నిన్న అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన వ్యక్తులు సున్నితమైన వివరాలను ‘డార్క్ వెబ్’లో పెట్టినట్టు మహారాష్ట్ర సైబర్ పోలీసు స్పెషల్ ఐజి బ్రిజేష్ సింగ్ మంగళవారం చెప్పారు. మధ్యప్రాచ్యానికి చెందిన హ్యాకర్ పై ‘డార్క్ వెబ్’లో రాత్రంతా అభినందనల వర్షం కురిసినట్టు సమాచారం. కాగా, అదే హ్యాకర్ మంగళవారం పాకిస్తానీ సింగర్ ఆద్నాన్ సమి అకౌంట్ ను హ్యాక్ చేసినట్టు వార్తలు వచ్చాయి. నిన్న రాత్రి అమితాబ్ ప్రొఫైల్ ఫొటో స్థానంలోనూ, ఈరోజు సమి ప్రొఫైల్ ఫొటో స్థానంలోనూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటో పెట్టారు.
2019-06-11 Read Moreదేశీయంగా ఉల్లి ధరలు పెరగడంతో ఎగుమతులను తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఎగుమతి రాయితీ 10 శాతాన్ని ఉపసంహరించింది. తాజా ఉల్లిపాయలు, కోల్డ్ స్టోరేజీలలో నిల్వ ఉన్న సరుకు ఎగుమతులపై ఉన్న రాయితీలను ఉపసంహరిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డి.జి.ఎఫ్.టి) మొన్న నోటీసు ఇచ్చింది. గతంలో ఈ రాయితీ 5 శాతంగా ఉండగా ఎగుమతులను పెంచడంకోసం గత ఏడాది డిసెంబర్ లోనే 10 శాతానికి పెంచారు. ఆ రాయితీ జూన్ 30వ తేదీవరకు అమలు కావలసి ఉంది.
2019-06-11 Read Moreఇండియాలో వాయు కాలుష్యానికి పౌరుల జీవిత కాలం సగటున 2.6 సంవత్సరాలు తగ్గిపోయిందని తాజా అధ్యయనంలో తేలింది. ఇంటా బయటా కాలుష్యం ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతోందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సిఎస్ఇ) నివేదిక తేల్చింది. ఇండియాలో అత్యధిక మరణాలకు కారణాల్లో వాయుకాలుష్యం ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా కొత్తగా పుట్టే పిల్లలు సగటున 20 నెలలు ముందే మరణిస్తారని, ఇండియాలో అయితే 30 నెలలు ముందే మరణిస్తారని సిఎస్ఇ రిపోర్టు పేర్కొంది.
2019-06-11 Read Moreఇండియన్ ఎయిర్ ఫోర్స్ రవాణా విమానం ఎఎన్-32 శకలాలను మంగళవారం కనుగొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ‘లిపో’కు 16 కిలోమీటర్లు ఉత్తరాన సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఈ శకలాలు కనిపించాయి. గాలింపులో పాలు పంచుకున్న ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఎంఐ-17 ఈ శకలాలను కనుగొంది. ఈ నెల 3వ తేదీన 13 మందితో అస్సాంనుంచి బయలుదేరిన అరగంటకు విమానం అదృశ్యమైంది. అప్పటినుంచి ఎస్.యు-30 యుద్ధ విమానాలు, ఎంఐ17 హెలికాప్టర్లు, సి130జె రవాణా విమానాలతో గాలించారు.
2019-06-11 Read Moreప్రయాణ వాహనాల టోకు అమ్మకాలు మే నెలలో 20 శాతం తగ్గిపోయాయి. గత 18 సంవత్సరాల్లో ఇదే అత్యధిక పతనం. 2001 సెప్టెంబర్ మాసంలో అమ్మకాలు 21.91 శాతం తగ్గగా ఆ తర్వాత అంతటి స్థాయి తిరోగమనం ఇప్పుడే నమోదైంది. గత ఏడాది మే నెలలో 3,01,238 వాహనాలు అమ్ముడుపోగా ఈ ఏడాది మే నెలలో కేవలం 2,39,347 అమ్ముడయ్యాయి. గత 11 నెలల్లో 2018 అక్టోబర్ మాసాన్ని మినహాయిస్తే 10 నెలలూ అమ్మకాల్లో తగ్గుదల నమోదైంది. రిటైల్ అమ్మకాల్లో తగ్గుదలతో కార్ల తయారీదారులు ఉత్పత్తిని తగ్గించారు.
2019-06-11 Read Moreసామాజిక మాథ్యమాల్లో షేర్ చేసిన పోస్టులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కించపరిచేలా ఉన్నాయంటూ యూపీ పోలీసులు ముగ్గురు జర్నలిస్టులను, పలువురు ఇతరులను అరెస్టు చేశారు. అందులో ప్రశాంత్ కనోజియా అనే జర్నలిస్టు భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఉదయం ఆమె పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ‘‘ఇది హత్య కేసు కాదు’’ అని యూపీ సర్కారును సుతిమెత్తగా మందలించింది. కేసు కొనసాగించవచ్చన్న సుప్రీం..జర్నలిస్టును మాత్రం బెయిల్ పై విడుదల చేయాలని స్పష్టం చేసింది.
2019-06-11 Read Moreరాష్ట్రంలో విద్యా రంగ పర్యవేక్షణకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. సహేతుకమైన ఫీజులు, విద్యా హక్కు అమలు వంటి అంశాలను సమీక్షించి మంచి విద్యా విధానాన్ని రూపొందించడం కమిషన్ విధి. దీనికి తోడు విద్యా సంస్కరణలకు ఒక కమిటీని కూడా నియమించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25 శాతం సీట్లు పేద, మధ్యతరగతివారికి కేటాయించేలా చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు.
2019-06-10రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1 నుంచి 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. 4.24 లక్షల మంది లబ్ది కలిగే ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ. 815 కోట్లు అదనపు భారం పడుతుందని అంచనా. వివిధ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడానికి ముఖ్యమంత్రి జగన్ ఆరు శాఖల మంత్రులతో ఉపసంఘాన్ని నియమించారు. త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
2019-06-10ఎ.పి.ఎస్. ఆర్.టి.సి.ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. విలీన ప్రక్రియను పర్యవేక్షించడానికి రవాణా, ఆర్థిక శాఖ మంత్రులతో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. వారికి తోడు ఓ నిపుణుల కమిటీ ఉంటుంది. మరోవైపు కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేయడానికి కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దానిపై కార్యాచరణకోసం ఆర్థిక మంత్రి అధ్యక్షతన ప్రభుత్వ కార్యదర్శులతో కమిటీ పని చేయనుంది.
2019-06-10ప్రతి ప్రభుత్వ ప్రథకం ప్రయోజనాలు గడప గడపకూ అందేలా విద్యా వాలంటీర్ల వ్యవస్థ పని చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆగస్టు 15న గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకం జరుగుతుందని సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నారు. పట్టణ వాలంటీర్లకు డిగ్రీ, గ్రామ వాలంటీర్లకు ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో టెన్త్ విద్యార్హతలుగా కేబినెట్ నిర్ణయించింది. గ్రామ సచివాలయాలు అక్టోబర్ 2 నుంచి పని చేస్తాయని సిఎం స్పష్టం చేశారు.
2019-06-10