సిఎఎ నిరసనల సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హింస ఆగిన తర్వాతే అన్ని పిటిషన్లనూ వింటామని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. చట్టం రాజ్యాంగబద్ధమైనదిగా ప్రకటించాలన్న విన్నపంపై అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు, చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 60 పిటిషన్లతో దీన్నీ కలిపి విచారిస్తామని పేర్కొంది. సిఎఎకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు ఈ నెల 22వ తేదీకి పోస్టయ్యాయి.
2020-01-10 Read Moreకేంద్ర బడ్జెట్ వేళ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆర్థికవేత్తలు, పరిశ్రమ నిపుణులతో సమావేశమయ్యారు. $5 ట్రిలియన్ ఎకానమీపై చర్చించారు. ఈ సమావేశంలో హోం, వాణిజ్యం, రహదారుల శాఖల మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ ఉన్నారు. అయితే, అసలు (ఆర్థిక) మంత్రి నిర్మలా సీతారామన్ లేరు. కాంగ్రెస్ ఎం.పి. శశి థరూర్ సరిగ్గా ఈ ప్రశ్నే లేవనెత్తారు. ‘‘ఆర్థిక మంత్రి ఎక్కడ? ఆ మంత్రి ఉన్నారని ఈ ఇద్దరూ (మోడీ, షా) మరచిపోయారా’’ అని థరూర్ ప్రశ్నించారు.
2020-01-09సిఎఎ, ఎన్.ఆర్.సి.లకు మద్ధతుగా బిజెపి, ఆర్ఎస్ఎస్ చేస్తున్న బైక్ ర్యాలీపై కేరళ కమ్యూనిస్టులు దాడి చేశారంటూ ఓ వీడియో గురువారం హల్ చల్ చేస్తోంది. నిజానికి ఆ వీడియో గత ఏడాది జనవరి 3న టైమ్స్ ఆఫ్ ఇండియా పోస్టు చేసినది. అప్పటికి సిఎఎ ప్రస్తావనే లేదు. మహిళల అయ్యప్ప దర్శనంపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఎడప్పల్ లో జరిగిన బైక్ ర్యాలీ అది. ర్యాలీ నిర్వహించిన ’శబరిమల కర్మ సమితి’పై ఓ ‘గుంపు’ దాడి చేశారని టైమ్స్ అప్పట్లో పేర్కొంది.
2020-01-09 Read Moreజె.ఎన్.యు. విద్యార్ధుల ఆందోళనకు కారణమైన వైస్ ఛాన్సలర్ పై బిజెపి సీనియర్ నేత మురళీమనోహర్ జోషి మండిపడ్డారు. ఫీజు పెంపు విషయంలో మానవ వనరుల శాఖ సలహాను కూడా కాదని మొండిగా వ్యవహరించారన్న సమాచారం షాకింగ్ అన్న జోషి, ఇలాంటి వ్యక్తిని వీసీ పోస్టులో కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ నెల 5న విద్యార్ధులపై జరిగిన దాడికి కూడా వీసీ బాధ్యుడుని ఆరోపణలున్న నేపథ్యంలో జోషి స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది.
2020-01-09 Read Moreవారణాసి సంస్కృత విశ్వ విద్యాలయంలో విద్యార్ధి సంఘం ఎన్నికలు జరిగాయి. ఎవరు గెలిచి ఉంటారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న చోటు... అందులోనూ సంస్కృత విశ్వవిద్యాలయం... ఇంకెవరు గెలుస్తారు ఎబివిపినే కదా!! అనుకున్న వాళ్లు ముక్కున వేలేసుకున్నారు. ఎన్నికలు జరిగిన నాలుగు పోస్టుల్లోనూ కాంగ్రెస్ అనుబంధ సంఘం ఎన్.ఎస్.యు.ఐ. ఘన విజయం సాధించింది. ఆర్.ఎస్.ఎస్. అనుబంధ ఎబివిపి చిత్తుగా ఓడిపోయింది.
2020-01-09 Read Moreఅమరావతి పరిరక్షణ ఉద్యమం సి.ఆర్.డి.ఎ. హద్దులు దాటి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఉద్యమం కోసం ఏర్పాటైన జె.ఎ.సి. గురువారం ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించింది. తొలిగా మచిలీపట్నంలో ర్యాలీ నిర్వహించి జెఎసి నేతలు బహిరంగ సభలో ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. తెలుగుదేశం, సిపిఐ, బిజెపి, జనసేన నాయకులు, ప్రజా సంఘాల నేతలు ఈ సభలో మాట్లాడుతూ అమరావతి విషయంలో ‘అందరిదీ ఒకే మాట’ అని స్పష్టం చేశారు.
2020-01-09బలమైన సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తే జస్టిస్ బ్రిజ్ గోపాల్ హరికిషన్ లోయా మృతిపై మళ్ళీ దర్యాప్తు చేయించే అంశాన్ని పరిశీలిస్తామని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. మాలిక్ ఎన్.సి.పి. నేత. 2014 డిసెంబర్ 1న జస్టిస్ లోయా అనుమానాస్పదంగా మరణించారు. ఆ సమయంలో లోయా విచారిస్తున్న సోహ్రాబుద్ధీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిందితుడు. 2014 మే నెలలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక లోయా ఒత్తిడిని ఎదుర్కొన్నారు.
2020-01-09జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్ధులు గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ వద్దకు ర్యాలీ తలపెట్టారు. కాగా, మధ్యలో పోలీసులు వారిని నిలువరించారు. అంతకు ముందు వారు వర్శిటీ వీసీని తొలగించాలని కేంద్ర మానవ వనరుల శాఖను డిమాండ్ చేశారు. ఆ అంశంపై రేపు చర్చిద్దామని మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేర్కొనగా, వీసీ తొలగింపుపై రాజీ సమస్యే లేదని జె.ఎన్.యు. విద్యార్ధి సంఘం అధ్యక్షురాలు అయిషే ఘోష్ స్పష్టం చేశారు.
2020-01-09సవరించిన పౌరసత్వ చట్టాన్ని రాజ్యాంగబద్ధమైనదిగా ప్రకటించాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసింది. అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది. ‘‘నేను మొదటిసారి ఇలాంటి విన్నపాన్ని వింటున్నాను. కోర్టు.. ఓ చట్టం చెల్లుబాటును నిర్ణయించాలి. రాజ్యాంగబద్ధమని ప్రకటించడం కాదు’’ అని సీజే జస్టిస్ బాబ్డే స్పష్టం చేశారు. దేశం కిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు శాంతికోసం అంతా ప్రయత్నించాలని, అందుకు ఇలాంటి పిటిషన్లు దోహదపడవని ఆయన వ్యాఖ్యానించారు.
2020-01-09 Read More"130 కోట్లలో ఒక పౌరుడిపై ప్రతికూల ప్రభావం చూపినా... పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)ను మార్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది" అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి నొక్కిచెప్పారు. సిఎఎపై దేశవ్యాప్త నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి గురువారం మాట్లాడారు. "మతపరమైన హింసను ఎదుర్కొని పొరుగు దేశాల నుండి వచ్చిన శరణార్థులకు పౌరసత్వాన్ని కల్పించే ప్రత్యేక డ్రైవ్‌గా మా ప్రభుత్వం సిఎఎని ముందుకు తెచ్చింది" అని కిషన్ రెడ్డి చెప్పారు.
2020-01-09 Read More