ఇంటా బయటా వాయు కాలుష్యం కారణంగా ఒక్క 2017లోనే ఇండియాలో 12 లక్షల మంది ముందుగానే మరణించినట్టు ‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2019’ అనే కొత్త అధ్యయనం తేల్చింది. ఆసియా మొత్తంలో ఇప్పుడే పుట్టిన పిల్లలు జీవిత కాలం సగటున రెండున్నర సంవత్సరాలు తక్కువగా ఉంటుందని, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా తగ్గే సగటు జీవిత కాలం 20 నెలలుగా ఉందని ఆ నివేదికలో విశ్లేషించారు. ఇండియాలో పొగతాగి చనిపోయేవారికంటే కలుషితమైన గాలిని పీల్చి మరణించేవారే ఎక్కువని ఈ నివేదికలో పేర్కొన్నారు.
2019-04-03 Read More2019లో ఇండియా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 7.2 శాతం పెరుగుతుందని, 2020లో వృద్ధి 7.3 శాతంగా ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) అంచనా వేసింది. ‘2017లో నమోదైన 7.2 నుంచి 2018లో 7.0 శాతానికి తగ్గింది. వ్యవసాయ ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవడం.. ప్రభుత్వ వ్యయం తగ్గడం, చమురు ధరలు పెరుగడం వల్ల వినిమయం మందగించడం ఇందుకు కారణాలు’ అని విశ్లేషించింది. ఇప్పుడు వడ్డీ రేట్ల తగ్గింపు, రైతులకు ఆదాయ మద్ధతు వల్ల దేశీయంగా డిమాండ్ పెరుగుతోందని ఎడిబి తన తాజా ‘ఆసియా అభివృద్ధి అంచనా’లో పేర్కొంది.
2019-04-03 Read Moreప్రధానమంత్రి ‘మోడీ’ పనికిమాలినవాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఆ మోడీ..ఇక్కడ కోడికత్తి (వైసీపీ) జోడీ అయ్యారని, వారికి కేసీఆర్ తోడయ్యారని దుయ్యబట్టారు. నరేంద్ర మోడీ, మహారాష్ట్ర ప్రభుత్వం, కేరళ కియా మోటార్ పరిశ్రమకోసం ప్రయత్నించినా ఆంధ్రప్రదేశ్ కు తెచ్చానని చంద్రబాబు గర్వంగా చెప్పారు. మోడీ వల్లకానిది రాష్ట్రంలో కోడికత్తి పార్టీ వల్ల ఏమవుతుందని ప్రశ్నించారు. ‘మనం అన్ని ప్రయోజనాలను నేరుగా చేస్తుంటే.. ఇప్పుడు గ్రామానికి పదిమందిని పెడతానంటున్నాడు. ఎందుకు.. కోడి ఈకలు పీకడానికా’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
2019-04-03‘‘దేశాన్ని కుదిపేస్తున్న రాఫేల్ కుంభకోణం’’ తమిళ పుస్తక ప్రతులను సీజ్ చేసి నిషేధం నోటీసు ఇచ్చిన చెన్నై ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులను భారత ఎన్నికల సంఘం విధులనుంచి తప్పించింది. పుస్తకావిష్కరణపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. ఈసీ జోక్యంతో పబ్లిషర్లు మంగళవారం సాయంత్రం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందూ గ్రూపు ఛైర్మన్ ఎన్. రామ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు స్థానిక ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు ప్రచురణ సంస్థ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న 150 కాపీలను ఈసీ జోక్యంతో తిరిగి ఇచ్చారు.
2019-04-03 Read Moreమార్చి 27వ తేదీన ఇండియా ‘‘ఉపగ్రహ విధ్వంస ప్రయోగం’’ సఫలం కావడానికి నెలన్నర ముందు తొలి ప్రయోగంలో విఫలమైనట్టు ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఎఎస్) నిపుణుడొకరు వెల్లడించారు. ఫిబ్రవరి 12న ప్రయోగించిన యాంటీ శాటిలైట్ క్షిపణి 30 సెకన్లు మాత్రమే ప్రయాణించి లక్ష్యాన్ని కనుగొనలేకపోయిందని పేర్కొన్నారు. అమెరికన్ అధికారులను ఉటంకిస్తూ డిప్లమాట్ పత్రికలో కాలమిస్టు అంకిత్ పాండా ఈ విషయాన్ని రాశారు.
