నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం నాడిక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలసిన బీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. వెంటనే సిఎం జగన్మోహన్ రెడ్డికి శాలువా కప్పి సత్కరించారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేయలేకపోయిన పనులను కూడా జగన్ చేస్తున్నారని బీద ఈ సందర్భంగా ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బీద నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
2019-12-07జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. 20 నియోజకవర్గాలకు గాను 260 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కూడా వారిలో ఉన్నారు. మొత్తం 6,066 పోలింగ్ స్టేషన్లలో 949 సమస్యాత్మకమైనవిగా ప్రకటించారు. వాటిలో 762 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. 18 సీట్లలో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. తూర్పు జంషెడ్ పూర్, పశ్చిమ జంషెడ్ పూర్ లలో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
2019-12-07నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటూ ఆయన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు శుక్రవారం లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. యాదవ సామాజికవర్గానికి చెందిన బీదకు చంద్రబాబునాయుడు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత నేతలు ఒక్కరొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. మస్తాన్ రావు అధికార వైసీపీలో చేరతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
2019-12-06సామూహిక మానభంగానికి పాల్పడ్డ నిందితుల చేతుల్లోనే సజీవ దహనానికి గురైన బాధితురాలు శుక్రవారం రాత్రి మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ పట్టణంలో గత ఏడాది సామూహిక మానభంగానికి గురైన మహిళ... ఈ గురువారం ఆ కేసు విషయమై కోర్టుకు వెళ్తుండగా నిందితులే కిరోసిన్ పోసి నిప్పంటించారు. హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను పోలీసులు కాల్చి చంపిన రోజే ఉన్నావ్ బాధితురాలు మరణించడంతో సామాజిక మాథ్యమాల్లో ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు.
2019-12-07అది 1941 డిసెంబర్ 7 ఉదయం 7.55 (హవాయి కాలమానం). సూర్యోదయాన్ని ప్రతిబింబించే జపాన్ పతాక చిత్రంతో 360 జపాన్ యుద్ధ విమానాలు ‘‘పెరల్ హార్బర్’’పై దాడి చేశాయి. హవాయి దీవుల్లోని ఆ అమెరికా సైనిక స్థావరం కకావికలమైంది. అమెరికా పసిఫిక్ ఫ్లీట్ కు భారీగా నష్టం వాటిల్లింది. అక్కడ ఉన్న 8 యుద్ధ నౌకల్లో 5, మూడు డెస్ట్రాయర్లు, మరో 7 ఇతర నౌకలు, 200 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. 2,400 మంది అమెరికన్లు మరణించారు. మరో 1200 మంది గాయపడ్డారు. ఈ దాడితోనే అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలోకి అడుగుపెట్టింది.
2019-12-07 Read Moreవెటర్నరీ వైద్యురాలిపై ఆత్యాచారం చేసి హత్యగావించిన నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపడంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ విషయమై దాఖలైన పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు... నిందితుల మృతదేహాలను ఈ నెల 9వ తేదీవరకు భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. మృతదేహాలకు మహబూబ్ నగర్ లో పోస్టు మార్టం జరుగుతున్నట్టు అడ్వకేట్ జనరల్ చెప్పగా, ఆ సమయంలో చిత్రీకరించే వీడియోను ప్రిన్సిపల్ జిల్లా జడ్జికి అందజేయాలని హైకోర్టు ఆదేశించింది.
2019-12-06హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను కాల్చి చంపిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సి) స్పందించింది. స్వతహాగా విచారణ చేపట్టింది. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పోలీసు కస్టడీలో ఉన్న నిందితులు ‘‘ఎన్కౌంటర్’’లో మరణించడం తీవ్రంగా పరిగణించదగిన అంశంగా కమిషన్ అభిప్రాయపడింది. ఒక ఎస్.ఎస్.పి. నాయకత్వంలో బృందాన్ని తక్షణమే హైదరాబాద్ ఎన్కౌంటర్ ప్రదేశానికి విచారణ నిమిత్తం పంపాలని కమిషన్ డైరెక్టర్ జనరల్ కు సూచించింది.
2019-12-06ఊహించినట్టుగానే హైదరాబాద్ గ్యాంగ్ రేప్, మర్డర్ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు కాల్చి చంపారు. బాధితురాలి శవాన్ని కాల్చి మసి చేసిన ప్రదేశంలోనే శుక్రవారం వేకువజామున నిందితులనూ చంపేశారు. నేరం జరిగిన తీరును విచారించేందుకు నిందితులను అక్కడకు తీసుకెళ్లినప్పుడు పారిపోవడానికి ప్రయత్నించి తమపైనే దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే, ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి పోలీసులు ఎన్ కౌంటర్ చేశారనే అభిప్రాయమే సర్వత్రా ఉంది.
2019-12-06ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ పట్టణంలో మరో ఘోరం జరిగింది. అత్యాచార బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా నిందితులు ఆమెను అడ్డగించి కత్తులతో పొడిచి నిప్పంటించారు. ఒంటి నిండా మంటలతోనే కిలోమీటర్ దూరం పరుగెత్తిన బాధితురాలు, కాలిపోతూనే 112కి ఫోన్ చేసింది. పెళ్లి పేరుతో నమ్మించి అత్యాచారం చేసిన నిందితుడు గత ఏడాది ఇదే నెలలో అరెస్టయి తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. తనపై అత్యాచారం చేసిన శివం త్రివేది, శుభం త్రివేది సహా ఐదుగురి పేర్లను బాధితురాలు మేజిస్ట్రేట్ కు చెప్పినట్టు సమాచారం.
2019-12-05 Read Moreదక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్.పి.డి.సి.ఎల్)ను విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం. 41) జారీ చేసింది. విజయవాడ కేంద్రంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేకంగా మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (సి.పి.డి.సి.ఎల్)ను ఏర్పాటు చేసింది. దీంతో ఎస్.పి.డి.సి.ఎల్. పరిధి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు పరిమితమైంది. రాష్ట్ర విభజన తర్వాత మొత్తం 8 జిల్లాలతో ఎస్.పి.డి.సి.ఎల్, గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు 5 జిల్లాలతో ఇ.పి.డి.సి.ఎల్. ఏర్పాటయ్యాయి.
2019-12-05