2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడిని స్మరించుకుంటున్న డిసెంబర్ 13నే... ఇటీవల ప్రారంభించిన నూతన భవనంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ... ఇద్దరు దుండగులు కలర్ స్మోక్ బాంబులు విసిరి కలకలం రేపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితులు సాగర్ శర్మ, మనోరంజన్ సందర్శకుల పాస్ లతో పార్లమెంటు గ్యాలరీలోకి చేరారు. సభ్యులు మాట్లాడుతుండగా సాగర్ శర్మ స్మోక్ బాంబులు విసిరి గ్యాలరీలోనుంచి సభా మందిరంలోకి దూకాడు. అతనిని ఎంపిలు పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మనోరంజన్ ను కూడా పార్లమెంటు లోపలే పట్టుకున్నారు. మరో ఇద్దరిని పార్లమెంటు వెలుపల అరెస్టు చేసినట్టు సమాచారం.
2023-12-13కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన తూర్పు, దక్షిణ తెలంగాణలకే మంత్రివర్గంలో ప్రాధాన్యత లభించింది. గురువారం ప్రమాణం చేసిన 12 మందిలో అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు (ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు) ఉన్నారు. ఉమ్మడి నల్గొండ నుంచి ఇద్దరు (ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి), ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి ఇద్దరు (రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు), ఉమ్మడి వరంగల్ నుంచి ఇద్దరు (సీతక్క, కొండా సురేఖ), ఉమ్మడి కరీంనగర్ నుంచి ఇద్దరు (శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్), ఉమ్మడి మెదక్ నుంచి దామోదర రాజనరసింహ ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబా
2023-12-07తెలంగాణ సిఎంగా రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రిగా భట్టివిక్రమార్కతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క (డి. అనసూయ), తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. తొలి కూర్పులో సిఎం సహా నలుగురు రెడ్లు, ఇద్దరు ఎస్.సి.లు, ఒక ఎస్.టి, ఇద్దరు బి.సి.లు ఉన్నారు. బ్రాహ్మణ, కమ్మ, వెలమ కులాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. విస్తరణ తర్వాత ఈ పొందిక మారుతుంది.
2023-12-07తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రమాణం చేశారు. హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టివిక్రమార్క, మంత్రులుగా మరో 10 మంది ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.
2023-12-07తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా పని చేసింది. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో విజయతీరానికి చేరగా అధికార బి.ఆర్.ఎస్. 39 సీట్ల వద్ద ఆగిపోయింది. మూడో శక్తి అనుకున్న బి.జె.పి. 8 సీట్లకు పరిమితం కాగా, ఎంఐఎం తన 7 సీట్లను నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఐ ఒక స్థానాన్ని పొందింది. కాంగ్రెస్ పార్టీకి 39.4% ఓట్లు రాగా, బి.ఆర్.ఎస్. 37.35%, బి.జె.పి. 13.90% ఓట్లను సాధించాయి. బి.ఆర్.ఎస్. గత ఎన్నికలతో పోలిస్తే 9.5% ఓట్లను కోల్పోగా కాంగ్రెస్ ఓట్లు 11% పెరిగాయి. బిజెపి ఓట్లు 6.92% శాతం పెరిగితే, ఎంఐఎం ఓట్లు 2.7% నుంచి 2.21%కి తగ్గాయి.
2023-12-03"లక్ష కోట్ల రూపాయల ఆస్తులు ఉండగా, లక్ష రూపాయల విలువైన చెప్పులు వేసుకుని, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్లో తాగే జగన్... బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయలలో నిర్మించిన రాజభవనాలకు తోడు ఇప్పుడు విశాఖపట్నంలో మరొకటి నిర్మిస్తున్న జగన్ పేదవాడు ఎలా అవుతాడు?"- తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రశ్నించారు. యువగళం పాదయాత్ర రెండో దశలో మూడవ రోజు ఆయన తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ప్రసంగించారు.
2023-11-29తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం కరీంనగర్ ఎన్నికల సభలో మాట్లాడిన మోదీ, ఈ ఎన్నికలతో బిఆర్ఎస్ ఆట ముగిసిపోతుందని వ్యాఖ్యానించారు. బిజెపి తరఫున తొలి ముఖ్యమంత్రి ఒక బి.సి. నేత అవుతారని మోదీ మరోసారి చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతో కెసిఆర్ కు ట్రైలర్ చూపించామని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు పూర్తి సినిమా చూపిస్తారని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బిఆర్ఎస్ కు వేసినట్టేనని మోదీ పేర్కొన్నారు.
2023-11-27రాజధాని అమరావతిని చంపేసిన పాపంలో మొదటి ముద్దాయి మాజీ సి.ఎం. చంద్రబాబేనని జైభీమ్ భారత్ అధ్యక్షుడు, మాజీ జడ్జి జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను 2,3,4వ ముద్దాయిలుగా శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. 33 వేల ఎకరాలు రాజధానికోసం ఇచ్చిన రైతులు, నిరుపేదలు రోడ్డున పడటానికి కారణం ‘ఆ నలుగురు దుర్మార్గులే’నని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు మంచిదేనని, అదే సమయంలో అందులో జరిగిన అవినీతి అక్రమాలనూ తేల్చాలని శ్రవణ్ ఉద్ఘాటించారు.
2023-11-27మూణ్ణెల్ల తర్వాత తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం వస్తుందని, ‘సైకో జగన్’ లండన్ పిచ్చాసుపత్రికి వెళ్తాడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులన్నిటికీ వడ్డీతో కలిపి తాము కేసులు పెడతామని హెచ్చరించారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుతో సెప్టెంబర్ 9న ఆగిన ‘యువగళం’ పాదయాత్రను లోకేష్ సోమవారంనాడు పున:ప్రారంభించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 52 రోజులపాటు జైల్లో పెట్టారని, ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారని లోకేష్ విమర్శించారు.
2023-11-27 Read Moreకేరళలోని ఎర్నాకుళం సాధారణ ఆసుపత్రి తొలిసారిగా ఒక కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒక జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి ఇలాంటి సర్జరీ చేయడం దేశంలోనే తొలిసారి అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. కేరళ మరో మైలురాయిని అధిగమించిందన్న సి.ఎం, ఈ విశేష క్రియ వెనుక ఉన్న బృందానికి అభినందనలు తెలిపారు.
2023-11-26