2019-04-02 Read Moreడాలరుతో రూపాయి మారకం విలువ మంగళవారం 40 పైసలు పెరిగింది. తాజాగా డాలరు రూ. 68.74 వద్ద స్థిరపడింది. విదేశీ నిధుల రాక, దేశీయ ఈక్విటీలలో భారీ కొనుగోళ్ళు రూపాయి బలపడటానికి కారణాలుగా చెబుతున్నారు. మరొక అభిప్రాయం ప్రకారం... రిజర్వు బ్యాంకు డాలర్ - రూపాయి స్వాప్ ను రెండోసారి ప్రకటించిన తర్వాత ఇండియా కరెన్సీ బలపడింది. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐలు) మంగళవారం కేపిటల్ మార్కెట్లలో రూ. 543.36 కోట్లు పెట్టినట్టు సమాచారం.
2019-04-02 Read Moreసమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు, పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు రూ. 2.13 కోట్లు బాకీ పడ్డాడట! ఈ విషయాన్ని ములాయం స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి లోక్ సభా స్థానం నుంచి పోటీ చేస్తున్న ములాయం సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. 2014తో పోలిస్తే ఈసారి ములాయం ఆస్తులు రూ. 3.2 కోట్ల మేరకు తగ్గాయి. తన మొత్తం స్థిర చరాస్థులు రూ. 16.52 కోట్లుగా తాజా పత్రాల్లో ములాయం పేర్కొన్నారు.
2019-04-02 Read Moreఇండియా ఇటీవల నిర్వహించిన ‘ఉపగ్రహ ధ్వంసం ప్రయోగం’తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ముప్పు పొంచి ఉందన్న ‘నాసా’ చీఫ్ వ్యాఖ్యలను డి.ఆర్.డి.ఒ. మాజీ చీఫ్ వికె సారస్వత్ కొట్టిపారేశారు. ఇండియా సాధించిన పురోగతి విషయంలో అమెరికా వైఖరి ఇలాగే ఉంటుందని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు. 300 కిలోమీటర్ల ఎత్తునున్న ఉపగ్రహాన్ని క్షిపణి ధ్వంసం చేసిన తర్వాత శకలాలు భూవాతావరణంలోకి పడిపోయి మండిపోతాయని సారస్వత్ చెప్పారు. అంతరిక్షంలో లక్షలకొద్దీ శకలాలు తిరుగుతుండగా ఇండియా ప్రయోగంపై మాట్లాడటం అర్ధరహితమన్నారు.
2019-04-02 Read Moreప్రపంచంలోనే అత్యధికంగా లాభం పొందే కంపెనీ ఏదంటే కళ్ళు మూసుకొని టక్కున చెప్పే సమాధానం ‘యాపిల్’! అయితే, సోమవారం సౌదీ ఆరాంకో కంపెనీ వెల్లడించిన డేటా చూస్తే యాపిల్ లాభం ఏమూలకు.. అనిపించింది. సౌదీ రాజుల కంపెనీ 2018లో 111.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 7,77,770 కోట్లు) లాభాన్ని సంపాదించింది. అదీ సౌదీ ప్రభుత్వానికి 102 బిలియన్ డాలర్ల పన్ను చెల్లించిన తర్వాత..!! యాపిల్, శాంసంగ్, ఆల్ఫాబెట్ కంపెనీల మూడింటి మొత్తం లాభం ‘సౌదీ ఆరాంకో’ లాభానికి దాదాపు సమానంగా ఉంది.
2019-04-02 Read Moreజయంతికి, వర్ధంతికి తేడా తెలియని నారా లోకేష్ కు మూడు మంత్రిత్వ పదవులు ఇవ్వడం చంద్రబాబు పుత్రవాత్సల్యానికి నిదర్శనం కాదా? అని వైఎస్ షర్మిల పశ్నించారు. కృష్ణా జిల్లా నూజివీడులో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచార సభలో షర్మిల మాట్లాడారు. ‘వెనకటికి ఒకడు అక్షరం ముక్క రాకపోయినా అగ్ర తాంబూలం కావాలన్నాడట. అలా ఒక్క ఎన్నికల్లో కూడా గెలవని లోకేష్ కు మూడు పదవులు’ అని ఎద్దేవా చేశారు.
2019-04-02