ఆర్థికంగా బలమైన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. 2020-21లో మొత్తం రాబడి (రెవెన్యూ+కేపిటల్)లో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం 63.44 శాతంగా అంచనా వేశారు. రుణాల వాటా 21.65 శాతం కాగా కేంద్రం నుంచి వచ్చేది కేవలం 14.92 శాతం. 2018-19లో నిర్ధారించిన లెక్కల ప్రకారం సొంత వనరుల వాటా కేవలం 47.57 శాతం. 2019-20లో బడ్జెట్ అంచనాల ప్రకారం అది 58.14 శాతంగా ఉంటే సవరించిన అంచనాల్లో 58.35 శాతంగా మార్చారు. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లు కూడా తగ్గిపోతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వ పన్నేతర ఆదాయాన్ని అసాధారణంగా అంచనా వేస్తున్నారు.
2020-03-08కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఆమె భర్తను హత్య చేసిన మిర్యాలగూడ వ్యాపారి మారుతీరావు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ వైశ్య భవనంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ప్రాథమిక సమాచారం. అయితే, పోలీసులు అనుమానాస్పద మరణంగానే కేసు నమోదు చేశారు. ‘‘గిరిజా క్షమించు, అమృతా అమ్మవద్దకు రా’’ అని రాసి ఉన్న చీటీ మారుతీరావు శవం దగ్గర కనిపించింది. 2018 సెప్టెంబరు 14న మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ (కుమార్తె భర్త) హత్య కేసులో మారుతీరావు ప్రధాన నిందితుడు.
2020-03-082020-21 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వ వ్యయం 1,82,914.42 కోట్లుగా అంచనా వేశారు. 2019-20 సవరించిన అంచనాల కంటే ఇది 28.67 శాతం అదనం. రాష్ట్ర బడ్జెట్ పత్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరే మొత్తం రూ. 1,82,701.94 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ రశీదులు రూ. 1,43,151.94 కోట్లుగా పేర్కొన్నారు. అందులో సొంత పన్నుల ఆదాయం రూ. 85,300 కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 30,600 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా రూ. 16,726 కోట్లు, గ్రాంట్లు రూ. 10,525 కోట్లు చూపించారు.
2020-03-08తలసరి విద్యుత్ వినియోగంలో (1890 యూనిట్లతో) తెలంగాణ దేశంలోనే నెంబర్1 అని రాష్ట్ర సీఎం కేసీఆర్ శనివారం అసెంబ్లీలో పదే పదే చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఊరూరా ప్రతి సభలోనూ ‘నెంబర్ 1’ కథ ప్రతిధ్వనించింది. పై గ్రాఫు చూస్తే ఇందులో నిజమెంతో తెలిసిపోతుంది. ఇప్పటి తెలంగాణ వినియోగం కంటే.. 2016-17లో గోవా, గుజరాత్, పంజాబ్, చత్తీస్ గఢ్, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో తలసరి వినియోగం ఎక్కువ. 2018-19లోనూ గుజరాత్, గోవా, హర్యానా, పంజాబ్, చత్తీస్ గఢ్ ముందున్నాయి. ఏడాదిన్నరగా కేసీఆర్ కరెంటు కథను కౌంటర్ చేసినవారే లేరు.
2020-03-08బిపిసిఎల్ లోని వాటా మొత్తం అమ్మకానికి ‘ఆసక్తి వ్యక్తీకరణ (ఇఒఐ)’ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కంపెనీలో ప్రభుత్వానికి 52.98 శాతం (114.91 కోట్ల షేర్లు) వాటా ఉంది. ఆ మేరకు పెట్టుబడి మొత్తాన్ని ఉపసంహరించుకొని కొనుగోలుదారుకు యాజమాన్యాన్ని అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇఒఐల సమర్పణకు మే 2వరకు గడువు ఇచ్చింది. బి.పి.సి.ఎల్. గ్రూపులో 10 సబ్సిడరీలు, 12 అనుబంధ కంపెనీలు, 24 జాయింట్ వెంచర్లు ఉన్నాయి. అయితే, ఎన్.ఆర్.ఎల్.లో ఉన్న 61.65 శాతం ఈక్విటీ హోల్డింగ్ ఈ బిడ్ల పరిధిలోకి రాదు.
