హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలోని షైన్ పిల్లల ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఎమర్జెన్సీ వార్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆరుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా ఒక చిన్నారి చనిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రి భవనం అద్దాలు పగులగొట్టి మంటలు ఆర్పారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు.
2019-10-21ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాటకీయంగా వ్యవహరించింది. ప్రగతి భవన్ వరకు రాకుండానే నేతలను అరెస్టు చేయాలనే పోలీసుల ప్రయత్నాలను రేవంత్ రెడ్డి, మరికొందరు నేతలు ఛేదించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో లేరని బయట కాపలా కాస్తున్న పోలీసులను నమ్మించి ఆ తర్వాత మోటారు సైకిల్ పైన బయలుదేరారు. వెంబడించిన పోలీసులు మధ్యలో అరెస్టు చేశారు.
2019-10-21ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. సోమవారం ఉదయం ఢిల్లీలో ఆయనకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కాషాయ కండువా కప్పారు. ఆదినారాయణరెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది కొంత కాలానికి అధికార టీడీపీలో చేరారు. చంద్రబాబు చివరి మంత్రివర్గంలో ఆయనొక సభ్యుడు. టీడీపీ ఓటమి తర్వాత సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఆయనను తట్టుకోవడం సాధ్యం కాదని బీజేపీలో చేరారు.
2019-10-21జర్నలిస్టులు, సమాచార కార్యకర్తలపై ఆస్ట్రేలియాలో జరుగుతున్న పోలీసు దాడులకు అక్కడి మీడియా ఏకోన్ముఖంగా నిరసన తెలిపింది. ప్రధాన పత్రికలన్నీ సోమవారం మొదటి పేజీలలో అక్షరాలను నల్లసిరాతో కప్పేసి అచ్చేశాయి. ‘రహస్యం’ పేరిట పత్రికాస్వేచ్ఛను హరించే ఆస్ట్రేలియా ప్రభుత్వ చర్యలను మీడియా ముక్త కంఠంతో నిరసించింది. ద ఆస్ట్రేలియన్, డెయిలీ టెలిగ్రాఫ్, సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నిరసనలో భాగమయ్యాయి. అసాధారణ పోటీ మధ్య నెలకొన్న వైరాన్ని ప్రక్కన పెట్టి ఆస్ట్రేలియా పత్రికలు అరుదైన ఐక్యతను ప్రదర్శించాయి.
2019-10-21 Read Moreసొంత దేశంలో టెస్టు మ్యాచులలో అత్యధిక సగటు సాధించిన క్రికెటర్ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం డాన్ బ్రాడ్ మన్. 71 సంవత్సరాలపాటు చెక్కు చెదరని రికార్డు (98.22 సగటు) ఆయనది. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టాడు ఇండియన్ ఆటగాడు రోహిత్ శర్మ. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజున రోహిత్ శర్మ తన మొదటి డబుల్ సెంచరీ (212) నమోదు చేశాడు. దీంతో దేశీయ మైదానాల్లో ఆడిన టెస్టుల్లో రోహిత్ శర్మ సగటు 98.84కు పెరిగింది. ఈ సిరీస్ లోనే రో‘హిట్’ శర్మ రెండు సెంచరీలు చేశాడు.
2019-10-20 Read Moreఇటీవల కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నును భారీగా తగ్గిస్తూ చేసిన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆర్థికశాస్త్ర నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ సూచించారు. భూమిలేని పేదలను కూడా ‘‘పిఎం కిసాన్’’ పథకంలో చేర్చాలని హితవు పలికారు. బెనర్జీ, ఆయన సహచరి ఎస్తేర్ డఫ్లో కలసి రచించిన ‘‘గుడ్ ఎకనామిక్స్ ఫర్ హెరాల్డ్ టైమ్స్’’ అనే పుస్తకం విడుదలకోసం ఆయన ఇండియా వచ్చారు. ‘‘నేనైతే కార్పొరేట్ పన్ను తగ్గించేవాడిని కాను. ఇప్పుడు రివర్స్ చేసినా కొంత నష్టం తప్పదు. అయినా... ఖజానాపై భారం పడేదాన్ని రద్దు చేయడమే మంచిది’’ అని అభిజిత్ చెప్పారు.
2019-10-21పౌరుల భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దని, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు పిలుపునిచ్చారు. సోమవారం పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవాన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన మాట్లాడారు. పోలీసుల కష్టాలు చూసినందునే వీక్లీ ఆఫ్ ప్రకటించానని, హోంగార్డుల వేతనాన్ని రూ. 18 వేల నుంచి 21 వేలకు పెంచానని, మంచి పేరు తెచ్చేలా అడుగులు వేయాలని సిఎం చెప్పారు.
2019-10-21ఆర్టీసీ సమ్మెతో దసరా సెలవులను 10 రోజులు పొడిగించిన తర్వాత తెలంగాణ పాఠశాలలు సోమవారం పున:ప్రారంభం కానున్నాయి. ఇప్పటిదాకా విద్యా సంస్థల బస్సులను ప్రజా రవాణాకోసం వినియోగించిన ప్రభుత్వం, ఇప్పుడు సెవెన్ సీటర్ ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రంలో సగటున 70 శాతం ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయని, సోమవారం నుంచి 95 శాతం తిరిగే విధంగా చూస్తామని రవాణా శాఖ మంత్రి చెబుతున్నారు. అయితే, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
2019-10-21 Read Moreతెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మె 17 రోజున ‘ప్రగతి భవన్’ ముట్టడిని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉండగా, ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ప్రగతి భవన్ చుట్టుప్రక్కల పోలీసులను భారీగా మోహరించారు. మొన్న జరిగిన తెలంగాణ బంద్ విజయవంతం కావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
2019-10-21ఆర్టీసీ సమ్మె ప్రారంభమయ్యాక ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం కనిపిస్తున్న వేళ... తెలంగాణలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ స్థానాన్ని గెలుచుకోవడం అధికార టీఆర్ఎస్ కు ఎంత కీలకమో... సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే కీలకం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యాక హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన భార్య పద్మా ఉత్తమ్ కుమార్ రెడ్డికే సీటు సాధించారు.
2019-10-21