‘‘నేను మా ఊర్లోనే పుట్టాను. బర్త్ సర్టిఫికెట్ లేదు. నువ్వెవరివని అడిగితే నేనేం చెప్పాలి. నాదే లేదంటే.. మీ నాయనది తీసుకు రమ్మంటే ఎలా?’’.. సిఎఎ, ఎన్.సి.ఆర్.లపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంథించిన ప్రశ్న ఇది. శనివారం అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించిన కేసీఆర్, త్వరలో అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తామని చెప్పారు. ఓ పెద్ద ఇంట్లో పుట్టిన తానే పుట్టుకను నిరూపించుకునే పరిస్థితి లేకపోతే.. దళితులు, బలహీనవర్గాల్లో పుట్టిన ప్రజలు ఎక్కడినుంచి సర్టిఫికెట్లు తెస్తారని.. అసలు ఇదేం ఖర్మ అని కేసీఆర్ ప్రశ్నించారు.
2020-03-07కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సూచనతో రాజగోపాలరెడ్డిని సభనుంచి సస్పెండ్ చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. తొలుత ఆయన ఒక్కరి పేరుతో సస్పెన్షన్ నోటీసును చదివిన స్పీకర్, తర్వాత భట్టి విక్రమార్క, జయప్రకాశ్ రెడ్డి, అనసూయ, శ్రీధర్ బాబు లను కూడా సస్పెండ్ చేశారు.
2020-03-07మలయాళ న్యూస్ ఛానళ్ళు ఏసియానెట్, మీడియా వన్ లపై విధించిన నిషేధాన్ని కేంద్రం కొద్ది గంటల్లోనే కేంద్రం ఎత్తివేసింది. 48 గంటల నిషేధం శుక్రవారం (మార్చి 6) రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కాగా శనివారం వేకువజామున 1.30కి ఏసియానెట్ ప్రసారాలు పున:ప్రారంభమయ్యాయి. ఆ ఛానల్ కేంద్రానికి చేసిన విన్నపం మేరకు పున:ప్రసారాలకు అనుమతి ఇచ్చారు. అయితే, న్యాయపోరాటం చేస్తామని ప్రకటించిన ‘మీడియా వన్’ ప్రసారాలను కూడా పునరుద్ధరిస్తున్నట్టు శనివారం ఉదయం 9.30కి కేంద్ర సమాచార శాఖ నుంచి ఆ ఛానల్ యాజమాన్యానికి సందేశం అందింది.
2020-03-07 Read Moreఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలును అనుసరించి టెన్త్ పరీక్షల షెడ్యూలును రూపొందింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు రోజూ 9.30 గంటల నుంచి 12.15 వరకు పరీక్షలు ఉంటాయి. మార్చి 31న, ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్ రెండు పేపర్లకు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 3న సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 4, 6 తేదీల్లో ఇంగ్లీషు రెండు పేపర్లు, 7-8 తేదీల్లో లెక్కలు, ఏప్రిల్ 9, 11 తేదీల్లో జనరల్ సైన్స్, ఏప్రిల్ 13, 15 తేదీల్లో సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 16న ఒ.ఎస్.ఎస్.సి. మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2, ఏప్రిల్ 17న ఒకేషనల్ థియరీ పరీక్ష ఉంటాయి.
2020-03-07పట్టణ, గ్రామీణ సంస్థలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల షెడ్యూలును ఆయన శనివారం విజయవాడలో ప్రకటించారు. దాని ప్రకారం..ఈ నెల 21న ఎంపిటిసి, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 24న ఓట్లను లెక్కిస్తారు. 23న పురపాలక సంస్థలకు పోలింగ్ జరిగితే ఓట్లను 27న లెక్కిస్తారు. అదే రోజు మొదటి దశలో కొన్ని పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. మరికొన్నిటికి 29న (రెండో దశ) పోలింగ్ ఉంటుంది. పంచాయతీలకు పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు చేపడతారు.
