అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ విడుదల చేసిన ‘సీక్రెట్ మిసైల్ బంకర్’ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఆ భూగర్భ కేంద్రంలో పెద్ద సంఖ్యలో ఉంచిన మిసైళ్ళు, ఓ మిసైల్ ప్రయోగం వీడియోలో కనిపిస్తున్నాయి. వాటిని కియామ్-1 బాలిస్టిక్ మిసైళ్ళగా భావిస్తున్నారు. ఈ మిసైల్ రేంజ్ 750 కిలోమీటర్లు. ఫిబ్రవరిలో ఓ ‘అండర్ గ్రౌండ్ సిటీ’లో క్షిపణులు తయారు చేస్తున్న వీడియోను ఇరాన్ విడుదల చేసింది.
2019-06-01ప్రాధాన్య వాణిజ్య కార్యక్రమం కింద ‘లబ్దిదారు దేశం’గా భారత దేశానికి ఇచ్చిన గుర్తింపును అమెరికా రద్దు చేయడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమెరికా చర్య అవాంఛనీయమని ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జిపిఎస్) లబ్దిదారులుగా గుర్తింపు ఇచ్చిన దేశాలనుంచి పన్ను లేకుండా వేలాది ఉత్పత్తుల దిగుమతులను అమెరికా అనుమతిస్తోంది. ఇండియానుంచి సుమారు 2000 ఉత్పత్తులు అమెరికాకు వెళ్తున్నాయి. ఇకపై ఆ అవకాశం ఉండదు.
2019-06-01 Read Moreప్రపంచ కప్ క్రికెట్ రెండో రోజున ‘వెస్ట్ ఇండీస్’ చెలరేగి పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 21.4 ఓవర్లలో కేవలం 105 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. వెస్ట్ ఇండీస్ జట్టు 13.4 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచ కప్ చరిత్రలో నమోదైన అతి తక్కువ స్కోర్లలో ఇదొకటి. వెస్ట్ ఇండీస్ పేస్ బౌలర్లు పాకిస్తాన్ టాప్ ఆర్డర్ వెన్ను విరిచారు. తర్వాత క్రిస్ గేల్ (34 బంతుల్లో), నికోలస్ పూరన్ (19 బంతుల్లో 34) రాణించి వెస్ట్ ఇండీస్ కు తేలిగ్గా విజయాన్ని అందించారు.
2019-05-31ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు దారి మళ్లిన వైనం తెలుసుకొని కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోయినట్టు అధికారవర్గాలు తెలిపాయి. జగన్ శనివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. కుదేలైన ఆర్థిక వ్యవస్థను మార్చేందుకు అందరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సిఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని చక్కదిద్దడానికి సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావాలని ఆయన అధికారులను కోరారు.
2019-06-01రాష్ట్రంలో హరిత పన్ను (గ్రీన్ ట్యాక్స్), వ్యర్ధ పదార్ధాలపై పన్ను, ఎర్రచందనం అమ్మకం, సరైన ఇసుక విధానం వంటి చర్యల ద్వారా ఆదాయాన్ని పెంచే యోచన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. సామాన్యులపై భారం పడకుండా రాష్ట్ర ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళికలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. శనివారం ఆర్థిక, ఆదాయార్జన శాఖల అధికారులతో జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.
2019-06-01అసాధారణమైన సంక్షోభంలోనే అద్భుతమైన అవకాశమూ ఉంటుందని యుపిఎ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన అనంతరం ఆమె నేతలతో మాట్లాడారు. గడచిన ఎన్నికల్లో అపరిమితమైన వనరులు, దుర్మార్గమైన ప్రచారంతో ప్రజాభిప్రాయాన్ని మార్చగల సామర్ధ్యం ఉన్న ఎన్నికల యంత్రాంగాన్ని ఎదుర్కొన్నామని చెప్పారు. కాంగ్రెస్ విలువలకు కట్టుబడిన నేతలను అభినందిస్తూ పార్టీకి ఓటు వేసిన 12.13 కోట్ల మందికి కృతజ్ఞతలు తెలిపారు.
2019-06-01దేశంలోని రైతులందరికీ ‘కిసాన్ సమ్మాన్ నిధి’ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మోదీ 2.0 తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఇంతకు ముందు 2 హెక్టార్ల వరకు పొలం ఉన్న రైతులకే ఏడాదికి రూ. 6000 చొప్పున ఇవ్వడానికి పథకాన్ని రూపొందించారు. దాని ప్రకారం లబ్దిదారుల సంఖ్య 12.50 కోట్లు కాగా.. తాజా నిర్ణయంతో మిగిలిన రెండు కోట్ల మందికీ సాయం అందుతుంది. వార్షిక వ్యయం రూ. 72 వేల కోట్లనుంచి రూ. 87 వేల కోట్లకు పెరుగుతుంది.
2019-05-31యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నికయ్యారు. శనివారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో పార్టీ నేతలు సోనియాగాంధీని ఎన్నుకున్నారు. లోక్ సభలో పార్టీ పక్ష నేతను సోనియా ఎంపిక చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ.. లోక్ సభా పక్ష నేతగా వ్యవహరించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 16వ లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా మల్లిఖార్జున్ ఖర్గే ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.
2019-06-01 Read Moreఅమెరికా నుంచి దిగుమతి అయ్యే 60 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై పన్నులు పెంచుతూ చైనా తీసుకున్న నిర్ణయం శనివారం నుంచే అమలు కానుంది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, పెట్రో కెమికల్స్, ఆహారం సహా మొత్తం 5,140 ఉత్పత్తులపై 25 శాతం వరకు పెంచిన పన్నులు అమల్లోకి రానున్నాయి. 200 బిలియన్ డాలర్లకు పైగా విలువైన చైనా ఉత్పత్తులపై పన్నును అమెరికా 10 శాతం నుంచి 25 శాతానికి పెంచిన నేపథ్యంలో రెండోవైపు నుంచి కూడా చర్యలు ప్రారంభమయ్యాయి.
2019-05-31నిన్న కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆ బక్కపలుచని మనిషి తెలుసా..? ఆయన ఉండేది గుడిసెలో.. సైకిల్ పైనే ప్రయాణం.. కాకా హోటళ్ళలో భోజనం.. అంటూ మీడియా, సోషల్ మీడియా వేనోళ్ళ పొగుడుతున్నాయి. అయితే, ఇదంతా వ్యక్తి (ప్రతాప్ సారంగి) జీవితంలోని ఒక కోణమే..! మరోవైపు తనపైన 7 క్రిమినల్ కేసులు ఉన్నట్టు సారంగి స్వయంగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అల్లర్లు, మతవిద్వేషాలు రెచ్చగొట్టడం, బలవంతపు వసూళ్ల వంటి కేసులున్నాయి. ఆయనను ‘ఒడిశా మోదీ’గా వ్యవహరిస్తుంటారు.
2019-05-31 Read More