ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజధాని తరలింపు బిల్లును నిన్న రాత్రి అసెంబ్లీ ఆమోదించిన నేపథ్యంలో డొక్కా ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆయన మండలి సమావేశానికి హాజరు కాలేదు. తన ‘రాజీనామా లేఖ’ను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. రాజధాని కొలువై ఉన్న తాడికొండ నియోజకవర్గానికి గతంలో డొక్కా ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు.
2020-01-21రాజధాని ’వికేంద్రీకరణ’, ‘సీఆర్డీయే చట్టం రద్దు’ బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. సోమవారం రాత్రి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత అధికారపక్షం ఏకగ్రీవంగా ఈ బిల్లులను ఆమోదించింది. పాలనా ‘వికేంద్రీకరణ’ అనే పదజాలం వాడినా రాజధాని తరలింపే మొదటి బిల్లు సారాంశంగా ఉది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీయే) చట్టాన్ని రద్దు చేస్తూ ‘అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎ.ఎం.ఆర్.డి.ఎ) ఏర్పాటుకు ప్రతిపాదించారు.
2020-01-20వికేంద్రీకరణ పేరిట రాజధానిని తరలించే బిల్లుకు నిన్న ఆమోదం తెలిపిన నేపథ్యంలో...మంగళవారం టీడీపీ సభ్యులు ఏపీ అసెంబ్లీలో నిరసన తెలిపారు. ‘‘సేవ్ అమరావతి’’ నినాదాలతో సమావేశ మందిరం దద్దరిల్లింది. దీంతో... స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తెలుగుదేశం పార్టీ సభ్యుల వ్యవహార శైలిపట్ల ‘‘నిరసన’’ తెలుపుతున్నానని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వెంటనే స్పీకర్ స్థానం నుంచి బయటకు వెళ్లిపోయారు.
2020-01-21అమరావతిపై గ్రాఫిక్స్ చూపించిన చంద్రబాబు ఐదేళ్లలో ఖర్చు చేసింది రూ. 5,674 కోట్లు మాత్రమేనని, మరో రూ. 2,297 కోట్లు బకాయిలు పెట్టాడని సిఎం జగన్ చెప్పారు. కేవలం 8 చదరపు కిలీమీటర్ల పరిదిలో మౌలిక సదుపాయాలకు లక్ష కోట్ల పైన అవసరమని చంద్రబాబే చెప్పారని, ఈ వేగంతో నిధులు కేటాయిస్తే వందేళ్ళు పడుతుందని విమర్శించారు. ఐదు రెట్ల వేగంతో ఖర్చు పెడితే 20 ఏళ్ళలో వడ్డీతో కలిపి రూ. 3,12,148 కోట్లు అవసరమవుతాయని సోమవారం అసెంబ్లీలో వివరించారు.
2020-01-20‘‘రాజధాని కోసం భూములా లేక మీ భూములకోసం రాజధానా’’ అని సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు బినామీ పేర్లతో వేల ఎకరాలు కొనుగోలు చేశారని జగన్ ఆరోపించారు. తమ లెక్కలో తేలింది 4070 ఎకరాలని పేర్కొన్నారు. రాజధాని వస్తుందన్న సమాచారం లేకపోతే... విజయవాడ నుంచి 31 కి.మీ., గుంటూరు నుంచి 38.36 కి.మీ. దూరంలో ఉన్న బేతపూడి వంటి గ్రామంలో ఎవరైనా భూములు కొంటారా? అని జగన్ ప్రశ్నించారు.
2020-01-20జగన్మోహన్ రెడ్డి తన తండ్రినే స్ఫూర్తిగా తీసుకొని అమరావతి సహా అభివృద్ధి ప్రాజెక్టులను కొనసాగించాలని మాజీ సీఎం చంద్రబాబునాయుడు హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రానికి తన తర్వాత సిఎం అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టును, ఇతర ప్రాజెక్టులను నిలిపివేయలేదని గుర్తు చేశారు. ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేసిన వై.ఎస్.కు కూడా పేరొచ్చిందని బాబు పేర్కొన్నారు. మూడు రాజధానులు సఫలం కావని సోమవారం అసెంబ్లీ చర్చలో చంద్రబాబు ఉద్ఘాటించారు.
2020-01-20చంద్రబాబుకు మైకు కట్ చేసినందుకు నిరసన తెలుపుతున్న టీడీపీ సభ్యులపై సిఎం జగన్ మండిపడ్డారు. తాను మాట్లాడే సందర్భంలో ప్రజలు వినకూడదనే దుర్భద్ధితోనే ఇలా చేస్తున్నారని ఆక్షేపించారు. టీడీపీ నేతలను దుర్మార్గులుగా వ్యవహరించిన సిఎం, మార్షల్స్ ను పిలిపించి వాళ్లను బయటకు పంపాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు సూచించారు. సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ సభ్యుల జాబితాను చదవడం, వారిని సభనుంచి సస్పెండ్ చేయడం వెంటవెంటనే జరిగాయి.
2020-01-20చంద్రబాబు ప్రసంగానికి మరో గంట కావాలన్న టీడీపీ నేతలపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ‘సభ మీ జాగీరు కాదు’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ అభ్యంతరం చెప్పాక ఇంకెంత సమయం మాట్లాడతారని చంద్రబాబును స్పీకర్ ప్రశ్నించారు. ఆయన మధ్యలో అవరోధాలు లేకపోతే 30 నిమిషాల్లో ముగిస్తానని చెప్పారు. అయితే, స్పీకర్ అంత సమయం కుదరదని స్పష్టం చేస్తూ.. 10-15 నిమిషాల్లో ముగించాలని సూచించారు. 10 నిమిషాల తర్వాత మైకు కట్ చేశారు.
2020-01-20సోమవారం రాజధాని, వికేంద్రీకరణ బిల్లులపై చర్చ సందర్భంగా చంద్రబాబు ప్రసంగానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రేకు వేశారు. ‘‘వాళ్లకు ఉన్నది 21 మంది... అయినా ఐదుగురు మాట్లాడారు. మేం 151 మందిమి ఉన్నాం. మావైపు ఏడుగురు మాట్లాడారు. చంద్రబాబు మొదలుపెట్టి 53 నిమిషాలైంది. ఇంకా ఈ పెద్ద మనిషి ఎంతసేపు మాట్లాడతారు? కనుక్కోండి అధ్యక్షా. ఎక్కువసేపు మాట్లాడితే.. బెల్ కొట్టి మైక్ కట్ చేయండి. నేను అందుకుంటా’’ అని జగన్ స్పీకర్ తమ్మినేని సీతారాంకు చెప్పారు.
2020-01-20రాజధానిని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందనే వాదనను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తోసిపుచ్చారు. సోమవారం అసెంబ్లీలో ‘పరిపాలన వికేంద్రీకరణ’ బిల్లుపై జరిగిన చర్చల్లో ఆయన పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నా, అన్ని కేంద్ర కార్యాలయాలూ అక్కడే ఉన్నా...ఉత్తర భారతం అభివృద్ధి చెందలేదని, దక్షిణ భారతమే అభివృద్ధి చెందిందని చెప్పారు. రాజధాని వల్ల, కార్యాలయాల వల్ల అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు.
2020-01-20