తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి, సిఎం అయ్యాక ఇప్పుడు ఎందుకు ఉపసంహరించుకున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఎవరిని కాపాడటం కోసం ఈ పని చేశారని వర్ల నిలదీశారు. ఈ విషయంలో వివేకానందరెడ్డి సతీమణి, కుమార్తెలకు.. వారితో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
2020-02-07సిఎం జగన్మోహన్ రెడ్డి మూడో కన్ను తెరిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు భస్మం అవుతారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ యాదవ్ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఎన్ని వేషాలు వేసినా జగన్ క్షమాగుణం, ఓర్పు వల్లనే మనగలుగుతున్నారని చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాలలో గాంధీ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా అనిల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాము మంత్రులం కావడంకంటే ముందు జగన్మోహన్ రెడ్డి భక్తులమని, పదవి పోయినా భక్తులుగా ఉండటమే గొప్ప అని పేర్కొన్నారు.
2020-02-07రాజ్యసభ చరిత్రలో అరుదైన పరిణామం ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంలోని ‘అబద్ధం’ అనే పదాన్ని రికార్డులనుంచి తొలగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ముగిస్తూ గురువారం రాజ్యసభలో ప్రధాని మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్)పై మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని వ్యాఖ్యానించారు. ఆ పదం ‘అన్ పార్లమెంటరీ’ అయినందున తొలగించినట్టు రాజ్యసభ అధికారులు తెలిపారు.
2020-02-072018లో గురుగ్రామ్ జిల్లాలో ఓ జడ్జి భార్యను, కుమారుడిని కాల్చి చంపిన భద్రతాధికారి మహిపాల్ సింగ్ కు మరణశిక్ష పడింది. దోషికి మరణశిక్ష విధిస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. హెడ్ కానిస్టేబుల్ మహిపాల్ సింగ్ గురుగ్రామ్ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి క్రిష్ణకాంత్ శర్మకు భద్రతాధికారిగా పని చేశాడు. ఓ రోజు ఆయన జడ్జి భార్య రీతు శర్మ (38)తో గొడవపడ్డాడు. ఆమెను, కుమారుడు ధ్రువ్ శర్మ (18)ను కాల్చి చంపాడు. తనకు సెలవులు ఇవ్వకుండా వేధించారని, అవమానించారని ఆరోపించాడు.
2020-02-07‘కరోనా వైరస్’ దాడికి గురైన చైనా నగరం ‘వుహాన్’లో భారతీయ విద్యార్ధులు 80 మంది ఉన్నారని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ శుక్రవారం రాజ్యసభలో చెప్పారు. వారిలో 70 మంది అక్కడే ఉండటానికి నిర్ణయించుకొని ఇండియా పంపిన రెండు విమానాల్లోనూ రాలేదని చెప్పారు. మరో 10 మంది విద్యార్ధులు విమానాశ్రయానికి వచ్చారని, అయితే... జ్వరంతో ఇబ్బంది పడుతున్న వారిని చైనా అధికారులు విమానంలోకి అనుమతించలేదని చెప్పారు.
2020-02-07అస్సాంలో ‘‘శాశ్వత శాంతి’’ ఉదయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ‘బోడో శాంతి ఒప్పందం’పై కోక్రఝార్ లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు మోడీ శుక్రవారం హాజరయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై అస్సాంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగాక.. తొలిసారి మోడీ ఆ రాష్ట్రంలో అడుగుపెట్టారు. డిసెంబరులో జపాన్ ప్రధాని ‘షింజో అబె’తో గౌహతిలో జరగాల్సిన సమావేశాన్ని, జనవరిలో ‘ఖేలో ఇండియా’ క్రీడోత్సవ పర్యటనను కూడా మోడీ రద్దు చేసుకున్నారు.
2020-02-07పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఓ మిరాజ్ విమానం శుక్రవారం పంజాబ్ ప్రావిన్స్‌లో కూలిపోయింది. ప్రావిన్స్‌లోని షోర్కోట్ ప్రాంతానికి సమీపంలో శిక్షణా కార్యక్రమంలో ఉండగా ఈ ఘటన జరిగింది. "పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. భూమిపైన కూడా ఎలాంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం రిపోర్టు కాలేదు" అని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కారణాలపై విచారణకు ఆదేశించారు. జనవరి 7న ఓ శిక్షణా విమానం కూలి ఇద్దరు పైలట్లు చనిపోయారు.
2020-02-07హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో కారిడార్ శుక్రవారం ప్రారంభమైంది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు నిర్మాణమైన సరికొత్త లైనును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. 11 కి.మీ. పొడవైన ఈ లైన్లో రెండు ప్రాంతాల మధ్య 9 స్టేషన్లు ఉంటాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలనుంచి వచ్చే ప్రజలకు జె.బి.ఎస్. నుంచి నిర్మితమైన కారిడార్ బాగా ఉపయోగపడుతుంది.
2020-02-072020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 15,201 కోట్ల మేరకు రెవెన్యూ లోటు ఉంటుందని కేరళ ప్రభుత్వం అంచనా వేసింది. బడ్జెట్ పత్రాలను కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది రెవెన్యూ రశీదులు రూ. 1,14,636 కోట్లుగా అంచనా. వ్యయం మాత్రం రూ. 1,29,837 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 17,474 కోట్లు.
2020-02-07మతతత్వాన్ని వ్యతిరేకించే కేరళ ప్రభుత్వం.. మహాత్మాగాంధీని నాథురాంగాడ్సే (ఆర్ఎస్ఎస్) హత్య చేస్తున్న సందర్భాన్ని.. బడ్జెట్ 2020-21 ప్రసంగ పాఠం కవర్ పేజీపై చిత్రించింది. ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ ‘‘ఇండియాలో ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం ముఖాముఖి తలపడ్డాయి. ఢిల్లీ పాలకులు ద్వేషభాషలోనే మాట్లాడుతున్నారు. వారి అనుయాయులు హింస, దాడులనే కర్తవ్యంగా భావిస్తున్నారు. పాలనా యంత్రాంగం పూర్తిగా మతతత్వానికి లొంగిపోయింది’’ అనే వాఖ్యాలనే ముందుమాటగా చదివారు.
2020-02-07