కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా బీజేపీ ప్రభుత్వం వేధించడం వల్లనే తమ పార్టీ ఎంపీ, బెంగాలీ నటుడు తపస్ పాల్ గుండెపోటుకు గురయ్యారని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తపస్ పాల్ మంగళవారం ముంబై ఆసుపత్రిలో మరణించారు. ఇంతకు ముందు మాజీ ఎంపీ సుల్తాన్ అహ్మద్, ఎంపీ ప్రసూన్ బెనర్జీలను కూడా కేంద్రమే బలి తీసుకుందని మమత ధ్వజమెత్తారు. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కేసులో సీబీఐ తపస్ పాల్ ను 2016లో అరెస్టు చేసింది.
2020-02-19 Read Moreపెట్టుబడులు..వాటితో ఉద్యోగాలు వస్తేనే 75 శాతం స్థానిక రిజర్వేషన్ తో ఉపయోగమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం వచ్చాక రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కు పోయాయని విమర్శించారు. జగన్ ప్రభుత్వంపై సమరానికి ‘ప్రజా చైతన్య యాత్ర’ చేపట్టిన చంద్రబాబు, బుధవారం తొలిగా ప్రకాశం జిల్లా మార్టూరు బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘ఈ జిల్లా (ప్రకాశం)లో 25 వేల కోట్లతో పేపర్ మిల్లు పెట్టడానికి వచ్చినవాళ్లూ వెళ్లిపోయారు’’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు.
2020-02-19చైనాలో కరోనా వైరస్ మరణాలు 2,004కు చేరాయి. మంగళవారం 136 మరణాలు నమోదు కాగా అందులో 132 మంది ఒక్క హుబీ ప్రావిన్సులోనే చనిపోయారు. మొత్తం నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 74,185కి చేరింది. 14,376 మందికి నయమై ఆసుపత్రులనుంచి డిశ్చార్జి కాగా 11,977 మంది విషమ పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా 57,805 నిర్ధారిత కేసుల్లో చికిత్స జరుగుతోంది. కొత్త కేసుల సంఖ్య మంగళవారం 1,749కి తగ్గిపోయింది.
2020-02-19 Read Moreపౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి) విషయంలో ముస్లింలకు అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. బుధవారం ఆయన ‘నవ మాసాలు-నవ మోసాలు’ నినాదంతో ప్రభుత్వంపై సమరానికి ‘ప్రజా చైతన్యయాత్ర’ చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్టూరులో తొలి సభ ప్రారంభంలోనే పర్చూరు నియోజకవర్గ ముస్లింల విన్నపంపై చంద్రబాబు స్పందించారు.
2020-02-19చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఐదు మీడియా సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికాలో పని చేసే ఆయా సంస్థలను విదేశీ ఎంబసీల మాదిరే పరిగణిస్తామని పేర్కొంది. దీంతో..చైనా మీడియా సంస్థల్లో పని చేసే సిబ్బంది పేర్లు, వారి ఆస్తుల వివరాలను అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ వద్ద నమోదు చేయాల్సి వుంటుంది. కొత్త నిర్ణయం.. జిన్హువా న్యూస్ ఏజెన్సీ, చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్, చైనా రేడియో ఇంటర్నేషనల్, చైనా డెయిలీ డిస్ట్రిబ్యూషన్ కార్ప్, హాయ్ టియాన్ డెవెలప్ మెంట్ యుఎస్ఎ ఇంక్ సంస్థలకు వర్తిస్తుంది.
2020-02-19 Read Moreఅమెరికా అధ్యక్షుడి పర్యటన కోసం.. ఎయిర్ పోర్టు నుంచి వచ్చే దారిలో మురికి వాడ కనిపించకుండా గోడ కట్టి ప్రపంచ ఖ్యాతి గడించిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మరో ఘనకార్యం కూడా చేసింది. వల్లభాయ్ పటేల్ స్టేడియం సమీపంలోని మురికివాడను ఖాళీ చేయాలని 45 కుటుంబాలకు నోటీసులు జారీ చేసింది. 24, 25 తేదీల్లో డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు సొంత రాష్ట్రంలో ఆతిథ్యమిస్తున్న ప్రధాని మోడీ, పటేల్ స్టేడియంలో భారీ సభ నిర్వహించబోతున్నారు. దాంతో.. ఇప్పుడు ఆ మురికివాడ జనం ‘ఆక్రమణదారుల’ని గుర్తొచ్చింది.
2020-02-18 Read Moreమాజీ సిఎం చంద్రబాబుకు, ఆయన తనయుడు..మాజీ మంత్రి నారా లోకేష్ కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను తగ్గించిందని టీడీపీ నేతలు మంగళవారం ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణను డీజీపీ కార్యాలయం ఖండించింది. చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉందని, ఎలాంటి మార్పులూ చేయలేదని మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. విజయవాడలో 135 మందితో, హైదరాబాద్ లో 48 మందితో (మొత్తం 183 మందితో) చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్నట్టు తెలిపింది.
2020-02-19తప్పుడు గుర్తింపుతో ఆధార్ నెంబరును పొందారన్న పోలీసు నివేదికలతో 127 మందికి తమ హైదరాబాద్ కార్యాలయం నోటీసులు జారీ చేసినట్టు యుఐడిఎఐ వెల్లడించింది. వారంతా ఆధార్ నెంబరు పొందడానికి అర్హత లేని అక్రమ వలసదారులుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆధార్ చట్టం ప్రకారం అలాంటి కార్డులు రద్దవుతాయని, ‘పౌరసత్వం’తో తమ నోటీసులకు సంబంధం లేదని పేర్కొంది. అక్రమ వలసదారులకు ఆధార్ కార్డు ఇవ్వొద్దన్న సుప్రీంకోర్టు తీర్పును ఉటంకించింది.
2020-02-19 Read Moreవరకట్న వేధింపులకు ఓ కన్నడ గాయని బలయ్యారు. 26 సంవత్సరాల ప్లేబ్యాక్ సింగర్ సుష్మిత సోమవారం బెంగళూరులోని తల్లి నివాసంలో ఉరి వేసుకొని మరణించారు. చనిపోయే ముందు రాసిన లేఖలో.. తన భర్త శరత్, అత్త వైదేహి, ఆమె సోదరి గీత వేధించారని సుష్మిత పేర్కొన్నారు. వారిని వదలొద్దని కోరుతూ ‘అమ్మా నన్ను క్షమించు’ అని సుష్మిత రాశారు. పోలీసులు ఐపిసిలోని 304బి (వరకట్న మరణం) కింద కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గురూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
2020-02-18 Read Moreసెలక్ట్ కమిటీల వివాదం ఇప్పుడు శాసన మండలి సరిహద్దులు దాటింది. తన ఆదేశాలను కార్యదర్శి ఒకటికి రెండుసార్లు ఉల్లంఘించడంపై మండలి ఛైర్మన్ ఎం.ఎ. షరీఫ్ రాష్ట్ర ప్రథమ పౌరుడికి ఫిర్యాదు చేశారు. మంగళవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ ను కలసిన ఛైర్మన్, నాలుగు పేజీల లేఖను సమర్పించారు. గతంలో ఎప్పుడూ మండలి ఛైర్మన్ ఆదేశాలను కార్యదర్శి ఉల్లంఘించిన దాఖలాలు లేవని నివేదించారు. సెలక్ట్ కమిటీలపై ఉత్తర్వులు ఇవ్వాలన్న తన ఆదేశాలను ఉల్లంఘించిన కార్యదర్శి బాలక్రిష్ణాచార్యులుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
2020-02-18