క్లోరోక్విన్ సహా ‘కరోనా’పై ప్రచారంలో ఉన్న మందులేవీ సొంతగా వాడవద్దని ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.వి. రమేష్ ప్రజలకు సూచించారు. అమెరికాలో తాజాగా ‘క్లోరోక్విన్ ఫాస్ఫేట్’ తీసుకొని ఒకరు మరణించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైద్య సిబ్బంది, ‘కరోనా’ సోకినవారి కుటుంబ సభ్యులు ‘హైడ్రాక్సీక్లోరోక్విన్’ను తీసుకోవచ్చని ఐసిఎంఆర్ సిఫారసు చేసిందని, అయితే.. అలాంటివారికి అవసరమైతే ప్రభుత్వమే మందు ఇస్తుందని రమేష్ స్పష్టం చేశారు. మిగిలినవారెవరూ ఏ మందూ తీసుకోవద్దని సూచించారు. జ్వరం ఉంటే పారాసిటమాల్ 650 మాత్రమే వేసుకోవాలని చెప్పారు.
2020-03-24‘కరోనా వైరస్’ ప్రభావం పత్రికలపైనా తీవ్రంగా ఉంది. తెలంగాణలో ‘లాక్ డౌన్’ తీవ్రతరం కావడంతో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ‘డెక్కన్ క్రానికల్’ పత్రిక ముద్రణను తాత్కాలికంగా నిలిపివేసింది. 31వ తేదీవరకు తమ ప్రింట్ ఎడిషన్ ఉండదని పత్రిక యాజమాన్యం తెలిపింది. అదే యాజమాన్యానికి చెందిన ‘ఆంధ్రభూమి’ ఇప్పటికే నిలిచిపోయింది. ‘కరోనా’ భయం, ‘లాక్ డౌన్’ లతో సిబ్బంది, ఏజెంట్లు విధులు నిర్వర్తించడం కష్టమవుతోంది. పాఠకుల నిరాసక్తి వల్ల పత్రికల పంపిణీ, విడి అమ్మకాలు పడిపోయాయి. ప్రకటనల ఆదాయమూ తగ్గింది. దీంతో కొన్ని పెద్ద పత్రికలు సర్క్యులేషన్ తగ్గించాయి.
2020-03-24‘కరోనా’ నిరోధానికంటూ ‘క్లోరోక్విన్ ఫాస్ఫేట్’ను డాక్టర్ సలహా లేకుండా వాడి ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు ఓ అమెరికన్ జంట. ఆరిజోనాకు చెందిన ఆ జంటలో భర్త మరణించగా భార్య ఐసియులో ఉన్నారు. ‘క్లోరోక్విన్’ను కొందరు సిఫారసు చేయగా, ‘హైడ్రాక్సీక్లోరోక్విన్’ను ‘అజిత్రోమైసిన్’తో కలిపి తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ సూచించారు. దీంతో చాలా మంది అమెరికన్లు ఆ మందులను కొనిపెట్టుకున్నారు. ఇండియాలో ఐసిఎంఆర్ కూడా ఆరోగ్య సిబ్బందికి, వైరస్ నిర్ధారణ అయినవారి కుటుంబ సభ్యులకు సిఫారసు చేసింది. అయితే, మలేరియా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సలో ఉపయోగించే ఈ మందులను ‘కోవిడ్19’కు వాడటం వల్ల ఫలితంకంటే నష్టాలు ఎక్కువని ‘ట
2020-03-24 Read More‘కరోనా వైరస్’ మరణాలు ఇండియాలో 10కి పెరిగాయి. మంగళవారం ఉదయం ముంబైలో ఓ 65 సంవత్సరాల వ్యక్తి మరణించారు. ఆయన ఈ మధ్యే యుఎఇ నుంచి తిరిగి వచ్చారు. దీంతో ముంబై మృతుల సంఖ్య 3కి పెరిగింది. మంగళవారం ఉదయానికి దేశంలో 492 ‘కరోనా పాజిటివ్’ కేసులు నమోదయ్యాయి. ఈశాన్య భారతంలో తొలి కేసు మణిపూర్ రాష్ట్రంలో నమోదైంది. ఓ 23 సంవత్సరాల యువతికి కరోనా నిర్ధారణ అయింది. ఆమె యుకె నుంచి తిరిగి వచ్చారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 560 జిల్లాల్లో పూర్తి స్థాయి ‘లాక్ డౌన్’ ప్రకటించారు. ఈ రోజు రాత్రి 8.00 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు.
