జెడి (యు)తో తెగతెంపులయ్యాక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రారంభించిన ‘బాత్ బీహార్ కీ’ ప్రచారాంశం ‘కాపీ’ కొట్టినదట! ప్రశాంత్ కిషోర్ క్యాంపెయిన్ కు తాను సృజించిన సమాచారాన్ని వాడుతున్నారని కాంగ్రెస్ పార్టీలో ఉన్న డేటా అనలిస్ట్ శశ్వత్ గౌతమ్ ఫిర్యాదు చేశారు. దీంతో పాట్నా పోలీసులు గురువారం ఐపిసి 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో తనతో కలసి పని చేసిన ఒసామా అనే వ్యక్తి ఆ సమాచారాన్ని ప్రశాంత్ కిషోర్ కు ఇచ్చి ఉండొచ్చని గౌతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జార్జ్ వాషింగ్టన్ వర్శిటీలో చదివిన గౌతమ్, ఇంతకు ముందు పరిశోధనా సంస్థ ‘ఎడిఆర్ఐ’లో పని చేశారు.
2020-02-27 Read Moreకేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ‘హేట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’గా అభివర్ణించారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్. త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన పార్టీ గిరిజన విభాగం 22వ మహాసభలలో ఆమె మాట్లాడారు. ‘‘షహీన్ బాగ్ కు విద్యుత్ షాక్ తగిలేలా ఇవిఎంలపై బటన్లను గట్టిగా నొక్కాలని ఢిల్లీ ఎన్నికల సందర్భంగా అమిత్ షా పిలుపు ఇచ్చారు. ఒక హోం మంత్రి ఆ విధంగా ప్రసంగిస్తారా? అందుకే అంటున్నా.. అతను హోం మంత్రి కాదు. హేట్ మంత్రి’’ అని కారత్ పేర్కొన్నారు.
2020-02-22ఇండియాలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), ఢిల్లీ అల్లర్లలో పోలీసుల నిష్క్రియాపరత్వంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ మిచెల్ బాచిలెట్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జెనీవాలో జరిగిన మానవ హక్కుల కౌన్సిల్ 43వ సదస్సులో ఆమె మాట్లాడారు. ‘‘అన్ని మతాలకు సంబంధించినవారు పెద్ద సంఖ్యలో శాంతియుతంగా సిఎఎకి నిరసన తెలిపారు. ముస్లింలపై ఇతర గ్రూపులు దాడి చేస్తుంటే పోలీసులు మిన్నకుండిపోయారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి’’ అని మిచెల్ పేర్కొన్నారు.
2020-02-27 Read Moreఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్పొరేటర్ తాహిర్ హుస్సేన్ పైన ఢిల్లీ పోలీసులు గురువారం హత్య, దహనాల కేసులు నమోదు చేశారు. ఢిల్లీ అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ అంకిత్ శర్మ మరణించారు. తాహిర్ హుస్సేన్ భవనం పైనుంచి జరిగిన రాళ్ళ దాడితోనే అంకిత్ శర్మ మరణించారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాహిర్ పైన హత్య కేసు నమోదైంది. మొన్న (ఫిబ్రవరి 25న) అదృశ్యమైన అంకిత్ శర్మ మృతదేహం నిన్న మురికి కాల్వలో లభ్యమైన విషయం తెలిసిందే.
2020-02-27‘‘మధ్యప్రదేశ్ లోని ‘కోట్మ’లో 11వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి ప్రాక్టికల్ పరీక్ష రాసి బయటకు రాగానే కాపు కాచి ఉన్న 25-26 సంవత్సరాల ముస్లిం కత్తితో ఆమె మెడపై నరికాడు. అతని జీహాదీ ప్రేమను అంగీకరించకపోవడమే కారణం’’ అనే ‘కథ’నం తాజాగా సామాజిక మాథ్యమాల్లో కనిపిస్తోంది. నిజానికి ఆ ఫొటోలు 2018 ఫిబ్రవరిలో ‘కోట్మ’లో జరిగిన హత్యకు సంబంధించినవి. పూజ పనిక అనే 17 ఏళ్ళ అమ్మాయిని విజయ్ ప్రజాపతి అనే వ్యక్తి చంపినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. మరుసటి రోజే ప్రజాపతి ఆత్మహత్య వార్తలూ వచ్చాయి. ఇక్కడ మతం లేదు. జీహాదీ లేదు.
