యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) గగనతలంలో కనిపించిన ఓ అసాధారణ మేఘ నిర్మాణం ప్రజల్లో రకరకాల చర్చకు దారి తీసింది. ఆకాశానికి చిల్లు పడినట్టుగా సంభవించిన మేఘ నిర్మాణం వింతగొలిపింది. గ్రహాంతర జీవులు వచ్చి ఉంటారని కొందరు, మరో ప్రవక్త అవతరించి ఉంటాడని మరికొందరు సామాజిక మాథ్యమాల్లో తోచిన రీతిలో వ్యాఖ్యానించారు. కానీ శాస్త్రవేత్తలు ఈ ఊహాగానాలన్నిటినీ కొట్టిపారేశారు. ఇంకా గడ్డకట్టని అతిశీతల నీటి బింధువులు ఐస్ స్ఫటికాలతో కలసినప్పుడు ఇలా జరుగుతుందని, మేఘాల మధ్యగా విమానాలు వెళ్లినప్పుడు ఈ రంధ్రాలు ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు.
2019-03-18 Read More‘‘ఇంత కత్తికి అంత దర్యాప్తు చేశారు. కోడిగుడ్డుపైన ఈకలన్నా పీకారా’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రాన్ని వ్యంగ్యంగా ప్రశ్నించారు. సోమవారం గుంటూరు ఎన్నికల సభలో మాట్లాడిన చంద్రబాబు, ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు చేయాల్సిన ఎన్.ఐ.ఎ.ను, విశాఖ కోడికత్తి దాడి కేసుకోసం వినియోగించారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి ఢిల్లీలో ఉన్న కాపలాదారు (మోదీ) కాపాడతారనే.. జగన్మోహన్ రెడ్డి సీబీఐ విచారణ కోరుతున్నారని చంద్రబాబు విమర్శించారు. గుంటూరు ఎన్నికల సభలో చంద్రబాబు మాట్లాడారు.
2019-03-18‘‘మనం పసుకు కుంకుమ పెడితే వాళ్ళు తుడిచేస్తున్నారు’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రతిపక్షాన్ని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. తనకు డ్వాక్రా సంఘాల సభ్యుల రూపంలో సుమారు కోటి మంది చెల్లెళ్లు ఉన్నారని, వారందరికీ పసుపు కుంకుమ కింద నిధులు అందిస్తున్నానని పేర్కొన్నారు. సోమవారం గుంటూరు ఎన్నికల సభలో మాట్లాడిన చంద్రబాబు, రాష్ట్రంలో 55 లక్షల మందికి ప్రతి నెలా పెన్షన్లు ఇస్తున్నానని, కొత్తగా రైతులకు ‘అన్నదాతా సుఖీభవ’ కింద పెట్టుబడి సాయం అందిస్తున్నానని గుర్తు చేశారు.
2019-03-18ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 2,839 పరీక్షా కేంద్రాల్లో తొలి రోజు లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్షకు 6,23,356 మంది విద్యార్ధులు హాజరయ్యారు. తొలి రోజు ఒక్క మాల్ ప్రాక్టీసు కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. విధులకు హాజరు కాని ఇద్దరు ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేసిన అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించారని మరో ముగ్గురిని విధులనుంచి తప్పించారు.
2019-03-18వెనెజులాలో ఓ సెస్నా 206 విమానం కూలిన సందర్భాన్ని ఆ విమానంలోనే ఉన్న ప్రయాణీకుడు వీడియోలో బంధించారు. తేలికపాటి ఆ విమానంలో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించారు. ఒకవైపునకు ఒరిగిపోయిన విమానం అటవీ ప్రాంతంలో కూలిపోవడం వీడియోలో రికార్డయింది.
2019-03-18 Read Moreగత నెలలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత నౌకాదళాన్ని యుద్ధానికి సన్నద్ధం చేసినట్టు రక్షణ శాఖ తాజా ప్రకటనతో స్పష్టమైంది. భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య సహా భారీగా యుద్ధ నౌకలు, న్యూక్లియర్ సబ్ మెరైన్లు, యుద్ధ విమానాలు ఉత్తర అరేబియా సముద్రంలో మోహరించినట్టు రక్షణ శాఖ ఆదివారంనాడొక ప్రకటనలో తెలిపింది. అంతకు ముందే ‘‘ట్రోపెక్స్ 19’’ యుద్ధ విన్యాసాలకోసం సమీకరించిన నౌకాదళ విభాగాలకు ‘‘యుద్ధ సన్నద్ధత’’పై ఆదేశాలు జారీ చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ట్రోపెక్స్ 19 విన్యాసాల్లో విక్రమాదిత్య క్యారియర్ గ్రూపుతోపాటు 60 నేవీ యుద్ధ నౌకలు, 12 కోస్ట్ గార్డ్ షిప్ లు, 60 విమానాలు పాల్గొన్నట్టు తెలిపా
2019-03-17పొత్తుల్లో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీకి రాష్ట్రంలో మూడు లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించినట్టు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారంనాడు బీఎస్పీ ఎంపీ వీర్ సింగ్, ఇతర నేతలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. తిరుపతి, చిత్తూరు, బాపట్ల లోక్ సభ స్థానాలతోపాటు 21 అసెంబ్లీ సీట్లు కేటాయించడానికి ఈ సమావేశంలో ఒప్పందం కుదిరింది. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలసి వచ్చిన సంగతి తెలిసిందే.
2019-03-17పొత్తులో భాగంగా వామపక్ష పార్టీలకు 14 అసెంబ్లీ, నాలుగు లోక్ సభ స్థానాలను కేటాయించినట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సీపీఎం : కర్నూలు, నెల్లూరు లోక్ సభ స్థానాలు ; కురుపాం, అరకు, రంపచోడవరం, ఉండి, విజయవాడ సెంట్రల్, సంతనూతలపాడు, కర్నూలు అసెంబ్లీ స్థానాలు. సీపీఐ : అనంతపురం, కడప లోక్ సభ స్థానాలు ; పాలకొండ, ఎస్. కోట, విశాఖ వెస్ట్, నూజివీడు, మంగళగిరి, కనిగిరి, డోన్ అసెంబ్లీ స్థానాలు.
2019-03-17గోవా ముఖ్యమంత్రి, కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ కన్ను మూశారు. చాలా కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ ఆరోగ్యం క్షీణించినట్టు ఆదివారం వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మరణ వార్త వెలువడింది. నిరాడంబరంగా ఉండే పారికర్ కు నిజాయితీపరుడిగా కూడా పేరుంది. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పారికర్ 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యారు. గోవా సిఎంగా ఆయన పని చేయడం ఇది నాలుగోసారి. 2016లో పారికర్ రక్షణ మంత్రిగా ఉండగానే సరిహద్దుల వెలుపల సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి.
2019-03-17 Read Moreఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై సోమవారం ఉదయం 10.00 గంటలకు నోటిఫికేషన్ జారీ కానుంది. అనంతరం 11.00 గంటల నుంచే నామినేషన్లు దాఖలు చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) గోపాలక్రిష్ణ ద్వివేది చెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్నికలకోసం గత వారం విడుదలైన షెడ్యూలు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ తొలి దశలోనే (ఏప్రిల్ 11న) జరగనుంది. ఈ నెల 25వ తేదీవరకు నామినేషన్లకు, తర్వాత రోజు పరిశీలనకు, 28న ఉపసంహరణకు గడువు ఉంటుంది.
2019-03-17