ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బుధవారం ప్రవేశించారు. తాడేపల్లిలో జమిలిగా నిర్మించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం, జగన్ ఇల్లు ఒకేసారి ప్రారంభమయ్యాయి. పార్టీ నేతల సమక్షంలో సర్వమత ప్రార్ధనలతో వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి గృహప్రవేశం చేశారు. రాజధాని ప్రాంతంలో శాశ్వత గృహం, కార్యాలయం ఏర్పాటు చేసుకున్న తొలి నేత వైఎస్ జగన్ అని ఆ పార్టీ నేతలు ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
2019-02-28పన్ను వసూళ్లు లక్ష్యాలకు అనుగుణంగా లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సూచీలు తిరోగమనంలో ఉన్నాయి. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు, ప్రాథమిక లోటు లక్ష్యాలను దాటి అగాథపు అంచులకు చేరాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లోనే (జనవరి వరకు) ద్రవ్య లోటు లక్ష్యంలో 121.5 శాతానికి చేరుకుంది. రెవెన్యూ లోటు లక్ష్యానికి 143.4 శాతం నమోదు కాగా ప్రాథమిక లోటు లక్ష్యానికి ఏకంగా 656.7 శాతం నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో ద్రవ్య లోటు లక్ష్యానికి 113.7 శాతం, రెవెన్యూ లోటు 109.2 శాతం, ప్రాథమిక లోటు 409.8 శాతం నమోదయ్యాయి.
2019-02-28పాకిస్తాన్ కస్టడీలో ఉన్న ఐఎఎఫ్ పైలట్ అభినందన్ ను వెంటనే సురక్షితంగా వెనుకకు పంపాలని ఇండియా డిమాండ్ చేసింది. బుధవారం ఉదయం భారత, పాక్ యుద్ధ విమానాల డాగ్ ఫైట్ లో సరిహద్దులు దాటిన మిగ్ 21 బైసన్ ను దాయాది ఆర్మీ కూల్చివేసిన సంగతి తెలిసిందే. ప్రాణాలతో బయటపడిన పైలట్ అభినందన్ బంధీ అయ్యారు. భారత ఆర్మీ స్థావరాలపై దాడికి వచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన తర్వాత పైలట్ మిస్సయ్యారని ఇండియా ప్రకటించింది. గాయపడిన పైలట్ వీడియోను విడుదల చేయడాన్ని తప్పు పట్టింది.
2019-02-28‘ట్రంప్ ఒక నయ వంచకుడు, జాత్యహంకారి’... ఈ మాటలన్నది అమెరికా అధ్యక్షుడి మాజీ వ్యక్తిగత లాయర్ మైఖేల్ కోహెన్. ఒక శృంగార తారకు సొమ్ము ముట్టజెప్పాలని తనను ట్రంప్ నిర్దేశించారని, 2016లో వికీలీక్స్ ప్రచురించిన హిలరీ క్లింటన్ ఇమెయిల్స్ విషయం ఆయనకు ముందే తెలుసని కోహెన్ చెప్పారు. ఈ రెండు ఆరోపణలనూ ట్రంప్ ఇంతకు ముందే తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ ముందు కోహెన్ సాక్ష్యమిచ్చారు. అయితే, 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రష్యన్లతో లాలూచీ పడినట్టు తన వద్ద ప్రత్యక్ష సాక్ష్యమేమీ లేదని కోహెన్ తెలిపారు.
2019-02-28గత రెండు రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ తన గగనతలంలో పౌర విమానాలను అనుమతించడంలేదు. బుధవారం ఒక్క విమానమూ ఎగరలేదు. మరోవైపు ఇండియా మాత్రం పాకిస్తాన్ సరిహద్దులకు దూరంగా ఉన్న ప్రాంతాలన్నిటా యధావిధిగా పౌర విమానాలను అనుమతిస్తోంది. పై చిత్రం రెండు దేశాల గగనతలంలో నెలకొన్న తాజా (బుధవారం రాత్రి 10.15 గంటల వరకు) పరిస్థితికి అద్దం పడుతోంది. సరిహద్దు రాష్ట్రాలైన కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ లతోపాటు హిమాలయ రాష్ట్రాల్లో కూడా విమాన రాకపోకలను ఇండియా నిలిపివేసింది. కర్టసీ : ఫ్లైట్ రాడార్.