2020-02-27 Read Moreరాయలసీమ కరువు నివారణకు చేపట్టిన ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల పురోగతిపై సిఎం సమీక్ష నిర్వహించారు. రాయలసీమ కరువు నివారణకు చేపట్టిన ప్రాజెక్టుల్లో దేనికి ఎంత ఖర్చవుతుందో.. సిఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరి – కృష్ణా – బనకచర్ల అనుసంధాన ప్రణాళిక, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పురోగతిపైనా సిఎం ఆరా తీశారు.
2020-02-27రాష్ట్రంలో శాంతిభద్రతలను పోలీసులు కాపాడకపోతే తామే రంగంలోకి దిగవలసి వస్తుందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ)ని హెచ్చరించారు. చంద్రబాబు విశాఖ పర్యటనలో పోలీసుల సమక్షంలోనే వైసీపీ గూండాలు కోడిగుడ్లు, చెప్పులు, రాళ్ళు వేశారని లోకేష్ మండిపడ్డారు. అనుమతి ఇచ్చి నగరంలోకి వెళ్ళకుండా ఆపడం ఏమిటని, బాధ్యులైన పోలీసు అధికారులపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు.
2020-02-27చంద్రబాబు విశాఖలో చేపట్టిన ‘ప్రజాచైతన్య యాత్ర’ పట్ల పోలీసుల వైఖరి వివాదాస్పదమైంది. గురువారం ఉదయం విశాఖపట్నం ఎయిర్ పోర్టునుంచి రాంపురం గ్రామం వరకు వెళ్ళడానికి చంద్రబాబు వాహన శ్రేణికి పోలీసులు 8 కండిషన్లతో అనుమతి ఇచ్చారు. అయితే, చంద్రబాబు విశాఖలో దిగాక నగరంలోకి వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఆ పేరిట పోలీసులు కూడా తమ అనుమతిని తామే ఉల్లంఘించి ఎయిర్ పోర్టునుంచే వెనక్కు పంపేందుకు ప్రయత్నించారు.
2020-02-27ప్రతిపక్ష నేత చంద్రబాబును విశాఖ విమానాశ్రయం నుంచి వెనక్కు పంపే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. విమానాశ్రయం వెలుపల నిరసన తెలుపుతున్న చంద్రబాబును అరెస్టు చేసి వీఐపీ లాంజ్ లోకి తీసుకెళ్ళారు. ఉదయం చంద్రబాబు విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి ఆయనను నగరంలోకి వెళ్ళకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఓ దశలో చంద్రబాబు కాన్వాయ్ దిగి రోడ్డుపైనే బైఠాయించారు. రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనకోసం విశాఖ వెళ్లిన చంద్రబాబును ‘విశాఖ వ్యతిరేకి’ పేరిట వైసీపీ అడ్డుకుంది.
2020-02-27విశాఖ పర్యటనకు వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబును, ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన స్థానిక తెలుగుదేశం నేతలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడంతో విమానాశ్రయ ప్రాంతం రణరంగంగా మారింది. విమానం దిగి బయటకు వచ్చే సమయంలో చంద్రబాబు కాన్వాయ్ ఎదుట కొంతమంది పడుకున్నారు. మరికొంతమంది వాహన శ్రేణిపై కోడిగుడ్లు విసిరారు. గంటల తరబడి రోడ్లు బ్లాక్ చేయడంతో సాధారణ ప్రయాణీకులు, ప్రజలు కూడా ఇబ్బందులపాలయ్యారు.
2020-02-27