మెజారిటీ (హిందువులు) సహనం కోల్పోతే ‘గోద్రా తరహా’ పరిస్థితి పునరావృతమవుతుందని కర్నాటక బిజెపి మంత్రి సి.టి. రవి హెచ్చరించారు. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తే కర్నాటక తగలబడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యు.టి. ఖాదర్ ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్పను హెచర్చించిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. మంగళూరులో గురువారం జరిగిన ఆందోళనలను ‘‘గోద్రా రైలు దహనం’’తో పోల్చిన మంత్రి, గోద్రాలో ఆ తర్వాత ఏమి జరిగిందో గుర్తు చేసుకోవాలని ఖాదర్ ను హెచ్చరించారు.
2019-12-20ప్రస్తుత రాజధాని అమరావతిని విద్యా కేంద్రంగా తీర్చి దిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధానిని విశాఖకు తరలించడం ఖాయమైన రోజున అమరావతి రైతులు ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం తరఫున బొత్స స్పందించారు. ఈ నెల 27వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో జి.ఎన్.రావు కమిటీ నివేదికపై చర్చ జరుపుతామని మంత్రి చెప్పారు. అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేస్తామని బొత్స పేర్కొన్నారు.
2019-12-20రాజధాని, ఇతర ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఎన్ రావు కమిటీ, రాజధానిని విశాఖకు తరలించే దిశగా సిఫారసులు చేయడంతో అమరావతి రైతులు భగ్గుమన్నారు. జిఎన్ రావు విలేకరుల సమావేశం ముగియగానే రైతులు రోడ్ల పైన ఆందోళనకు దిగారు. సచివాలయాన్ని ముట్టడించారు. మధ్యలో కనిపించిన పోలీసు బారికేడ్లను ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను చించేశారు. సచివాలయానికి వెళ్లేవైపు ఉన్న మందడం Y జంక్షన్ లో ధర్నా చేశారు.
2019-12-20శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా కర్నూలులో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి ప్రకటన కూడా దానికి అనుగుణంగా ఉంది. అయితే, శుక్రవారం జిఎన్ రావు కమిటీ చేసిన సిఫారసు రాయలసీమను మరింత మండించేలా ఉంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీటు కర్నూలులో ఉండాలని, అమరావతి, విశాఖపట్నం నగరాల్లో హైకోర్టు బెంచిలు ఏర్పాటు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. రాజధాని కోరిన సీమకు హైకోర్టు కూడా పూర్తిగా దక్కే పరిస్థితి లేదు.
2019-12-20విశాఖపట్నానికి రాజధాని మారడం ఖాయమైంది. అంతే కాదు... అసెంబ్లీలో ప్రధాన భాగం, హైకోర్టు బెంచి కూడా అక్కడ ఏర్పాటు కానున్నాయి. సచివాలయం, ప్రధాన శాఖాధిపతుల కార్యాలయాలు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అక్కడే ఉంటాయి. ముఖ్యమంత్రి చెప్పినట్టు మూడు రాజధానులు అనేది కేవలం మిగిలిన ప్రాంతాల ప్రజలను సంత్రుప్తిపరచడానికేనని స్పష్టమవుతోంది. జీఎన్ రావు కమిటీ సిఫారసులు అన్ని వ్యవస్థలనూ విశాఖకు తరలించడానికి తగిన విధంగా ఉన్నాయి.
2019-12-20ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతి రూపు మారిపోవడం ఖాయమైంది. ఇక్కడ ఉన్న సచివాలయం, చాలావరకు శాఖాధిపతుల కార్యాలయాలు, హైకోర్టు తరలిపోనున్నాయి. అసెంబ్లీ కూడా పాక్షికంగా మిగలనుంది. ప్రధానమైన బడ్జెట్ సమావేశాలు విశాఖపట్నంలో నిర్వహించాలని జిఎన్ రావు సిఫారసు చేశారు. అంటే... రాజధాని విశాఖలోనే అసెంబ్లీ ప్రధాన కార్యకలాపాలు కూడా సాగనున్నాయి. ఇక్కడ నికరంగా మిగిలే చెప్పుకోదగ్గ వ్యవస్థ రాజ్ భవన్ ఒక్కటే. నిరంతర పాలనా వ్యవస్థలో గవర్నర్ కార్యాలయం పాత్ర ఏమీ ఉండదు.
2019-12-20అమరావతి నుంచి ఏపీ రాజధాని విశాఖపట్నానికి తరలడం ఇక లాంఛనమే. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలసి నివేదికను సమర్పించింది. విశాఖపట్నంలోనే సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉండాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. అసెంబ్లీ సమావేశాలు అమరావతితో పాటు విశాఖలోనూ జరగాలని సూచించింది. అంటే... అమరావతి అసెంబ్లీ పాక్షికమేనన్నమాట. హైకోర్టు కర్నూలులో ఉన్నా బెంచిలు అమరావతి, విశాఖలలో కూడా ఉండాలని సూచించింది.
2019-12-20అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించే దిశగా పరిణామాలు సాగుతుండటంతో భూములు ఇచ్చిన రైతులు నిరసనను తీవ్రతరం చేశారు. శుక్రవారం అమరావతి ప్రాంతంలోని అనేక గ్రామాల్లో బంద్ వాతావరణం నెలకొంది. ప్రస్తుత సచివాలయం ఉన్న వెలగపూడి గ్రామంలో రైతులు రోడ్డుపైనే బైటాయించి నిరసన తెలిపారు. రోడ్లపైనే వంటా వార్పు సాగించారు. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి కూడా రైతులు అక్కడికి తరలి వచ్చారు. వివిధ గ్రామాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ నిరసనలో పాల్గొనడం విశేషం.
2019-12-20అమరావతి నిర్మాణంకోసం రైతుల నుంచి తీసుకున్న మొత్తం భూములను తిరిగి ఇచ్చేస్తామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో సచివాలయం, అసెంబ్లీ అన్నీ కలిపి 200 ఎకరాల్లో ఉన్నాయని, రాజధానికి 33 వేల ఎకరాలు అవసరం లేదని స్పష్టం చేశారు. అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి శుక్రవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో భవనాలను తాత్కాలికంగానే వాడుకుంటున్నామని వ్యాఖ్యానించారు.
2019-12-20‘‘కేంద్రానికి ఏం సంబంధం.. 3 చోట్ల పెట్టుకుంటాం లేదా 30 చోట్ల పెట్టుకుంటాం’’... రాష్ట్ర రాజధాని నగరంపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలో ఉండే అంశమని స్పష్టం చేశారు. ‘‘కర్నాటక వాళ్లు బెల్గాంలో రెండో రాజధానికి కేంద్రం అనుమతి తీసుకున్నారా? నాగపూర్ లో రెండో శాసనసభ పెట్టుకోవడానికి అనుమతి తీసుకున్నారా?’’ అని కూడా మంత్రి ప్రశ్నించారు.
2019-12-20