ఎన్.సి.సి. బాలికా కేడెట్లకు పోర్న్ వీడియోలు పంపిన భారత ఆర్మీ మేజర్ జనరల్ ఒకరు ‘కోర్టు మార్షల్’ను ఎదుర్కోబోతున్నారు. దేశ పశ్చిమ భాగంలో పోస్టయిన ఈ అధికారి విధుల్లో ‘నేషనల్ కేడెట్ కార్ప్స్’ బాలికల విభాగం కూడా భాగం. అక్కడి బాలికా కేడెట్లకు ఈ మేజర్ జనరల్ సెక్స్ వీడియోలను షేర్ చేసేవాడు. ఆ బాలికలు సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఇటీవలే లైంగిక వేధింపుల కేసులో మరో మేజర్ జనరల్ ను కోర్టు మార్షల్ చేశారు.
2019-10-31 Read Moreప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఒ)లో అమెరికా దాఖలు చేసిన కేసులో ఇండియాకు ఓటమి ఎదురైంది. ఎగుమతులకు ఇండియా దేశీయంగా ఇస్తున్న ప్రోత్సాహకాలపై అమెరికా డబ్ల్యు.టి.ఒ.లో ఫిర్యాదు చేసింది. గురువారం డబ్ల్యు.టి.ఒ. వివాదాల పరిష్కార విభాగం దీనిపై తీర్పు చెప్పింది. ఇండియా ఇస్తున్న ప్రోత్సాహకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఈ ప్యానల్ స్పష్టం చేసింది. అయితే, దీనిపై భారతదేశం డబ్ల్యు.టి.ఒ. అప్పీలేట్ అధారిటీకి వెళ్లే అవకాశం ఉంది.
2019-10-31 Read Moreజమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగంగానే తాము చూస్తున్నట్టు పాకిస్తాన్ నేతలతో సౌదీ అరేబియా చెప్పిందని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ప్రధాని మోదీ సౌదీ పర్యటనలో ఆయనకు, ఆ దేశ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కు మధ్య జరిగిన చర్చల్లో ఈ అధికారి కూడా భాగస్వామి అని ‘ద ప్రింట్’ రాసింది. అయితే, ఆ అధికారి తన పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు. కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని రద్దు చేశాక ఇతర దేశాల మద్ధతుకోసం పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలపై కూడా మోదీ, సల్మాన్ మధ్య చర్చ జరిగినట్టు ఆ అధికారి తెలిపారు.
2019-10-31 Read Moreభారతీయ రిజర్వు బ్యాంకుకు రఘురామ్ రాజన్ నాయకత్వం వహించిన కాలమే అత్యంత చెత్త దశ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు గురువారం ధీటైన స్పందన వచ్చింది. తాను రిజర్వు బ్యాంకు గవర్నరుగా పని చేసిన కాలంలో మూడింట రెండొంతులు బీజేపీయే అధికారంలో ఉందని రఘురామ్ రాజన్ గుర్తు చేశారు. రాజన్ 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు రిజర్వు బ్యాంకు గవర్నరుగా పని చేశారు. తాను ఉన్నప్పుడు పారు బకాయిలను తగ్గించే ప్రయత్నం చేశానని, అది ఇంకా పూర్తి కాలేదని చెప్పారు.
2019-10-31రాజధానిని, హైకోర్టును ఇప్పుడు వేరొక చోటకు తరలించడం సాధ్యం కాదని మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాధ్రీశ్వరరావు చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు లను ప్రస్తుతం ఉన్నచోటనే కొనసాగించి.. శాఖాధిపతుల కార్యాలయాలను జిల్లాల్లో ఏర్పాటు చేయడం ద్వారా వికేంద్రీకరణ చేపట్టాలని ఆయన సూచించారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి శోభనాద్రీశ్వరరావు తన అభిప్రాయాలను తెలిపారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
2019-10-31పాకిస్తాన్ లోని తూర్పు పంజాబ్ ప్రావిన్సులో గురువారం ఓ రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించి 73 మంది చనిపోయారు. తేజ్గామ్ ఎక్స్ ప్రెస్ కరాచీ నుంచి లాహోర్ వెళ్తుండగా ప్రయాణికులలో కొందరు రైలులోనే అల్పాహారం సిద్ధం చేశారు. ఆ సమయంలో గ్యాస్ సిలిండర్లు పేలి రైలు మొత్తానికి మంటలు వ్యాపించాయి. 200 మంది మంటల్లో చిక్కుకున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఇస్లామిక్ బోధకులేనని సమాచారం. మత సమావేశాలకు హాజరయ్యేందుకు వారంతా ఈ రైలులో ప్రయాణించారు.
2019-10-31ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం విశాఖపట్నం జిల్లా పెందుర్తి లోని శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర పాదాలు తాకి నమస్కరించిన గవర్నర్, ఆశీర్వాదం కోరి ఆయన కాళ్ల దగ్గరే కూర్చున్నారు. స్వరూపానందతో పాటు వారసుడు, యువకుడైన స్వాత్మానందేంద్ర కూడా పీఠాలపై కూర్చోగా గవర్నర్ వారి ముందు కింద కూర్చుండిపోయారు.
2019-10-31భారత ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ వాటా పెంచడమే లక్ష్యంగా సాగాలని పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ దిశగా తాను 15 రోజులకోసారి పరిశ్రమల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహిస్తానని ఆయన చెప్పారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలకు సానుకూల వాతావరణాన్ని కల్పించడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, భవిష్యత్ తరానికి తగినట్టుగా నైపుణ్య శిక్షణకోసం అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
2019-10-31విశాఖపట్నంలో జరిగిన భూకుంభకోణాలపై ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పరిధిని విస్తరించాలని తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరనున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. గురువారం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ...గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం చుట్టుప్రక్కలే కాకుండా యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, పాయకరావుపేటల్లో కూడా కుంభకోణాలు జరిగాయని చెప్పారు. ఈ విషయమై ప్రజల విజ్ఞప్తిని సిఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
2019-10-31ఐదేళ్ళపాటు ఆహార దీక్ష చేసిన లోకేష్, నిన్న ఐదు గంటలు నిరాహార దీక్ష చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇసుక సంక్షోభంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిన్న గుంటూరులో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన దీక్షపై విజయసాయి మాట్లాడారు. లోకేష్ దీక్ష వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. తమ సమస్యలు తీర్చగలడని ప్రజలు నమ్మితే పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోయేవారని విజయసాయి ప్రశ్నించారు.
2019-10-31