మొబైల్ ఇంటర్నెట్ డౌన్ లోడ్ వేగం విషయంలో ఇండియా అధ్వాన స్థాయిలో ఉంది. ‘స్పీడ్ టెస్ట్.నెట్’ 145 దేశాల్లో ఇంటర్నెట్ వేగాన్ని పరిశీలిస్తే అందులో ఇండియాది 131వ స్థానం. శ్రీలంక 83వ స్థానంలో ఉండగా మన దాయాది పాకిస్తాన్ 118 స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ మొబైల్ ఇంటర్నెట్ డౌన్ లోడ్ స్పీడు 13.08 ఎంబిబిఎస్ ఉంటే ఇండియాలో 10.65 ఎంబిబిఎస్ మాత్రమే ఉంది. చివరికి నేపాల్ కూడా 10.78 ఎంబిపిఎస్ స్పీడుతో ఇండియా కంటే ముందుంది. పొరుగు దేశాల్లో ఒక్క బంగ్లాదేశ్ (135) మాత్రమే ఇండియా కంటే వెనుక ఉంది.
2019-10-11 Read Moreమూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం భారతదేశానికి సంబంధించిన 2019-20 జిడిపి వృద్ధి అంచనాను 5.8 శాతానికి తగ్గించింది. గత వారం రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) అంచనా వేసిన 6.1 శాతం కంటే ఇది బాగా తక్కువ కావడం గమనార్హం. మూడీస్ గత అంచనా ప్రకారం జీడీపీ 6.2 శాతం పెరగాల్సి వుంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంటున్నదని, ఇది కొంతవరకు దీర్ఘకాలిక కారకాలతో సంబంధం కలిగి ఉందని మూడీస్ పేర్కొంది. పెట్టుబడిలో మందగమనం వినియోగానికి విస్తరించిందని, గ్రామీణ గృహాల్లో ఆర్థిక ఒత్తిడి, బలహీనమైన ఉద్యోగ కల్పన ఈ పరిస్థితికి కారణమయ్యాయని విశ్లేషించింది.
2019-10-10 Read Moreసిరియా నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు అమెరికా ప్రకటించిన మూడు రోజుల్లోనే కుర్దులపైన టర్కీ దాడి చేసింది. ఈశాన్య సిరియాలో కుర్దు మిలీషియా అధీనంలో ఉన్న ప్రాంతాలపై బుధవారం టర్కీ జరిపిన తొలి దాడిలో 11 మంది మరణించినట్టు ప్రాథమిక సమాచారం. దాడులు జరుగుతున్న ప్రాంతాలనుంచి వేలమంది వలస పోతున్న దృశ్యాలు సామాజిక మాథ్యమాల్లో కనిపిస్తున్నాయి. టర్కీ ఆక్రమణపై చర్చించేందుకు భద్రతా మండలి సమావేశం నిర్వహించాలని యుకె, ఫ్రాన్స్ కోరాయి.
2019-10-10టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఈశాన్య సిరియాలో కుర్దుల నేతృత్వంలోని మిలీషియాలకు వ్యతిరేకంగా సైనిక ఆపరేషన్ ప్రారంభించారు. కుర్దిష్ మిలీషియాలను ఉగ్రవాదులుగా చూస్తున్న అంకారా, ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి దాడి అవసరమని వాదిస్తోంది. తాజా దాడికి ‘ఆపరేషన్ పీస్ స్ప్రింగ్’ అని నామకరణం చేసింది. టర్కీలోని కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పికెకె)కి అనుబంధంగా ఉన్నట్టు భావిస్తున్న సిరియా కుర్దు మిలిటెంట్లతో పాటు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపైనా దాడి చేస్తున్నట్టు ఎర్డొగాన్ ప్రకటించారు.
2019-10-09 Read Moreచిత్రనిర్మాతలు శ్యామ్ బెనెగల్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, చరిత్రకారుడు రామచంద్ర గుహ సహా 50 మంది ప్రముఖులపై నమోదైన దేశద్రోహం కేసును బీహార్ పోలీసులు ఉపసంహరించారు. గతవారం ముజఫరాపూర్ పోలీసులు సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు దేశద్రోహం కేసును నమోదు చేశారు. ఆ కేసును మూసివేయాలని సదరు పోలీస్ స్టేషన్ కు ఆదేశాలు జారీ చేశామని, ముగింపు నివేదికను కోర్టుకు సమర్పిస్తామని ముజఫరాపూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ సిన్హా బుధవారం తెలిపారు.
2019-10-09 Read Moreచైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఈ నెల 11, 12 తేదీల్లో ఇండియాలో పర్యటించనున్నారు. చెన్నైకి దగ్గరగా ఉన్న మమల్లాపురం వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే 2వ అనధికారిక శిఖరాగ్ర సమావేశంలో జిన్ పింగ్ ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై కూడా వారు చర్చించనున్నట్టు సమాచారం. తర్వాత జిన్ పింగ్ 13న నేపాల్ పర్యటనకు వెళ్తారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ బుధవారం ప్రకటించారు.
2019-10-09 Read Moreదీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఓ తీపి వార్తను ప్రకటించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డిఎ/డిఆర్ ను ప్రస్తుతం ఉన్న 12 శాతం నుంచి 17 శాతానికి పెంచుతూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 49.93 లక్షల మంది ఉద్యోగులు, 65.26 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని, ఖజానాకు రూ .16 వేల కోట్లు ఖర్చవుతాయని సమాచార-ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు.
2019-10-09 Read More(అమెరికా-చైనా) వాణిజ్య యుద్ధపు గొలుసుకట్టు ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2020నాటికి 700 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కొత్త సారథి క్రిస్టలీనా జార్జీవా అంచనా వేశారు. ఈ మొత్తం ప్రపంచ జీడీపీలో 0.8 శాతానికి సమానమని, స్విట్జర్లాండ్ జీడీపీకి ఇది దాదాపు సమానమని ఆమె పేర్కొన్నారు. ఐఎంఎఫ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ప్రపంచ జీడీపీ వృద్ధి రేటులో క్షీణత గతంలో అంచనా వేసిన మోతాదుకంటే ఎక్కువగానే ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
2019-10-08 Read Moreవాణిజ్య వివాదాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కారణమవుతున్నాయని, గత దశాబ్ద కాలంలోనే అతి తక్కువ వృద్ధి రేటును ఈ సంవత్సరం చూడబోతున్నామని ఐఎంఎఫ్ కొత్త చీఫ్ క్రిస్టలీనా జార్జీవా ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య ఘర్షణల ప్రభావం చాలా విస్తృతంగా ఉన్నట్టు అధ్యయనం చెబుతోందని జార్జీవా ఐఎంఎఫ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించాక తొలి ప్రసంగంలో చెప్పారు. 2019లో ప్రపంచంలోని 90 శాతం భాగంలో తక్కువ వృద్ధి రేటు నమోదవుతుందని ఆమె అంచనా వేశారు.
2019-10-08 Read Moreప్రపంచంలోని అతిపెద్ద డబుల్ డెక్ సస్పెన్షన్ వంతెన అక్టోబర్ 8న సెంట్రల్ చైనా హుబీ ప్రావిన్స్ వుహాన్‌లో అధికారికంగా ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. యాంగ్జీ నదికి అడ్డంగా 4.13 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ వంతెనలో 12 లేన్ల రహదారుల రెండు డెక్స్ ఉన్నాయి, ఇది ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది.
2019-10-07