2020-03-07కుంభకోణాలతో కునారిల్లిన ‘ఎస్’ బ్యాంకు ఛైర్మన్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. శనివారం ముంబైలోని బల్లార్డ్ పియెర్ కార్యాలయంలో రాణాను కొన్ని గంటల పాటు ప్రశ్నించిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు, రాత్రి బాగా పొద్దుపోయాక అరెస్టు చేశారు. అంతకు ముందు రాణా, ఆయన కుమార్తెల ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ‘ఎస్’ బ్యాంకు బోర్డును ఈ నెల 5న రిజర్వు బ్యాంకు రద్దు చేసింది. ఖాతాదారులు రూ. 50 వేల కంటే ఎక్కువ సొమ్మును తిరిగి తీసుకునే అవకాశం లేకుండా ఆంక్షలు విధించింది.
2020-03-08ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 25కు పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శనివారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చారు. తెలంగాణలో 10 జిల్లాలను 33 చేసిన తర్వాత కలిగిన ప్రయోజనాలను చూసి ఏపీలో కూడా జిల్లాల పెంపునకు నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తనకు ఉన్న సమాచారం ప్రకారం ఏపీలో త్వరలో 25 జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు.
2020-03-07అమెరికా మిలిటరీకి చెందిన యూరోపియన్ కమాండ్ (ఇయుకామ్)లో తొలి ‘కరోనా వైరస్’ కేసు శుక్రవారం నమోదైంది. ఇటలీలోని నేపిల్స్ నగరంలోగల నౌకాదళ కేంద్రంలో ఓ నావికుడు వైరస్ బారిన పడ్డట్టు ‘ఇయుకామ్’ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. చైనా తర్వాత ‘కరోనా’ మరణాలు అధికంగా ఉన్నది ఇటలీలోనే కావడం గమనార్హం. వైరస్ సోకిన అమెరికా నావికుడిని, అతనితో సహచరించినవారిని ఇళ్లకే పరిమితం చేశారు. బాధితుడి సహచరులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
2020-03-07 Read Moreఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ ప్రావిన్సులో శనివారం ఓ హోటల్ కుప్పకూలింది. అందులో 70 మంది చిక్కుకుపోయినట్టు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7.30 గంటలకు క్వాంగ్జు నగరంలో ఈ దుర్ఘటన జరిగింది. అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. రాత్రి 11 గంటల సమయానికి 35 మందిని శిథిలాల మధ్య నుంచి కాపాడారు. కూలిన గ్జిన్జియా హోటల్ ను ప్రస్తుతం ‘కరోనా వైరస్’ సోకినవారితో సహచరించిన వారిని ఉంచే ‘క్వారంటైన్’గా ఉపయోగిస్తున్నారు.
2020-03-07తెలంగాణలో ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదని సిఎం కేసీఆర్ చెప్పారు. బయటినుంచి వచ్చిన వ్యక్తిలో ఉంటే తగిన చికిత్స చేశామని శనివారం అసెంబ్లీలో పేర్కొన్నారు. ధరించడానికి మాస్కులు కూడా లేవన్న ప్రతిపక్ష సభ్యుల విమర్శలను కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘’కరోనా’ వస్తే కదా..! వెయ్యి కోట్లు ఖర్చు పెట్టయినా తెలంగాణకు రానివ్వం. అసెంబ్లీలో ఎవరిమైనా మాస్కులు వేసుకున్నామా? ఇక ముందు కూడా మాస్కులు లేకుండానే పని చేస్తాం’’ అని కేసీఆర్ ఉద్ఘాటించారు. ఉష్ణోగ్రత 20 డిగ్రీలు దాటితో వైరస్ బతకదని నిపుణులు చెప్పారని కేసీఆర్ పేర్కొన్నారు.
2020-03-07