అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్ధం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆహ్వానితులను పరిచయం చేసుకునే క్రమంలో ట్రంప్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కరచాలనం చేసి ఓ నిమిషం మాట్లాడటం కనిపించింది. గతంలో ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ 2017కు హాజరయ్యారు.
2020-02-25వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) కింద 2019 మార్చిలో వసూలైన రూ. 1800 కోట్లకు అదనంగా ఈ ఏడాది మార్చిలో మరో రూ. 1000 కోట్లు వసూలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు ఏపీ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె. నారాయణస్వామి చెప్పారు. మరో రూ. 1000 కోట్ల పాత బకాయిలను, ఆ మొత్తంపై వడ్డీ కింద రూ. 377 కోట్లను వసూలు చేయాలన్నది మరో లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇతర మార్గాల్లో మరో 1520 కోట్లు సమీకరించాలని మంత్రి మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు చెప్పారు.
2020-02-25ఇండియా, పాకిస్తాన్ సరిహద్దు వివాదంపై మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పారు. ఈసారి ఏకంగా ఇండియా రాజధానిలోనే ఈ విషయం చెప్పడం విశేషం. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశంలో ఈ అంశంపై ‘చాలా’ చర్చించానని కూడా ట్రంప్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘‘ఇద్దరు పెద్ద మనుషుల (మోడీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్)తో నాకు మంచి సంబంధాలు ఉన్నందున... నేను చేయగలిగింది చేస్తానని చెప్పాను (మోడీతో)’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
2020-02-25 Read Moreపౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వ్యతిరేక నిరసనకారులపై దాడితో మొదలైన ఢిల్లీ ఘర్షణలు భయానకంగా మారాయి. ఈశాన్య ఢిల్లీలో ఎక్కడ చూసినా ఏదో ఒకటి తగలబడుతూ కనిపిస్తోంది. మంగళవారం సాయంత్రానికి మృతుల సంఖ్య 13కి చేరింది. 130 మంది పౌరులు, 56 మంది పోలీసులు గాయపడినట్టు ఢిల్లీ పోలీసు పిఆర్ఒ ప్రకటించారు. ఢిల్లీ సివిల్ పోలీసులకు తోడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సి.ఆర్.పి.ఎఫ్, సశస్త్ర సీమా బల్ (ఎస్.ఎస్.బి) రంగంలోకి దిగాయి. పొగచూరిన వీధుల్లో ఆయా దళాలు కవాతు నిర్వహించాయి.
2020-02-25ఢిల్లీ అల్లర్లకు కారకులైన వారు తమ పార్టీవారైనా చర్యలు తీసుకోవాలని బిజెపి ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ డిమాండ్ చేశారు. బిజెపి నేత కపిల్ మిశ్రా ఆదివారం రెచ్చగొట్టే ప్రసంగం చేశాక అల్లర్లు ప్రారంభమైన నేపథ్యంలో గంభీర్ స్పందించారు. ‘‘ఎవరైనా... అతను ఏ పార్టీవాడైనా... అతను కపిల్ మిశ్రా కావచ్చు. మరెవరైనా కావచ్చు. అతను ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని గంభీర్ కోరారు. మొన్న (ఫిబ్రవరి 23న) మొదలైన అల్లర్లు మంగళవారం నాటికి తీవ్రమయ్యాయి. 8 మంది మరణించారు.
2020-02-25ఏప్రిల్ మాసంలో ఖాళీ అవుతున్న 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలు విడుదల చేసింది. ఏపీలో నలుగురు, తెలంగాణలో ఇద్దరు సహా 17 రాష్ట్రాల్లో 55 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్ లో రిటైర్ కానున్నారు. ఆయా స్థానాలకు మార్చి 26న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 6న వెలువడనుంది. మార్చి 13 లోగా నామినేషన్లను దాఖలు చేయాలి. మహారాష్ట్రలో అత్యధికంగా 7, తమిళనాడులో 6, బెంగాల్ లో 5 స్థానాలకు ఎన్నిక జరగనుంది.
2020-02-25తాను బాధ్యతలు స్వీకరించాక ఇండియాకు ఇంథన ఎగుమతులు 500 శాతం పెరిగాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. రెండో రోజు పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన పర్యటనలో ప్రధానంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చించినట్టు ట్రంప్ వెల్లడించారు. 3 బిలియన్ డాలర్ల (రూ. 23 వేల కోట్ల) విలువైన అపాచీ, రోమియా హెలికాప్టర్ల అమ్మకానికి ఒప్పందాన్ని ముగించామని.. 5జి వైర్ లెస్ నెట్వర్క్, క్వాడ్ మెకానిజంపై చర్చించామని ట్రంప్ చెప్పారు.
2020-02-25‘‘మన గౌరవనీయమైన సుప్రీంకోర్టు షహీన్ బాగ్ ట్రాఫిక్ అంతరాలపై ఆందోళనతో పరిష్కారం కోసం తన పర్యవేక్షణలోనే ఓ మధ్యవర్తుల బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే, తనకు తూర్పు దిక్కున రెండు మైళ్ళ దూరంలో జరుగుతున్న అల్లర్లు, సామూహిక దహనాలు, హత్యలపై బాధపడటంలేదు. ఎందుకంటే ‘చట్టం దాని పని అది చేసుకుపోతుంది’’’- ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్తా చేసిన ట్వీట్ ఇది. ఢిల్లీ అల్లర్లను కవర్ చేస్తున్న చాలా మంది జర్నలిస్టులు సామూహిక హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2020-02-25ఢిల్లీలో హింసాకాండ యధేచ్ఛగా కొనసాగుతోంది. మొన్న ప్రారంభమైన దహనాలు, దాడులు మౌజ్ పూర్, బాబర్ పూర్, శివపూర్ లలో మంగళవారం కూడా కొనసాగాయి. మృతుల సంఖ్య 8కి పెరిగింది. పోలీసుల ప్రేక్షక పాత్రతో సోమవారం రాత్రి ప్రణాళికా బద్ధంగా దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వేకువ జామున 5 గంటలకు బ్రహ్మపురి ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఖాళీ కార్ట్రిడ్జిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా 37 కంపెనీల సాయుధ పోలీసులు, పారామిలిటరీని ఈశాన్య ఢిల్లీకి పంపారు.
2020-02-25 Read Moreగత రెండు నెలలుగా పెరుగుతూ వచ్చిన ‘కరోనా’ తీవ్రత చైనాలో తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నా గత వారంతో పోలిస్తే తగ్గాయి. సోమవారం అర్దరాత్రి వరకు 31 ప్రావిన్సులలో 508 కొత్త కేసులు నమోదు కాగా 71 మంది మరణించారు. వారిలో హుబీ ప్రావిన్సుకు చెందినవారు 68. ‘కరోనా’ విజృంభణ ప్రారంభమైన నాటినుంచి ఇప్పటిదాకా 77,658 మందికి నిర్ధారణ అయింది. వారిలో 2,663 మంది మరణించారు. 27,323 మందికి వ్యాధి నయమై ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
2020-02-25 Read More