2020-03-07తిరుగుబాటు ఆరోపణలతో సౌదీ రాజ కుటుంబంలోని ఇద్దరు ప్రముఖులను యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అరెస్టు చేయించారు. నిర్బంధానికి గురైనవారిలో సౌదీ రాజు సాల్మన్ చిన్న తమ్ముడు అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ (యువరాజుకు బాబాయి), రాజు మరో సోదరుడి కుమారుడు మహ్మద్ బిన్ నయేఫ్ (యువరాజు కజిన్) ఉన్నారు. 2017లో నయేఫ్ స్థానంలోనే బిన్ సల్మాన్ యువరాజుగా బాధ్యతలు స్వీకరించారు. రాజు కుమారుడైన బిన్ సల్మాన్ గత మూడేళ్లలో అధికారంపై పట్టు సంపాదించారు. గతంలో అవినీతి ఆరోపణలతో కొందరు రాజకుటుంబీకులను నిర్బంధించారు.
2020-03-07‘కరోనా’ వైరస్ 90 దేశాలకు విస్తరించింది. ఇప్పటికి 1,01,999 కేసులు నమోదు కాగా 3,482 మంది మరణించారు. కొత్త కేసుల సంఖ్య శుక్రవారం చైనాలో 99కి తగ్గి చైనా వెలుపల 3,683కి పెరిగాయి. మరణాలు కూడా చైనాలో తగ్గి (28) ఇతర దేశాల్లో (69) పెరిగాయి. ఇప్పటిదాకా చైనాలో 80,651 మందికి వైరస్ సోకగా 55,866 మంది కోలుకున్నారు. 3070 మంది మరణించారు. చైనా వెలుపల 21,348 కేసులకు గాను 412 మంది చనిపోయారు. 2027 మంది కోలుకున్నారు. చైనా వెలుపల అత్యధిక కేసులు దక్షిణ కొరియాలో (6,767) నమోదు కాగా మరణాలు ఎక్కువగా ఇటలీలో (197) సంభవించాయి.
2020-03-07 Read Moreతెలుగు జర్నలిజం దిగ్గజాల్లో ఒకరైన పొత్తూరి వెంకటేశ్వరరావు (86) గురువారం ఉదయం మరణించారు. కొంత కాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఐదు దశాబ్దాల అనుభవంలో పొత్తూరి ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఉదయం పత్రికల సంపాదకునిగా ప్రత్యేక ముద్ర వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెస్ అకాడమీకి అధ్యక్షునిగా పని చేశారు. గుంటూరు ప్రక్కనే ఉన్న పొత్తూరు గ్రామంలో 1934లో ఆయన జన్మించారు.
2020-03-05డిఎంకె సీనియర్ మోస్ట్ నేత, ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కె. అన్బళగన్ శనివారం తెల్లవారు జామున మరణించారు. 97 సంవత్సరాల అన్బళగన్ కరుణానిధికి సన్నిహిత సహచరుడు. ద్రవిడ ఉద్యమంలో కీలక పాత్రధారి. ‘ప్రొఫెసర్ అన్బగళన్’గా తమిళనాడు పిలుపుచుకునే ఈ ద్రవిడ దిగ్గజం..43 సంవత్సరాల పాటు డిఎంకె ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తొమ్మిదిసార్లు ఎమ్మెల్యే అయిన అన్బళగన్, నాలుగుసార్లు మంత్రిగా పని చేశారు. ఒకసారి ఎంపీ అయ్యారు. డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ వారం రోజులపాటు సంతాప దినాలను ప్రకటించారు.
2020-03-07 Read More‘‘ఎస్. బ్యాంకు విఫలమైతే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. తప్పు లేదు. కస్టమర్లు నష్టపోకూడదు. మరి అదే విధానం అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఎందుకు వర్తించడంలేదు? కేంద్రం ఎందుకు స్పందించడంలేదు’’ అని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య ప్రశ్నించారు. రాజధానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు నష్టపోయే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని బుచ్చయ్య విమర్శించారు. ‘‘బ్యాంకులు చేసిన తప్పుకు పరిహారం చెల్లిస్తున్న కేంద్రం.. ఏపీ ప్రభుత్వం తప్పు విషయంలో పెద్దన్న పాత్ర పోషించదా?’’ అని నిలదీశారు.
2020-03-07