కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సంయుక్త పత్రికా సమావేశంలో ట్రంప్ ఈ మాట చెప్పడం సంచలన కారకమైంది. ‘‘రెండు వారాల క్రితం మోదీని కలిశాను. ఈ అంశంపై మాట్లాడాం. మీరు మధ్యవర్తిత్వం వహిస్తారా.. అని నన్ను అడిగారు. ఎక్కడ అని అడిగితే.. కాశ్మీర్ అన్నారు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
2019-07-22ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్ళ వయసు నుంచే పింఛను ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి హామీపై స్పష్టత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ మంగళవారం అసెంబ్లీలో నిలదీసింది. అయితే, తమ మేనిఫెస్టోలో అలాంటి హామీ లేదని సిఎం జగన్, మంత్రులు స్పష్టం చేశారు. దీనిపై ఓ సభలో తాను మాట్లాడిన వీడియోను ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రదర్శించగా, తమ వద్ద ఉన్న వీడియో క్లిప్పును కూడా ప్రదర్శించాలని టీడీపీ డిమాండ్ చేసింది. చివరికీ వివాదం టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కు దారితీసింది.
2019-07-23కొత్త శాసనసభ కొలువుదీరాక తొలి సస్పెన్షన్ వేటు తెలుగుదేశం పార్టీ సీనియర్ సభ్యులపై పడింది. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అసెంబ్లీలో గట్టి దన్నుగా ఉన్న ముగ్గురు ఉప నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను ఏకంగా ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన సభ్యులు సభనుంచి వెళ్లిపోవాలని స్పీకర్ సూచించినా వినకపోవడంతో వారిని మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్ళారు.
2019-07-23ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న చంద్రయాన్-2 ప్రయోగం సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు విజయవంతంగా పూర్తయింది. భారత జియోసింక్రనస్ శాటెలైట్ లాంచ్ వెహికిల్ (జి.ఎస్.ఎల్.వి) మార్క్ 3-ఎం1 రాకెట్ 3840 కేజీల బరువున్న చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్టును భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ అంతరిక్ష వాహనం ప్రస్తుతం భూమికి ఓవైపు 169.7 కిలోమీటర్ల నుంచి మరోవైపు 45,475 కిలోమీటర్ల వరకు పరిభ్రమిస్తోంది. 48వ రోజున విక్రమ్ ల్యాండర్ చందమామపై అడుగు పెడుతుంది.
2019-07-22 Read Moreఅమరావతి సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టుకు రుణ సాయంకోసం చేసిన విన్నపాన్ని భారత ప్రభుత్వమే ఉపసంహరించుకుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అమరావతి ప్రాజెక్టును వదిలేసినట్టు గత వారం బ్యాంకు వెస్ సైట్లో పేర్కొన్నాక దుమారం రేగింది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏపీకి తమ సహకారం కొనసాగుతుందని అందులో పేర్కొంది. వైద్య, వ్యవసాయ, ఇంథన, విపత్తు సహాయ రంగాల్లో $100 బిలియన్ మేరకు సాయం అందిస్తున్నట్టు పేర్కొంది.
2019-07-21రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) నికర లాభం ఏకంగా రూ. 10 వేల కోట్లు దాటింది. ముఖేష్ అంబానీ కంపెనీ ఆదాయం మార్కెట్ నిపుణుల అంచనాలకు మించి 22.1 శాతం పెరిగింది. ఆదాయం రూ. 1.72 లక్షల కోట్లు రాగా దానిపైన నికర లాభం రూ. 10,104 కోట్లు సంపాదించింది. గత ఈ ఏడాది కంటే లాభం 6.8 శాతం పెరిగింది. 2019లో ఇదే కాలానికి ఆదాయం రూ. 1.41 లక్షల కోట్లుగా ఉంటే నికర లాభం రూ. 9,459 కోట్లు వచ్చింది.
2019-07-19 Read Moreఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఏపీ ఈడీబీ).. పెట్టుబడుల వేటకోసం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ. ఆ బోర్డు చట్టాన్ని తొలగించి దాని స్థానంలో ‘‘ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ చట్టం 2019’’ తేవాలని జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం శుక్రవారం నిర్ణయించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కొత్త సంస్థ బోర్డులో ఏడుగురు డైరెక్టర్లు ఉంటారు. సలహామండలిలో కంపెనీల సీఈవోలు, ఆర్థిక నిపుణులకు స్థానం కల్పిస్తారు.
2019-07-19ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో ఇచ్చే పనులు, సర్వీసు కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించేందుకు ప్రత్యేక చట్టాన్ని తేవాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతానికి చట్టబద్ధత కల్పించాలని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకోసం బిల్లును ప్రవేశపెట్టాలని తీర్మానించింది. శుక్రవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది.
2019-07-19‘‘వైఎస్ఆర్ నవోదయం’’ పేరిట కొత్త పథకానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల రుణాలను పునర్వ్యవస్థీకరించడంకోసం ఈ పథకాన్ని చేపట్టినట్టు పేర్కొంది. ఇందుకోసం 86 వేల ఖాతాలను గుర్తించామని, రూ. 4 వేల కోట్ల రుణాలను ‘వన్ టైమ్ రీస్ట్రక్చర్’ కిందకు తెస్తామని, తద్వారా ఆయా ఖాతాలు ‘పారుబకాయిల’ జాబితాలో చేరకుండా చూస్తామని ప్రభుత్వం వివరించింది.
2019-07-19ప్రభుత్వ ప్రాజెక్టుల టెండర్లను జడ్జి పరిశీలన తర్వాతే ఆమోదించేలా ‘జ్యుడిషియల్ కమిషన్’ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సిఎం జగన్మోహన్ రెడ్డి, అందుకోసం ఓ ముసాయిదా బిల్లును రూపొందించి శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో ఆమోదింపజేశారు. అయితే, గత ప్రకటనకు కాస్త భిన్నమైన ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉన్నాయి. ‘సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి’ అన్నది అందులో ఒకటి. రూ. 100 కోట్లకు పైగా విలువైన కాంట్రాక్టులను ఆ జడ్జి పరిధిలోకి తెస్తామని పేర్కొన్నారు.
2019-07-19