నాసా ఎక్స్పెడిషన్ 59 ఫ్లైట్ ఇంజనీర్లు నిక్ హేగ్, అన్నే మెక్ క్లెయిన్ శుక్రవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వెలుపల స్పేస్ వాక్ చేశారు. సౌర ఫలకాలపై ఉన్న పాత నికెల్ హైడ్రోజన్ బ్యాటరీల స్థానంలో సరికొత్త లిథియం అయాన్ బ్యాటరీలను విజయవంతంగా అమర్చారు. ఇందుకోసం అంతరిక్ష కేంద్రం వెలుపలి భాగంలో 6 గంటల 39 నిమిషాల పాటు ఉన్నారు. అంతరిక్ష కేంద్రం వెలుపల ఉన్న శిథిలాలను తొలగించడం వంటి పలు ఇతర పనులు కూడా చేసిన అనంతరం వారిద్దరూ తిరిగి అంతరిక్ష కేంద్రంలోకి చేరారు.
2019-03-23 Read Moreఎడ్యూరప్ప డైరీ కర్నాటక కాంగ్రెస్ నేత డి.కె. శివకుమార్ ద్వారా ఆదాయ పన్ను శాఖ అధికారులకు అందిందని కారవాన్ మేగజైన్ రాసింది. 2017 ఆగస్టులో ఐటీ అధికారులు శివకుమార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినప్పుడు డైరీ దొరికిందని శుక్రవారం వెల్లడించింది. తాను ముఖ్యమంత్రి కావడానికి బీజేపీ కేంద్ర కమిటీకి రూ. 1000 కోట్లు, సీనియర్ నేతలకు విడిగా రూ. 500 కోట్లు, కేసులకోసం జడ్జిలకు రూ. 250 కోట్లు, లాయర్లకు 50 కోట్లు చెల్లించినట్టు ఎడ్యూరప్ప స్వదస్తూరీతో రాసి సంతకం కూడా పెట్టినట్టు కారవాన్ కథనం చెబుతోంది.
2019-03-23తాను ముఖ్యమంత్రి కావడానికి బీజేపీ జాతీయ నాయకత్వానికి, కేసులనుంచి బయటపడటానికి జడ్జిలకు, లాయర్లకు కలిపి రూ. 1800 కోట్లు సమర్పించినట్టు బి.ఎస్. ఎడ్యూరప్ప తన 2009 డైరీలో రాశారు. అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీలకు రూ. 150 కోట్ల చొప్పున, రాజ్ నాథ్ సింగ్ కు రూ. 100 కోట్లు, సీనియర్ నేతలు ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు రూ. 50 కోట్ల చొప్పున ఇచ్చినట్టు ఎడ్డీ రాశారు. ‘‘నేను బీజేపీ కేంద్ర కమిటీకి రూ. 1000 కోట్లు చెల్లించాను. నితిన్ గడ్కరీ కుమారుడి పెళ్లికి రూ. 10 కోట్లు ఇచ్చాను’’ అని కూడా రాశారు. ఇక జడ్జిలకు రూ. 250 కోట్లు, కేసుల నిమిత్తం లాయర్లకు రూ. 50 కోట్లు సమర్పించినట్టు పేర్కొన్నారు.
2019-03-22 Read Moreకర్నాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. ఎడ్యూరప్ప బీజేపీ జాతీయ నాయకత్వానికి, కొంతమంది జడ్జిలకు రూ. 1800 కోట్ల రూపాయలమేరకు ముడుపులు ముట్టజెప్పారని ఆయన డైరీని ఉటంకిస్తూ ‘కారవాన్’ మ్యాగజైన్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆదాయ పన్ను శాఖ వద్ద 2017 నుంచి ఉన్న ఎడ్యూరప్ప డైరీ పేజీల కాపీలను ఈ పత్రిక సంపాదించింది. ఎడ్యూరప్ప చేతిరాతతో ఉన్న ఒక డైరీ పేజీలో (2009 జనవరినాటిది).. బీజేపీ కేంద్ర కమిటీకి రూ. 1000 కోట్లు, నేతలకు రూ. 500 కోట్లు, జడ్జిలకు రూ. 250 కోట్లు సమర్పించినట్టు వివరాలున్నాయి.
