బొగ్గు, ముడి చమురు, సహజవాయువు, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఎనిమిది ప్రధాన పరిశ్రమల వృద్ధి రేటు నాలుగున్నర సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. 8 రంగాలు ఆగస్టులో తిరోగమించి మైనస్ 0.5 శాతం రేటును నమోదు చేశాయి. సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం... బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు శుద్ధి, ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ అనే ఎనిమిది ప్రధాన రంగ పరిశ్రమలు గత ఏడాది ఆగస్టులో 4.7 శాతం విస్తరించాయి.
2019-09-30 Read Moreఉత్తర గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో సోమవారం సాయంత్రం ప్రైవేట్ లగ్జరీ బస్సు బోల్తా పడటంతో 21 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. అహ్మదాబాద్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో బనస్కాంత జిల్లాలోని అంబాజీ పట్టణానికి సమీపంలో కొండ పాచ్ అయిన త్రిశూలియా ఘాట్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షం కారణంగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు ఘాట్ వద్ద బోల్తా పడిందని బనస్కాంత జిల్లా ఎస్పీ అజిత్ రాజియన్ తెలిపారు.
2019-09-30 Read More2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని బిజెపి, శివసేన ఖరారు చేసినట్లు రాష్ట్ర బిజెపి సీనియర్ మంత్రి చంద్రకాంత్ పాటిల్ సోమవారం ఇక్కడ చెప్పారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే సంయుక్త ప్రకటన ద్వారా సీట్ల భాగస్వామ్య పరిమాణాన్ని ప్రకటించనున్నట్లు పాటిల్ విలేకరులతో అన్నారు. ఆదిత్య ఠాక్రే ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి ఠాక్రే అవుతారు. ముంబైలోని వర్లి అసెంబ్లీ విభాగంలో పోటీ చేయనున్నట్లు ఆయన సోమవారం చెప్పారు.
2019-09-30 Read Moreరాజకీయ కారణాలతో తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఇరువురు ముఖ్యమంత్రుల సమావేశంలో అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ వెళ్లి తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావుతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులకు సాయం చేయడంలేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలను కేంద్రం వ్యతిరేకిస్తోందని, ఈ విషయంలో బీజేపీ వైఖరి సరిగా లేదని ఈ సమావేశంలో సిఎంలు అభిప్రాయపడినట్టు తెలిసింది.
2019-09-24 Read Moreన్యాయమూర్తుల నియామకాలు, బదిలీల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది. జస్టిస్ ఎఎ ఖురేషి నియామకానికి సంబంధించి గుజరాత్ హైకోర్టు న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ స్పందించారు. జస్టిస్ ఖురేషిని మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం 2019 మే 10న తీసుకున్న నిర్ణయం, కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల తర్వాత మారింది. ఈ జోక్యం తగదని గొగోయ్ సోమవారం పరోక్షంగా ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
2019-09-23 Read Moreరివర్స్ టెండరింగ్ పేరిట చేపట్టిన పోలవరం రీటెండరింగ్ ప్రక్రియలో ప్రధాన కాంట్రాక్టును మేఘ ఇంజనీరింగ్ కంపెనీ దక్కించుకుంది. ప్రధాన ఆనకట్ట, జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రామాణిక విలువను రూ. 4,987 కోట్లుగా నిర్దేశించగా... టెండరు దాఖలు చేసిన ఏకైక సంస్థ ‘మేఘ’ రూ. 4,358 కోట్ల అంచనా వ్యయంతో బిడ్ దాఖలు చేసింది. ఒక్క సంస్థే బిడ్ దాఖలు చేసినా... ప్రభుత్వం సోమవారం దాన్ని ఖరారు చేసింది. నిర్దేశిత విలువ కంటే రూ. 629 కోట్లు (12.6 శాతం) తక్కువ కోట్ చేసినందున ఆమేరకు నిధులు మిగులుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
2019-09-23 Read Moreజాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి) నుంచి పేరు తొలగించినా... ఏ ఒక్క హిందువూ దేశం వదిలి పోనవసరం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. ఇతర దేశాల్లో దాడులకు గురై ఇక్కడికి వచ్చిన హిందువులు దేశంలోనే ఉండిపోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అస్సాం పౌర రిజిస్టర్ సవరణలో 19 లక్షల మంది పేర్లు తొలగించగా.. అందులో ముస్లింల కంటే హిందువులే ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో... పశ్చిమబెంగాల్ లోని ఉలుబేరియాలో బిజెపి సహా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల ఆంతరంగిక సమావేశం జరిగింది.
2019-09-23 Read Moreఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలుకు వెళ్లిన కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరంను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం పరామర్శించారు. చిదంబరం ఈ నెల 5వ తేదీనుంచి తీహార్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. ఆర్థిక నేరస్తులకు కేటాయించిన జైలు నెంబర్ 7లో చిదంబరం ఉంటున్నారు. ఈ జైలుకు వెళ్లిన ఓ పార్టీ నేతను సోనియాగాంధీ, మన్మోహన్ పరామర్శించడం ఇదే మొదటిసారి. చిదంబరానికి తన మద్ధతును సోనియాగాంధీ పునరుద్ఘాటించినట్టు కార్తీ చిదంబరం చెప్పారు.
2019-09-23 Read Moreత్రివిధ దళాలకు ఒకే అధిపతిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి.డి.ఎస్)ని నియమించనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య సమన్వయం సాధించి, మెరుగైన నాయకత్వాన్ని సి.డి.ఎస్. అందిస్తారని ప్రధాని చెప్పారు. 73వ స్వాతంత్ర దినోత్సవాన ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మోదీ ప్రసంగించారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో తలెత్తిన సమన్వయ లోపాలను అధ్యయనం చేసిన ఉన్నత స్థాయి కమిటీ సి.డి.ఎస్. నియామకానికి సిఫారసు చేసింది.
2019-08-15 Read Moreదేశంలో ప్రతి అభివృద్ధి పనినీ అడ్డుకుంటున్నవారే ‘జమ్మూ కాశ్మీర్’పై తమ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ‘‘ప్రజలకు తాగునీరు అందించడానికి ఓప్రాజెక్టు ఉంటే వ్యతిరేకిస్తారు. ఓ రైల్వే ట్రాక్ నిర్మిస్తుంటే వ్యతిరేకిస్తారు. వారి హృదయాలు కేవలం మావోయిస్టులు, తీవ్రవాదులకోసం స్పందిస్తాయి’’ అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370, 35(ఎ) ఇన్నాళ్లూ కాశ్మీర్ ప్రజల పాలిట బంధనాలుగా ఉన్నాయని మోదీ పేర్కొన్నారు.
2019-08-14