2020-03-24ఎల్లుండి (మార్చి26న) జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను జాతీయ ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. మొత్తం 17 రాష్ట్రాల్లోని 55 రాజ్యసభ సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా.. 10 రాష్ట్రాల్లో 37 మంది అభ్యర్ధులు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 18 స్థానాలకు 26న పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అందులో ఏపీవి 4 స్థానాలు. కరోనా వైరస్ తీవ్రత వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ‘లాక్ డౌన్’ ప్రకటించడం, దేశీయ విమానాలనూ ఈ రాత్రి నుంచి నిలిపివేస్తుండటం వంటి పరిణామాలతో ఎన్నికల వాయిదాకు ఈసీ నిర్ణయం తీసుకుంది. కొత్త పోలింగ్ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఈసీ మంగళవారం తెలిపింది.
2020-03-24ఏపీలో స్థానిక ఎన్నికలకోసం పదో తరగతి పరీక్షలను ఓసారి వాయిదా వేసిన రాష్ట్రప్రభుత్వం, ‘కరోనా వైరస్’ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి వాయిదా ప్రకటన చేసింది. తొలుత సవరించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 31 నుంచి టెన్త్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, ‘కరోనా వైరస్’ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 31నాటికి పరిస్థితి కుదుటపడే అవకాశాలు కనిపించడంలేదు. తెలంగాణలో ఇప్పటికే హైకోర్టు ఆదేశంతో పరీక్షలను వాయిదా వేశారు. ఆ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని.. మరో రెండు వారాల పాటు టెన్త్ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
2020-03-24పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి వ్యతిరేకంగా ఢిల్లీ షహీన్ బాగ్ ప్రాంతంలో ఏర్పాటైన నిరవధిక నిరసన శిబిరాన్ని ఢిల్లీ పోలీసులు మంగళవారం పొద్దున్నే ఖాళీ చేయించారు. ‘కరోనా’ భయంతో దేశమంతా ‘లాక్ డౌన్’ ప్రకటించిన నేపథ్యంలో దేశ రాజధానిలో 144 సెక్షన్ కింద ఆంక్షలు విధించారు. అయితే, షహీన్ బాగ్ నిరసన మాత్రం కొనసాగింది. డిసెంబరు 15న స్థానిక మహిళలు ప్రారంభించిన నిరసన, ఢిల్లీ అల్లర్ల సమయంలోనూ కొనసాగి 100 రోజులు పూర్తి చేసుకుంది. రాత్రి ఐదుగురు మహిళలు శిబిరంలో ఉండగా వారిని ఖాళీ చేయించినట్టు నిర్వాహకులలో ఒకరైన ఖుర్షీద్ ఆలం చెప్పారు.
2020-03-24మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం సాయంత్రం బిజెపి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చౌహాన్, అనంతరం రాజ్ భవన్ వేదికగా సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం శివరాజ్ సింగ్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం బల నిరూపణ తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. శివరాజ్ సింగ్ సిఎం పదవి చేపట్టడం ఇది నాలుగోసారి. ఆయన బిజెపి శాసనసభా పక్ష నేతగా ఎన్నిక కావడానికి వీలుగా.. ఇప్పటివరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన గోపాల్ భార్గవ ఆ పోస్టుకు రాజీనామా చేశారు.
2020-03-23రాష్ట్ర ప్రభుత్వ తప్పటడుగులపై హైకోర్టు, సుప్రీంకోర్టు ఒకే రోజు చీవాట్లు పెట్టాయి. రాజధానికోసం తీసుకున్న భూముల్లో 1251 ఎకరాలను పేదల ఇళ్ళ స్థలాలకోసం కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సోమవారం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై తాజాగా సుప్రీంకోర్టు కూడా తలంటింది. ఇంతకు ముందే చీవాట్లు పెట్టిన హైకోర్టు, రంగులు తుడిచేయాలని తీర్పు చెప్పింది. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళిన ప్రభుత్వానికి అక్కడా నిరాశ తప్పలేదు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళ స్థలాలను అమ్ముకునే వీలు కల్పించడాన్నీ హైకోర్టు తప్పు పట్టింది.
2020-03-23మలేరియా మందు ‘హైడ్రాక్సీక్లోరోక్విన్’ను ‘కోవిడ్19’ నిరోధకంగా వాడొచ్చని సోమవారం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సిఫారసు చేసింది (వైద్య సిబ్బంది, ‘కరోనా’ పాజిటివ్ తేలినవారి కుటుంబ సభ్యులకు మాత్రమే). ‘అజిత్రోమైసిన్’తో కలిపి ‘హైడ్రాక్సీక్లోరోక్విన్’ తీసుకుంటే ఫలితం ఉంటుందని ఈ నెల 21న డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో చెప్పాక ప్రపంచవ్యాప్తంగా ఈ మందులకు గిరాకీ పెరిగింది. ఐసిఎంఆర్ ప్రకటనతో ఇండియాలో డాక్టర్ సిఫారసు లేకుండా ఎవరికి వారు వాడితే, సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు మలేరియా నిరోధక శక్తి తగ్గిపోతుందని ఓ డాక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. (వివరాలకోసం ఎడమవైపునకు స్వైప్ చేయండి).
2020-03-24 Read More