మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు సోమవారం మరో 15 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 53 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగుతోంది. కర్నాటక, ఉత్తరప్రదేశ్ లలో వరుసగా 15, 11 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరుగుతుండటంతో.. ఆయా రాష్ట్రాల్లో వీటిని మినీ అసెంబ్లీ ఎన్నికలుగా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288, హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలోని హుజూర్ నగర్ స్థానానికి సోమవారమే పోలింగ్ జరుగుతోంది. వీటన్నిటి ఫలితాలు ఈ నెల 24న వెల్లడవుతాయి.
2019-10-21మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడానికి బిజెపి చెమటోడ్చింది. ఏప్రిల్-మే లలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రెండు రాష్ట్రాల్లో చవి చూసిన ఘోర పరాజయం నుంచి కాంగ్రెస్ ఇంకా తేరుకోలేదు. మహారాష్ట్రలో శివసేనతో గత ఐదేళ్లలో సంబంధాలు అంత బాగా లేకున్నా ఎన్నికల సమయానికి పొత్తు పదిలం చేసుకొని బిజెపి మెరుగైన స్థితిలో కనిపిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాలకు గాను ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి కూటమి చేతిలో 217 ఉన్నాయి.
2019-10-21 Read Moreఆర్టీసీ సమ్మె ప్రారంభమై 15 రోజులు గడచినా ప్రభుత్వం పరిష్కారం దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది. ఫలితంగా శనివారం తెలంగాణ బంద్ సంపూర్ణంగా జరిగింది. అనేక ప్రాంతాల్లో వివిధ సంఘాల నాయకుల అరెస్టులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావును అరెస్టు చేసి వాహనంలో ఎక్కించినప్పుడు డోర్ లో చిక్కుకుని ఆయన బొటన వేలు సగానికి తెగిపోయింది.
2019-10-19పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసిన సందర్భంపై కాంగ్రెస్ నాయకుడు అఖిలేష్ సింగ్ సందేహం వ్యక్తం చేశారు. హర్యానా, మహారాష్ట్రలలో అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు దాడులు జరగడాన్ని ఎత్తిచూపారు. "దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడల్లా జరిగే సర్జికల్ స్ట్రైక్ వెనుక ఒక నమూనా ఉంది" అని సింగ్ పాట్నాలో విలేకరులతో అన్నారు. "ఇప్పుడు, ఈ దేశ రాజకీయాలు సర్జికల్ స్ట్రైక్స్ పైనే జరుగుతాయి.’’ అని వ్యాఖ్యానించారు.
2019-10-20భారత ఆర్మీ నిష్కారణంగా తమ జురా, షాకోట్, నౌషేరి సెక్టార్లలోని పౌర ప్రాంతాలపై దాడి చేసిందని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. తాము సమర్ధవంతంగా ప్రతిస్పందించామని, దీంతో 9 మంది భారత జవాన్లు మరణించారని, అనేక మంది గాయపడ్డారని, రెండు బంకర్లు ధ్వంసమయ్యాయని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత ఆర్మీ దాడిలో తమ సైనికుడు ఒకరు, ఐదుగురు పౌరులు మరణించినట్టు తెలిపారు.
2019-10-20పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోపల సైన్యం ఈ రోజు చేసిన దాడుల్లో మూడు శిబిరాలు ధ్వంసమయ్యాయని, 6 నుంచి 10 మంది పాక్ సైనికులు, అంతే సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. కుప్వారా తంగ్ధర్ సెక్టార్ ఎదురుగా ఉన్న నీలం లోయలోని టెర్రర్ లాంచ్ ప్యాడ్లు ఫిరంగి దాడుల్లో ధ్వంసమయ్యాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పంపడానికి పాకిస్తాన్ సైన్యం చేస్తున్న ప్రయత్నాలకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్టు ఆర్మీ చెబుతోంది.
2019-10-20 Read More‘యూరోపియన్ యూనియన్ (ఇయు)’ నుంచి తప్పుకునే ప్రక్రియ (బ్రెగ్జిట్) ఈ నెల 31నే జరుగుతుందని బ్రిటన్ ప్రభుత్వ మంత్రి మైఖేల్ గోవ్ ఆదివారం స్పష్టం చేశారు. ‘బ్రెగ్జిట్’ను ఆలస్యం చేయాలని బ్రిటిష్ పార్లమెంటు సభ్యులు పట్టుపట్టినప్పటికీ ప్రభుత్వ నిర్ణయంలో మార్పు లేదని మంత్రి మాటలను బట్టి తెలుస్తోంది. ‘‘పార్లమెంటు పంపమన్నందున ఆ లేఖను పంపాల్సి వచ్చింది. అయితే, ప్రధానమంత్రి నిర్ణయాన్ని, ప్రభుత్వ విధానాన్ని పార్లమెంటు మార్చలేదు’’ అని గోవ్ ఉద్ఘాటించారు.
2019-10-20 Read Moreఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశమవుతారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలసిన జగన్మోహన్ రెడ్డి, అప్పట్లో అమిత్ షా బిజీగా ఉండటంవల్ల కలవలేకపోయారు. అమిత్ షా అపాయింట్ మెంట్ మళ్లీ ఇప్పటికి దొరికింది. ఈ సందర్భంగానే ఇతర మంత్రులనూ కలిసే అవకాశం ఉంది. విభజన అంశాలతో పాటు వివిధ అంశాలపై అమిత్ షాతో సిఎం చర్చిస్తారని అధికారిక సమాచారం.
2019-10-20తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు అత్యంత ఆప్తులుగా చెలామణి అవుతున్న మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) అధిపతులు ఐ.టి.కి చిక్కారు. హవాలా మార్గాల ద్వారా ఈ కంపెనీ వందల కోట్ల రూపాయల చెల్లింపులు చేసినట్టు ఐటీ శాఖ గుర్తించింది. కంపెనీ పేరు వెల్లడించకుండా ఆదాయపన్ను శాఖ విడుదల చేసిన ప్రకటనలో ‘‘మేఘ’’ భాగోతాన్ని చూచాయగా వెల్లడించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్, హైడ్రోకార్బన్స్, విద్యుత్ రంగాల్లో ఉన్న ‘ఓ ప్రముఖ గ్రూపు’ సంస్థల్లో రూ. 17.4 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఐ.టి. తెలిపింది.
2019-10-19 Read Moreస్వయంప్రకటిత ‘‘కల్కి భగవాన్’’ విజయకుమార్ ఆశ్రమం, ఇతర ఆవాసాల నుంచి ఆదాయ పన్ను అధికారులు రూ. 93 కోట్ల మేరకు నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజులుగా ఏపీలోని వరదయ్యపాలెం కల్కి ఆశ్రమంలోనూ... బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని ఇతర ఆవాసాల్లోనూ అధికారులు సోదాలు చేశారు. మరో రూ. 500 కోట్లు అప్రకటిత ఆదాయాన్ని గుర్తించారు. రూ. 43.9 కోట్ల నగదు, 2.5 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 18 కోట్లు), 88 కేజీల బంగారం (రూ. 26 కోట్లు), 1271 కేరట్ల వజ్రాలు (రూ. 5 కోట్లు) సీజ్ చేశారు.
2019-10-19