ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకోసం కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను శనివారం ప్రకటించింది. 70 స్థానాలకు గాను 54 పేర్లను ప్రకటించారు. అందులో 33 మంది కొత్తవారు. 10 మంది మహిళలు. షీలా దీక్షిత్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన పలువురికి సీట్లు దక్కాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అల్కా లాంబాకు చాందినీ చౌక్ స్థానాన్ని కేటాయించారు. కాంగ్రెస్ ఎన్నికల క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ కీర్తి ఆజాద్ భార్య పూనమ్ ఆజాద్ ‘సంగం విహార్’ బరిలో దిగారు.
2020-01-18మహారాష్ట్రలో షిర్డీ సాయి జన్మస్థల వివాదం రాజుకుంది. సాయి మందిరం కొలువైన షిర్డీ పట్టణంలో ఆదివారం బంద్ నిర్వహిస్తున్నారు. సాయి జన్మస్థలం పర్భని జిల్లాలోని ‘పత్రి’ అని పేర్కొంటూ.. ఆ ప్రాంత అభివృద్ధికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రూ. 100 కోట్లు ప్రకటించడంపై ‘షిర్డీ’ సంస్థానం మండిపడింది. 102 సంవత్సరాల క్రితం సాయి సమాధి అయ్యేవరకు షిర్డీలో గడిపారని సంస్థానం చెబుతోంది. షిర్డీ నిరవధిక బంద్ జరిగినా దేవాలయం మాత్రం తెరిచే ఉంటుందని సంస్థానం తెలిపింది.
2020-01-19హోబర్ట్ అంతర్జాతీయ మహిళల డబుల్స్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (33) ఉక్రెయిన్ క్రీడాకారిణి ‘నాదియా కిచెనోక్’తో కలసి విజయకేతనం ఎగురవేసింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీలో చైనా బృందంతో హోరాహోరీగా జరిగిన పోరులో 6-4, 6-4 స్కోరుతో సానియా జోడీ గెలుపొందింది. రెండేళ్ళ విరామం తర్వాత అంతర్జాతీయ మైదానంలో అడుగు పెడుతూనే సానియా అదరగొట్టింది. సానియాకు ఇది 42వ అంతర్జాతీయ డబుల్స్ టైటిల్.
2020-01-19‘‘రెండు రోజుల్లో అడిగిన సొమ్ము ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు’’.. గుంటూరులో బ్యాంకు మోసం కేసును ఎదుర్కొంటున్న ఓ ప్రముఖుడికి సీబీఐ అధికారుల పేరిట వచ్చిన బెదిరింపు ఇది. సాక్షాత్తు ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయం ఫోన్ నెంబరు (011-24302700) నుంచే కాల్ వచ్చినట్టుగా కనిపించడానికి హానికరమైన సాఫ్ట్ వేర్ ఉపయోగించారు. ఆ ఘరానా మోసగాళ్లు వై. మణివర్దన్ రెడ్డి (హైదరాబాద్), సెల్వం రామరాజ్ (మదురై)లను సీబీఐ అరెస్టు చేసింది.
2020-01-18 Read Moreగుజరాత్ పటేల్ ఉద్యమ నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు హార్దిక్ పటేల్ శనివారం రాత్రి అరెస్టయ్యారు. 2015లో ఆయనపై నమోదైన ‘దేశద్రోహం’ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టులో విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు వారంట్ జారీ అయింది. వారంట్ జారీ అయిన కొద్ది గంటల్లోనే అహ్మదాబాద్ జిల్లా పోలీసులు పటేల్ ను అరెస్టు చేశారు. 2015 ఆగస్టు 25న అహ్మదాబాద్ నగరంలో పటేళ్ళ భారీ ర్యాలీలో హింస చోటు చేసుకుంది. ఇందుకు హార్దిక్ ను బాధ్యుడిగా పేర్కొంటూ ‘దేశద్రోహం’ కేసు నమోదు చేశారు.
2020-01-18సంక్రాంతి బరిలో నిలిచిన సూపర్ స్టార్లు రజినీకాంత్, మహేష్ బాబు, స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ లలో ఓవర్సీస్ ‘కలెక్షన్ స్టార్’ ఎవరు? అమెరికా బాక్సాఫీస్ సమాచారం ప్రకారం... 17వ తేదీ వరకు రజినీకాంత్ ‘దర్బార్’ రూ. 10.84 కోట్లు, మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ రూ. 13.54 కోట్లు వసూలు చేయగా అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురంలో’ ఏకంగా రూ. 15.18 కోట్లు రాబట్టింది. అస్ట్రేలియా, యు.కె.లలో కూడా ఈసారి అల్లు అర్జున్ సినిమానే ఎక్కువ వసూలు చేసింది.
2020-01-18ప్రభుత్వం మారగానే ప్రాజెక్టులను రద్దు చేయడాన్ని తప్పు పట్టారు అమెరికా మాజీ కాన్సూల్ జనరల్ కేథరిన్ హడ్డా. ‘‘గత ప్రభుత్వం చేసిన కాంట్రాక్టులను సమీక్షించడం వల్ల జవాబుదారీతనం పెరుగుతుందని, రాష్ట్రంలో అవినీతి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే కొత్త ప్రభుత్వాధినేతలు, వారి మద్దతుదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందాలను రీఫాషన్ చేయడమే లక్ష్యమని బయటి విమర్శకులు భయపడుతున్నారు’’ అని కేథరిన్ ‘ద హిందూ’ వ్యాసంలో విమర్శించారు.
2020-01-18ఈ నెల 20న అసెంబ్లీ ముట్టడి, జైల్ భరో కార్యక్రమాలతో ఆస్థి నష్టం, ప్రాణ నష్టం జరగొచ్చనే సమాచారం ఉందని పోలీసులు హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో ఉద్యమంలో పాల్గొంటున్నవారికి సి.ఆర్.పి.సి. సెక్షన్ 149 కింద నోటీసులు జారీ చేశారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తలపెట్టిన కార్యక్రమంతో ప్రజాశాంతికి, భద్రతకు, సమాజ శాంతికి భంగం కలుగుతుందని పోలీసువారికి ‘నమ్మకమైన సమాచారం’ ఉందని ఆ నోటీసులో పేర్కొన్నారు. అలాంటి కార్యక్రమాలు ఆపాలని సూచించారు.
2020-01-18ఈ నెల 20వ తేదీన అసెంబ్లీని ముట్టడించాలని మాజీ సిఎం చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అమరావతి పరిరక్షణ యాత్రలో ఆయన పాల్గొన్నారు. రాజధానిపై ప్రకటన చేయకుండా సచివాలయ తరలింపు ప్రయత్నాలు ప్రారంభించారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక సమావేశాల్లో రాజధానిపై ప్రభుత్వం ప్రకటన చేయవలసి ఉంది.
2020-01-18ముంబై-పూణె ఎక్స్ ప్రెస్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటి షబానా అజ్మీ తీవ్రంగా గాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలో ఖలాపూర్ వద్ద షబానా కారు అదుపు తప్పి ఓ ట్రక్కును ఢీ కొట్టింది. కారు ముందు సీటులో కూర్చోవడంవల్ల షబానా తీవ్రంగా గాయపడ్డారు. ఆమె భర్త జావేద్ అక్తర్ వెనుక మరో కారులో ప్రయాణిస్తున్నట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన షబానాను ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.
2020-01-18