కార్మిక సమస్యలు, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వ్యతిరేక కార్యక్రమాల సమ్మేళనంగా బుధవారం ‘‘భారత్ బంద్’’ జరిగింది. సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన 10 కేంద్ర కార్మిక సంఘాలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తోడై విస్తృత ప్రాతిపదికన బంద్ చేపట్టారు. ప్రభుత్వం ఇటీవల చేసిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), భవిష్యత్తులో చేపట్టనున్న జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి)లను వ్యతిరేకిస్తూ దేశంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం ప్రదర్శనలు జరిగాయి.
2020-01-08బెంగాల్ మినహా మిగిలిన దేశమంతటా ‘భారత్ బంద్’ ప్రశాంతంగా ముగిసింది. బంద్ పిలుపును మమత ప్రభుత్వం వ్యతిరేకించిన నేపథ్యంలో...ఆందోళనకారులూ శక్తిని చాటారు. అయితే, బంద్ రోజునే బెంగాల్ లో జరిగిన సిఎఎ వ్యతిరేక ఆందోళనల్లో హింస చెలరేగింది. ముర్షీదాబాద్, హౌరా, మాల్దా, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. 17 బస్సులు, 5 ఖాళీ రైళ్లకు నిప్పు పెట్టారు. ఆరు రైల్వే స్టేషన్లను ధ్వంసం చేశారు. మాల్దాలో నాటు బాంబులు విసిరారు.
2020-01-08ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో తమ సైనికులెవరూ చనిపోలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తమ సైనికులందరూ క్షేమంగా ఉన్నారని, తమ సైనిక స్థావరాలకు స్వల్ప నష్టం వాటిల్లిందని తెలిపారు. అమెరికా బలగాలు దేన్నయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. అయితే తాము యుద్ధం కోరుకోవడం లేదని ట్రంప్ స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో సంక్షోభానికి ఇరాన్ కారణమని ఆరోపించారు. సులేమానిని ఎప్పుడో చంపాల్సిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
2020-01-08అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న ఉద్యమం భూములు కోల్పోయిన రైతుల పరిధిని దాటింది. నిన్న చినకాకాని వద్ద, నేడు బెజవాడ నడిబొడ్డున జాతీయ రహదారి దిగ్భంధనం విజయవంతమయ్యాయి. అదే సమయంలో... నిన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి కారుపై రాళ్ళు రువ్విన ఘటనను చూపించి పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం అమరావతి జెఎసి బస్సు యాత్ర, చంద్రబాబు సహా జెఎసి నేతల పాదయాత్రను అడ్డుకున్నారు.
2020-01-08బెంజ్ సర్కిల్ లో అరెస్టయిన మాజీ సిఎం చంద్రబాబు, సీపీఐ నేత రామక్రిష్ణ, ఇతర జెఎసి నేతలను పోలీసులు ఎట్టకేలకు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అక్కడినుంచి తరలించారు. తొలుత జెఎసిలోని పార్టీల కార్యకర్తలు, ఆ తర్వాత స్థానికులు తోడై పోలీసులను అడ్డుకోవడంతో సుమారు గంటన్నరపాటు రహదారిపైనే ఉండిపోయారు. పోలీసు వాహనం తాళాన్ని కూడా ఎవరో మాయం చేసినట్టు వార్తలు వచ్చాయి. చివరికి అదనపు బలగాలను రప్పించి బలవంతంగా తరలించారు.
2020-01-08బుధవారం రాత్రి చెన్నై-కోల్ కత జాతీయ రహదారి స్తంభించింది. విజయవాడ బెంజ్ సర్కిల్ లో మాజీ సిఎం చంద్రబాబు సహా అమరావతి పరిరక్షణ సమితి నేతలు రహదారిపై బైఠాయించడం అనూహ్యమైన పరిణామాలకు దారి తీసింది. ఆందోళన చేస్తున్న నేతలను అరగంటలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. ఆ తర్వాత గంటపాటు అక్కడినుంచి తరలించలేకపోయారు. దీంతో రహదారి మొత్తం వాహనాలు అనేక కిలోమీటర్ల దూరం నిలిచిపోయాయి.
2020-01-08కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, కార్మిక చట్టాల సరళీకరణ వంటి విధానాలకు వ్యతిరేకంగా పది కార్మిక సంఘాలు బుధవారం ‘‘భారత్ బంద్’’ నిర్వహించాయి. కేరళ, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బంద్ దాదాపు సంపూర్ణంగా జరిగింది. దక్షిణాదిన కర్నాటక మినహా మిగిలిన చోట్ల బంద్ మెరుగ్గా జరిగింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన లభించింది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, రవాణా రంగాలు బాగా ప్రభావితమయ్యాయి.
2020-01-08బుధవారం రాత్రి విజయవాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు, ఇతర నేతలు రోడ్డుపై బైఠాయించిన విషయం తెలుసుకొని చుట్టుప్రక్కల ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలోనే నేతలను అరెస్టు చేసి పోలీసు వాహనాలు ఎక్కించడంతో.. వాహనాలు కదలకుండా కార్యకర్తలు, ప్రజలు అడ్డుపడ్డారు. దీంతో, బెంజ్ సర్కిల్ రణరంగంగా మారింది. పోలీసులు బలవంతంగా తరలించడానికి ప్రయత్నిస్తున్నా చాలాసేపటినుంచి అది సాధ్యం కావడంలేదు.
2020-01-08అమరావతి పరిరక్షణ సమితి బస్సు యాత్రను, తమ పాదయాత్రను అడ్డుకున్నందుకు నిరసనగా విజయవాడలో జాతీయ రహదారిపై బైఠాయించిన చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామక్రిష్ణ, బిజెపి నేత వెలగపూడి గోపాలక్రిష్ణ, టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నిమ్మల రామానాయుడు తదితరులను పోలీసులు తమ వాహనాల్లోకి ఎక్కించారు.
2020-01-08ప్రతిపక్షంలో ఉండగా రాజధానిని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి అంగీకరించిన వైఎస్ జగన్, ఇప్పుడు మార్చాలనుకుంటే ప్రజా తీర్పు కోరాలని టిడిపి అధినేత చంద్రబాబు సవాలు చేశారు. బుధవారం విజయవాడ బెంజ్ సర్కిల్ లోని వేదిక కళ్యాణ మండపంలో జరిగిన అమరావతి పరిరక్షణ సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క పిలుపుతో అమరావతి రైతులు 33 వేల ఎకరాలు రాజధానికోసం ఇచ్చారని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన సమస్య అని చెప్పారు.
2020-01-08