విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన ఐపిఎల్ రెండవ క్వాలిఫయర్ పోటీలో ఢిల్లీ కేపిటల్స్ జట్టుపై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కు చేరింది. ప్రస్తుతం జరుగుతున్నది ఐపిఎల్ 10వ సీజన్ కాగా, చెన్నై జట్టు 8వసారి ఫైనల్స్ ఆడబోతోంది. శుక్రవారం మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ 20 ఓవర్లలో 147 పరుగులు సాధించగా తర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 19 ఓవర్లలో నాలుగు వికెట్లకు 151 పరుగులు సాధించింది. ఆదివారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ చెన్నై, ముంబై జట్ల మధ్య జరుగుతుంది.
2019-05-10 Read More2002 గుజరాత్ అల్లర్ల తర్వాత నరేంద్ర మోదీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించాలని అప్పటి ప్రధానమంత్రి వాజపేయి నిర్ణయించారని అప్పట్లో ఆయన మంత్రివర్గంలో ఉన్న యశ్వంత్ సిన్హా తాజాగా చెప్పారు. మోదీని తొలగిస్తే తాను కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేస్తానని ఉపప్రధాని ఎల్.కె. అద్వానీ బెదిరించడంవల్ల వాజపేయి తన నిర్ణయాన్ని మార్చుకున్నారని సిన్హా వెల్లడించారు. శుక్రవారం సిన్హా భోపాల్ లో ‘‘మీట్ ద ప్రెస్’’లో మాట్లాడుతూ... మోదీ రాజీనామా చేయకపోతే గుజరాత్ ప్రభుత్వాన్నే డిస్మిస్ చేయాలని వాజపేయి భావించారని తెలిపారు.
2019-05-10 Read More1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై ప్రవాస కాంగ్రెస్ చీఫ్ శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా ఉన్నాయని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. గురువారం శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పాలని రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.1984 బాధితులకు న్యాయం జరగాలని, ఆ అల్లర్లకు బాధ్యులైనవారికి శిక్ష పడాలని ఉద్ఘాటించారు. ‘‘1984 ఓ భయానక విషాదం. ఎప్పుడూ జరగకుండా ఉండాల్సింది. అందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ క్షమాపణ చెప్పారు. మా తల్లి సోనియా గాంధీ క్షమాపణ చెప్పారు’’ అని రాహుల్ పేర్కొన్నారు.
2019-05-10 Read Moreపారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు మార్చి నెలలో -0.01 శాతంగా నమోదైంది. గత 21 నెలల్లో పారిశ్రామికోత్పత్తి తిరోగమించడం ఇదే మొదటిసారి. అంతకు ముందు నెలలో వృద్ధిరేటు కేవలం 0.01 శాతం నమోదు కాగా.. తయారీ రంగం వరుసగా రెండు నెలల్లోనూ మైనస్ లోనే ఉంది. మార్చి నెల తిరోగమనం మొత్తంగా 2018-19 ఆర్థిక సంవత్సరపు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్ (ఐఐపి)ని 3.6 శాతానికి తగ్గించింది. ఐఐపి కిందటి సంవత్సరం 4.4 శాతంగా నమోదైంది. పారిశ్రామిక తిరోగమనం ప్రభావంతో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు తగ్గే అవకాశం ఉంది.
2019-05-11 Read Moreఅయోధ్య స్తల వివాదానికి సానుకూల పరిష్కారంకోసం నియమించిన మధ్యవర్తులకు ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు ఆగస్టు 15వరకు పెంచింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా ఆధ్వర్యంలో ఏర్పాటైన మధ్యవర్తుల కమిటీ తమకు ఒక నివేదికను సమర్పించిందని, గడువు పెంచాలని అందులో కోరిందని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శుక్రవారం వెల్లడించారు. ‘‘ఫలితం పట్ల మధ్యవర్తులకు విశ్వాసం ఉంటే గడువు ఇవ్వడంలో నష్టం ఏముంది’’ అని సుప్రీం ప్రశ్నించింది.