2019-03-22 Read Moreజి. నగేష్ (ఆదిలాబాద్), బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), గడ్డం రంజిత్ రెడ్డి (చేవెళ్ల), పుస్తె శ్రీకాంత్ (హైదరాబాద్), బోయినపల్లి వినోద్ కుమార్ (కరీంనగర్), నామ నాగేశ్వరరావు (ఖమ్మం), మాలోత్ కవిత (మహబూబాబాద్), మన్నె శ్రీనివాసరెడ్డి (మహబూబ్ నగర్), మర్రి రాజశేఖరరెడ్డి (మల్కాజ్ గిరి), కొత్త ప్రభాకర్ రెడ్డి (మెదక్), పి. రాములు (నాగర్ కర్నూలు), వేమిరెడ్డి నర్సింహారెడ్డి (నల్లగొండ), కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), వెంకటేష్ నేతకాని (పెద్దపల్లి), తలసాని సాయికిరణ్ యాదవ్ (సికింద్రాబాద్), పసునూరి దయాకర్ (వరంగల్), బీబీ పాటిల్ (జహీరాబాద్).
2019-03-21కొన్ని కోట్ల మంది వినియోగదారుల ‘పాస్ వర్డ్’లు అక్షర రూపంలో నిల్వ ఉంచినట్టు, తమ అంతర్గత సర్వర్లలో ఉన్న ఈ పాస్ వర్డ్ లు మొత్తం.. ఒక భద్రతాపరమైన లోపం వల్ల సంస్థ ఉద్యోగులకు కనిపించినట్టు ‘ఫేస్ బుక్’ యాజమాన్యం గురువారం అంగీకరించింది. అయితే ఈ ‘పాస్ వర్డ్’లు ‘ఫేస్ బుక్’ వెలుపల ఎవరికీ చేరలేదని, సంస్థ ఉద్యోగులెవరూ వాటిని దుర్వినియోగం చేసినట్టు ఎలాంటి ఆధారమూ లేదని యాజమాన్యం చెబుతోంది. ఇంతకు ముందు 8.7 కోట్ల మంది వినియోగదారుల సమాచారం లీకైన విషయం తెలిసిందే.
2019-03-21నిన్న కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పిన సీనియర్ నేత డి.కె. అరుణను బీజేపీ అధిష్ఠానం మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దించింది. గురువారం బీజేపీ విడుదల చేసిన తొలి జాబితా (184 మంది)లో తెలంగాణ నుంచి అరుణతోపాటు బండి సంజయ్ (కరీంనగర్), డి. అరవింద్ (నిజామాబాద్), ఎన్. రామచంద్రరావు (మల్కాజ్ గిరి), జి. కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), బంగారు శ్రుతి (నాగర్ కర్నూల్), గార్లపాటి జితేందర్ కుమార్ (నల్లగొండ), పివి శాంసుందర్ రావు (భువనగిరి), చింతా సాంబమూర్తి (వరంగల్), హుసేన్ నాయక్ (మహబూబాబాద్) ఉన్నారు.
2019-03-21‘‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుగుదేశం పార్టీ నేతల కబ్జాలు ఒక ఎత్తయితే.. వీళ్ళు ఏకంగా మీ ఇళ్ళే లాగేసుకుంటారు. కొండలు దోచేస్తారు’’ అని పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ప్రజలకు చెప్పారు. గాజువాక జనసేన అభ్యర్ధిగా నామినేషన్ వేసిన అనంతరం పవన్ బహిరంగ సభలో మాట్లాడారు. అవినీతిని అంతమొందించడానికే.. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను విశాఖ నగరానికి కొత్వాల్ లా తీసుకొచ్చానని ఉద్ఘాటించారు. వై.ఎస్.ఆర్.సి. వాళ్లు ఆయనకు ఎదురు నిలబడి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని పవన్ ప్రశ్నించారు.
2019-03-21కర్నాటకలోని జెడి (ఎస్) - కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ పథకానికి ఎన్నికల కమిషన్ బ్రేకులు వేసింది. లోక్ సభ ఎన్నికల నిబంధనావళిని ప్రస్తావించిన ఈసీ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు రైతుల బ్యాంకు అకౌంట్లకు నగదు బదిలీ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో రూ. లక్ష వరకు, వాణిజ్య బ్యాంకులలో రూ. 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ పథకాన్ని అమలు చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో సహకార బ్యాంకుల్లోని ఖాతాలకు రూ. 1500 కోట్లు బదిలీ చేయవలసి ఉంది.
2019-03-21బీజేపీ లోక్ సభ అభ్యర్ధుల తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి రెండే పేర్లు ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి విశాఖపట్నం సీటు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు గుంటూరు జిల్లా నర్సరావుపేట సీటు కేటాయించారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వల్ల విశాఖపట్నం లోక్ సభ స్థానంలో విజయం సాధించిన కంభంపాటి హరిబాబు ఈసారి పోటీకి విముఖత తెలిపినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో... గతంలో అక్కడినుంచి ప్రాతినిధ్యం వహించిన పురంధేశ్వరిని రంగంలోకి దించించి బీజేపీ అధిష్ఠానం.
2019-03-21