూడీస్’ ఎత్తి చూపించింది.
2019-11-08 Read Moreతెలంగాణ ఆర్టీసీ వ్యవహారం మరో కొత్త మలుపు తిరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విభజనే జరగలేదని, తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటుకు తాము అనుమతే ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు తెలిపింది. దీంతో తెలంగాణ ఆర్టీసీ ఉనికే ప్రశ్నార్ధకమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలోనే తమకు 31 శాతం వాటా ఉందన్న కేంద్రం, తమ అనుమతి ఉంటేనే ఆ సంస్థ విభజన జరుగుతుందని హైకోర్టుకు స్పష్టం చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ పొంతన లేని వాదన వినిపించారు.
2019-11-07దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉచితంగా కల్పించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 1548 కోట్లతో చేపట్టిన కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ (కె.ఎఫ్.ఒ.ఎన్)కు ప్రాజెక్టుకు ఆ రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ఇంటర్నెట్ సౌకర్యాన్ని పౌరుల ప్రాథమిక హక్కుగా భావిస్తున్న కేరళ ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికీ కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందులో భాగంగానే 20 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనుంది.
2019-11-07ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సొంత వనరుల ద్వారా సమకూరే ఆదాయం గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గింది. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి 7 (ఏప్రిల్ -అక్టోబర్) మాసాల్లో అన్ని శాఖల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 34,669.96 కోట్లు. గత ఏడాది ఇదే సమయానికి రూ. 35,411.23 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. గత ఏడాది కంటే పెరగవలసిన ఆదాయం నికరంగా 2.10 శాతం తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్నుల రూపంలో రూ. 75,438 కోట్లు, పన్నేతర ఆదాయంగా రూ. 7,355 కోట్లు వస్తాయని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు.
2019-11-07‘అగ్రిగోల్డ్’లో బాధితుల్లో రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసినవారికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేపట్టింది. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా చెల్లింపులను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసినవారు 3.7 లక్షల మంది ఉండగా వారికోసం రూ. 264 కోట్లు కేటాయించినట్టు సిఎం చెప్పారు. త్వరలో రూ. 20 వేల వరకు డిపాజిట్ చేసినవారికి, ఆ తర్వాత ప్రతి డిపాజిటర్ కూ వారి సొమ్ము అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
2019-11-07అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా పోటీ చేయాలని వ్యాపారవేత్త మైకేల్ ఆర్. బ్లూమ్ బెర్గ్ భావిస్తున్నట్టు ఆయన సలహాదారు ఒకరు చెప్పారు. 77 ఏళ్ళ ఈ న్యూయార్క్ నగర మాజీ మేయర్, అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలనుకోవడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మొదట్లో ఓసారి ఆసక్తిని కనబరచి, ఆ తర్వాత మనసు మార్చుకొని డెమోక్రాట్లకు మద్ధతు ఇవ్వడానికి నిర్ణయించారు. అయితే, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధిత్వంకోసం పోటీ పడుతున్నవారిలో ఎవరూ ట్రంప్ ను తట్టుకోలేరని బ్లూమ్ బెర్గ్ భావిస్తున్నారట!
2019-11-08 Read Moreసోషలిస్టు దేశం క్యూబాపై అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య ఆంక్షలకు స్వస్తి పలుకుతూ ఐక్యరాజ్య సమితి గురువారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి మద్ధతుగా ఏకంగా 187 దేశాలు ఓటు వేశాయి. బ్రెజిల్ ఒక్కటే అమెరికాకు మద్ధతుగా ఓటు వేయగా కొలంబియా, ఉక్రెయిన్ గైర్హాజరయ్యాయి. ఫైడెల్ కాస్ట్రో నాయకత్వంలో విప్లవం విజయవంతమయ్యాక 1958లో అమెరికా ఆంక్షల పర్వం మొదలైంది. వీటితో క్యూబా ప్రజలు 922 బిలియన్ డాలర్ల (రూ. 65.46 లక్షల కోట్లు) మేరకు నష్టపోయినట్టు అంచనా.
2019-11-07 Read More