2019-05-10 Read Moreరాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందని సీబీఐకి వచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ కెఎం జోసెఫ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో సుప్రీంకోర్టే ఇచ్చిన ‘రాఫేల్’ తీర్పు సమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం రెండు గంటలపాటు హియరింగ్ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనంలో జస్టిస్ జోసెఫ్ సభ్యుడు. ‘‘ఇక్కడ ప్రశ్న ఏమిటంటే... ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా లేదా’’ అని జస్టిస్ జోసెఫ్ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ను ప్రశ్నించారు.
2019-05-10 Read Moreతననెవరూ అరెస్టు చేయబోవడంలేదని టీవీ9 ‘సీఈవో’ రవిప్రకాష్ ఉద్ఘాటించారు. రవిప్రకాష్ ను సీఈవో పోస్టునుంచి తొలగించామని కొత్త యాజమాన్యం ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆయన టీవీ9 తెరమీదకు వచ్చారు. తాను తప్పించుకు తిరుగుతున్నానని ఉదయం నుంచీ కొన్ని ఛానళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని, అందుకే తాను టీవీ9 స్టూడియోనుంచే సీఈవో హోదాలోనే మాట్లాడుతున్నానని రవిప్రకాష్ చెప్పారు. ఎన్.సి.ఎల్.టి.లో 16న విచారణకు రానున్న కేసును ఆసరాగా చేసుకొని కొంతమంది తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ..అవి నిలబడవని ధీమా వ్యక్తం చేశారు.
2019-05-09 Read Moreఒడిషాపై తుపాను ‘‘ఫని’’ ఏమేరకు ప్రభావం చూపించిందో ఈ ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. అతి తీవ్ర తుపానుగా మారిన ‘ఫని’ ఈ నెల 3వ తేదీన ఒడిషాలోని పూరి పట్టణం వద్ద తీరం దాటింది. అంతకు ముందు (ఏప్రిల్ 30న), ఆ తర్వాత (మే 4,5 తేదీల్లో) రాత్రి సమయంలో ఉపగ్రహాలు తీసిన చిత్రాలను ‘నాసా’ ఎర్త్ అబ్జర్వేటరీ విడుదల చేసింది. భువనేశ్వర్, కటక్ నగరాలు తుపానుకు ముందు రాత్రి వెలుగుల్లో కాంతిమంతంగా కనిపిస్తుంటే... తుపాను తీరం దాటాక చాలాచోట్ల చీకట్లు ఆవహించాయి. విద్యుత్ పంపిణీ దెబ్బ తినడం దీనికి ప్రధాన కారణం.
2019-05-09 Read Moreటీవీ9 సీఈవో రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు నమోదైంది. టీవీ9ను (90 శాతం వాటా) కొనుగోలు చేసిన అలంద మీడియా కంపెనీ డైరెక్టర్ పుల్లూరి కౌశిక్ రావు ఫిర్యాదుమేరకు.. సైబరాబాద్ పోలీసులు ఐటీ చట్టం 56, ఐపీసీ 406, 467 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన సంతకాన్ని రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. అంతేకాదు... రవిప్రకాష్ ను సీఈవో పదవినుంచి తొలగించారు. కంపెనీ నిర్వహణలో రవిప్రకాష్ తమకు అడ్డుపడుతున్నారని, పెద్ద మొత్తంలో నిధులు దారిమళ్లించారని కొత్త యాజమాన్యం ఆరోపించింది.
2019-05-09 Read More‘‘ఆయన ప్రధానమంత్రి కావాలనుకోవడంలేదు. ఒకవేళ 123 కోట్ల ప్రజలు ఆయన ప్రధాని కావాలంటే మీకేమైనా అభ్యంతరమా’’..రాహుల్ గాంధీకి ద్వంద పౌరసత్వం ఉన్న కారణంగా ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరిన పిటిషనర్ కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వేసిన ప్రశ్న ఇది. ద్వంద పౌరసత్వంతోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారేమో? అని భగవాన్ గోయల్ అనే పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేసినప్పుడు సిజె ఇలా స్పందించారు. రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడని ఓ కంపెనీ చెబితే అయిపోతారా? అని సిజె ప్రశ్నించారు.
2019-05-09 Read More