ఐ.ఎన్.ఎక్స్. మీడియా కేసులో సీబీఐ శుక్రవారం చార్జిషీటు దాఖలు చేసింది. కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరం, పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీ సహా 14 మంది పేర్లను అందులో చేర్చింది. ఈ వ్యవహారం సోమవారంనాడు ప్రత్యేక జడ్జి కుహార్ ఎదుటకు రానుంది.
2019-10-18అస్సాంలో ఎన్.ఆర్.సి. సవరణను పర్యవేక్షించిన ప్రతీక్ హజేలాను అత్యవసరంగా అంతర్రాష్ట్ర కేడర్ బదిలీ కింద మధ్యప్రదేశ్ పంపాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ బదిలీకి కారణం ఏమిటో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించలేదు. అయితే, ఎన్.ఆర్.సి. ప్రచురించాక హజేలా ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతోనే ఈ అదేశం ఇచ్చినట్టు చెబుతున్నారు. ‘‘బదిలీకి నిర్ధిష్టమైన కారణం ఉందా’’ అని అటార్నీ జనరల్ ప్రశ్నించినప్పుడు, ‘‘ఏ ప్రాతిపదికా లేకుండా ఏదైనా ఉత్తర్వు ఇస్తారా’’ అని సీజే ఎదురు ప్రశ్నించారు.
2019-10-18 Read Moreసుప్రీంకోర్టు ప్రస్తుత సీజేఐ తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్న జస్టిస్ ఎస్ఎ బోబ్డే తదుపరి ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. బాబ్డేను తన వారసుడిగా సిఫారసు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కేంద్రానికి లేఖ పంపారు. పదవీ విరమణ చేయబోయే ప్రధాన న్యాయమూర్తి తన తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి పేరును సిఫారసు చేయడం ఆనవాయితీ. 2018 అక్టోబర్ 3న 46వ సీజేగా ప్రమాణం చేసిన జస్టిస్ గొగోయ్, నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు. బాబ్డే పదవీ కాలం 2021 ఏప్రిల్ 23వరకు ఉంది.
2019-10-18టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మరో కేసులో చిక్కుకున్నారు. ఐల్యాబ్స్ ఉద్యోగి పేరిట నకిలీ మెయిల్ సృష్టించారని పోలీసులు నిర్ధారించారు. మెయిల్ సృష్టించడానికి వినియోగించిన ఐపి అడ్రస్ ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కూకట్ పల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రవిప్రకాశ్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇప్పటికే చంచల్ గూడ జైలులో ఉన్న రవిప్రకాశ్ ను పీటీ వారంట్ పై పోలీసులు కోర్టుకు తెచ్చారు. తాజా కేసులో రిమాండ్ తర్వాత మళ్ళీ చంచల్ గూడ జైలుకు తరలించారు.
2019-10-17గత నెల కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును బయటకు తీయడానికి చేసిన ప్రయత్నం గురువారం పాక్షికంగా ఫలించింది. బోటుకు లంగరు వేసి లాగినప్పుడు రెయిలింగ్ ఊడి వచ్చింది. అది బోటుకు ముందు భాగంలో ఉండే రెయిలింగ్ అని గుర్తించారు. బోటుకు లంగరు వేసిన సిబ్బందికి కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ సూచనలు చేశారు. బోటు ఎడమవైపునకు పడిపోయి ఉందని, లంగరు వేసి నాగినప్పుడు 12 అడుగులు జరిగిందని ఆదినారాయణ చెప్పారు.
2019-10-172018 బ్యాచ్ ఐఎఎస్ అధికారుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఏడుగురిని కేటాయించారు. కర్నాటి వరుణ్ రెడ్డి (మాతృ రాష్ట్రం తెలంగాణ), చిత్రా మిశ్రా (తెలంగాణ), పాటిల్ హేమంత్ కేశవ్ (మహారాష్ట్ర), గరిమ అగర్వాల్ (మధ్యప్రదేశ్), దీపక్ తివారీ (ఉత్తరాఖండ్), అంకిత్ (ఉత్తరప్రదేశ్), ప్రతిమా సింగ్ (ఉత్తరాఖండ్) కొత్తగా తెలంగాణ కేడర్ ఐఎఎస్ అధికారులయ్యారు.
2019-10-17కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయించిన కొత్త (2018 బ్యాచ్) ఐఎఎస్ అధికారుల్లో చాహత్ బాజ్ పాయ్ (మాతృ రాష్ట్రం మధ్యప్రదేశ్), జి. సూర్య ప్రవీణ్ చంద్ (ఏపీ), భావన (హరియాణా), మల్లారపు నవీన్ (ఆంధ్రప్రదేశ్), వి. అభిషేక్ (తమిళనాడు), అపరాజితా సింగ్ సిన్సిన్ వార్ (రాజస్థాన్), ఎన్. జయకుమరన్ (తమిళనాడు), సి. విష్ణుచరణ్ (ఆంధ్రప్రదేశ్), నిధి మీనా (రాజస్థాన్), కట్టా సింహాచలం (ఆంధ్రప్రదేశ్), వికాస్ మర్మత్ (రాజస్థాన్) ఉన్నారు.
2019-10-172018వ బ్యాచ్ ఐఎఎస్ అధికారుల్లో 11 మందిని ఏపీ కేడర్ కు, ఏడుగురిని తెలంగాణ కేడర్ కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకూ కలిపి 180 మంది ఐఎఎస్ అధికారులను కొత్తగా కేటాయించారు. తెలుగు రాష్ట్రాలకు కేటాయించినవారిలో ఎక్కువ భాగం ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. కాగా, ఇతర రాష్ట్రాలకు కేటాయించినవారిలో ఆంధ్రప్రదేశ్ వారెవరూ లేకపోవడం గమనార్హం. తెలంగాణ వారు మాత్రం ముగ్గురు ఇతర రాష్ట్రాల కేడర్లకు వెళ్తున్నారు.
2019-10-17ఎ.పి.పి.ఎస్.సి. నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2020లో భర్తీ చేసే ఉద్యోగాలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఈ ఏడాది జరుగుతున్న నియామకాలకు 1:2 నిష్ఫత్తిలో ఇంటర్వ్యూకు మార్కులు ఉంటాయి. ప్రస్తుతం ఉద్యోగ నియామకాలకోసంఎ.పి.పి.ఎస్.సి. ప్రకటించనున్న ‘క్యాలెండర్’పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. అత్యవసర సర్వీసుల విభాగాల్లో నియామకాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ సూచించారు.
2019-10-17అమెరికా, మిత్ర దేశాలు వ్యతిరేకించినా... ఐక్యరాజ్య సమితి (యుఎన్) మానవ హక్కుల మండలిలో వెనెజులా స్థానం దక్కించుకుంది. గురువారం జరిగిన ఈ పరిణామాన్ని ‘‘చారిత్రక విజయం’’గా వెనెజులా అభివర్ణిస్తే, ‘‘ఐరాసకే అవమానకరం’’గా అమెరికా పేర్కొంది. జెనీవాలోని మానవ హక్కుల మండలికి ఐరాస సాధారణ అసెంబ్లీ 14 మంది నూతన సభ్యులను ఎన్నుకుంది. మూడేళ్ళ కాలానికి ప్రాంతీయ గ్రూపుల వారీగా సభ్య దేశాలను ఎన్నుకుంటారు. దక్షిణ అమెరికా నుంచి బ్రెజిల్ 153 ఓట్లు, వెనెజులా 105 ఓట్లతో సభ్యులయ్యాయి.
2019-10-18 Read More