2019-02-27భద్రతా దళాల త్యాగాలను పచ్చిగా రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారని బీజేపీ నేతలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా 21 ప్రతిపక్ష పార్టీల నేతలు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. కాశ్మీర్ ఉగ్రవాద దాడిలో మరణించిన 40కి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళి అర్పించిన నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. బుధవారం పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడిన భారత పైలట్ అభినందన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యులని ప్రతిపక్ష నేతలు భావించారు.
2019-02-27అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెండోసారి సమావేశమయ్యారు. వియత్నాం రాజధాని హనోయి వారి భేటీకి వేదికైంది. ఈ ఇద్దరు నేతల రెండు రోజుల ‘హనోయి సదస్సు’ బుధవారం ముఖాముఖి సమావేశంతో ప్రారంభమైంది. ఎనిమిది నెలల క్రితం ట్రంప్, కిమ్ మొదటి సమావేశం సింగపూర్ వేదికగా జరిగింది. అప్పుడు.. కొరియా భద్రతకు ట్రంప్ హామీలు ఇవ్వగా, ‘అణ్వాయుధ రహిత కొరియా’కు తాను కట్టుబడి ఉన్నట్టు కిమ్ చెప్పారు. మధ్యలో కొంత అపనమ్మకం, అపార్ధాలు వచ్చాయని కిమ్ చెప్పారు. వాటిని అధిగమించి 260 రోజుల తర్వాత రెండోసారి సమావేశమయ్యారు.
2019-02-27ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు నిర్ణయించినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ‘దక్షిణ కోస్తా రైల్వే’ (ఎస్.సి.ఒ.ఆర్)గా ఈ కొత్త జోన్ పేరు ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఈ కొత్త జోన్ పరిధిలో ఉంటాయి. వాల్తేరు కేంద్రంగా ఉన్న డివిజన్ ను రెండుగా విభజించి ఒక భాగాన్ని విజయవాడ డివిజనుకు కలుపుతారు. మిగిలిన భాగాన్ని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజనుగా పరిగణిస్తారు.
2019-02-27ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఎంఐ17 వి5 బుధవారం జమ్మూ కాశ్మీర్ లోని బుద్గాంకు ఏడు కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్ లో ఉన్న ఆరుగురు పైలట్లు, ఒక పౌరుడు (కిఫాయత్, 30) మరణించారు. బుధవారం ఉదయం 10.00 గంటలకు శ్రీనగర్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన పది నిమిషాలకే హెలికాప్టర్ఎం సాంకేతిక కారణాలతో కూలినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు యోధులకు ప్రాణాంతక గాయాలయ్యాయని రక్షణ విభాగం ఒక ప్రెస్ నోట్ లో పేర్కొంది. ఈ దుర్ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి అధికారులు ఆదేశించారు.
2019-02-27పాకిస్తానీ ఆర్మీ ప్రవర్తన పట్ల పట్టుబడిన ఇండియన్ పైలట్ అభినందన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తనపై దాడికి దిగిన సమూహంనుంచి కాపాడిన కమాండర్ సహా పాకిస్తాన్ ఆర్మీ అధికారులు గౌరవంగానే మెలిగారని చెప్పారు. బుధవారం గగనతలంలో జరిగిన ఫైట్ అనంతరం పట్టుబడిన అభినందన్ ను పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ప్రశ్నించారు. ఆ సంభాషణను వీడియో తీసి మీడియాకు విడుదల చేశారు. తాను దక్షిణ భారతం నుంచి వచ్చానని, వివాహితుడనని అభినందన్ సమాధానాలు చెప్పారు. ఎయిర్ ఫోర్స్ వ్యూహం, పాకిస్తాన్ భూభాగంపై దాడులు తదితర అంశాలపై మాత్రం సమాధానమివ్వడానికి మాత్రం తిరస్కరించాడు.
2019-02-27