పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ వ్యూహాలు పదునెక్కుతున్నాయి. మరోసారి సుభాష్ చంద్రబోస్ తెరపైకి వచ్చారు. ఆయన జన్మదినమైన జనవరి 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. ఈ విషయమై జోక్యం చేసుకోవాలని మమత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాజాగా లేఖ రాశారు. అలాగే 1945 ఆగస్టు 18న నేతాజీ అదృశ్యం కావడంపై స్పష్టమైన నిర్ధారణకోసం కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని మోదీ స్వయంగా పరిశీలించాలని మమత కోరారు.
2020-11-18ఫుట్ బాల్ ప్రపంచ కప్ బాలికల అండర్ 17 టోర్నీ 2020 రద్దయింది. ఇండియాలో ఈ నవంబరులోనే జరగాల్సిన టోర్నీని కరోనా కారణంగా 2021 ఫిబ్రవరి- మార్చికి వాయిదా వేశారు. తాజాగా పరిస్థితిని సమీక్షించిన ‘ఫిఫా’ కౌన్సిల్ బ్యూరో, మరోసారి వాయిదా వేసే బదులు 2020 ఈవెంట్ ను రద్దు చేయాలని నిర్ణయించింది. 2022 ఎడిషన్ ఆతిథ్య హక్కులను ఇండియాకే అప్పగించింది. అండర్ 20 విభాగపు టోర్నీ 2022 ఆతిథ్య హక్కులు కోస్టారికాకు దక్కాయి.
2020-11-17కరోనా కారణంగా వాయిదా పడిన పంచాయతీ ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించాలని యోచిస్తున్నట్టు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్.ఇ.సి) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఇటీవల అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలూ తీసుకున్న నేపథ్యంలో రమేష్ కుమార్ ఈ అంశంపై మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజుకు 10 వేలు నమోదయ్యే దశ నుంచి 753 వరకు తగ్గిందని ఆయన గుర్తు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూలు విడుదలైన విషయాన్ని తన ప్రకటనలో ప్రస్తావించారు.
2020-11-17హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. డిసెంబర్ 1న పోలింగ్ నిర్వహించి 4వ తేదీన ఓట్లు లెక్కించనున్నారు. 150 డివిజన్లు ఉన్న జి.హెచ్.ఎం.సి.లో 50 బిసిలకు (అందులో 25 మహిళలకు), 10 ఎస్సీలకు (అందులో 5 మహిళలకు), 2 ఎస్టీలకు (అందులో ఒకటి మహిళకు) రిజర్వు అయ్యాయి. ఓపెన్ కేటగిరిలోనూ సగం (88 సీట్లలో 44) మహిళలకు ఉంటాయి. మేయర్ పదవి మహిళ (జనరల్)కు రిజర్వు అయింది. బుధవారమే నామినేషన్ల స్వీకరణ మొదలై 20వ తేదీతో ముగుస్తుంది.
2020-11-17కరోనాను నిరోధించడంలో తమ టీకా 94.5 శాతం ప్రభావవంతమైనదని ప్రయోగాల్లో రుజువైనట్టు అమెరికా కంపెనీ ‘మోడెర్నా’ సోమవారం ప్రకటించింది. తుది దశ ప్రయోగాల డేటా ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్టు కంపెనీ పేర్కొంది. ఇంతకు ముందే మరో అమెరికా కంపెనీ ఫైజర్ తమ టీకా 90 శాతం పైగా ప్రభావవంతమైనదని ప్రకటించింది. అయితే, ఫైజర్ టీకా నిల్వకు -70 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం కాగా.. మోడెర్నా టీకాకు 30 రోజుల పాటు సాధారణ ఫ్రిజ్ ఉష్ణోగ్రత, ఆ తర్వాత ఆర్నెల్ల వరకు -20 డిగ్రీల ఉష్ణోగ్రత సరిపోతాయని కంపెనీ చెబుతోంది.
2020-11-16ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారంటూ జడ్జిలను దూషించిన వైసీపీ అనుయాయులపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 16 మంది పేర్లను నిర్ధిష్టంగా పేర్కొంటూ మరో ‘గుర్తు తెలియని వ్యక్తి’ని చేర్చింది. ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. 2020 ఏప్రిల్ 1 నుంచి జూలై 15 వరకు సామాజిక మాధ్యమాల్లో చేసిన దూషణలను పరిగణనలోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం, శత్రుత్వాన్ని పెంచడం, విద్వేషం, నేరపూరిత బెదిరింపు, అశ్లీల పోస్టులను నేరాలుగా పేర్కొన్నారు.
2020-11-16పార్లమెంటు శీతాకాల సమావేశాల రద్దు దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒకేసారి బడ్జెట్ సమావేశాలను జనవరి చివరి వారం నుంచి నిర్వహించాలని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి. కరోనా నియంత్రణలోకి రాని ఈ పరిస్థితుల్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం తెలివైన పని కాదని ఓ ముఖ్యుడు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది కరోనా కారణంగా వర్షాకాల సమావేశాలను కూడా కుదించారు. సెప్టెంబర్ 14న ప్రారంభమై కేవలం 8 పని దినాలతో 24న ముగిశాయి.
2020-11-16నేర చరితులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశం పార్లమెంటు పరిధిలోనిదని జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగి లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. చార్జిషీట్ దాఖలై ఏడాది గడచిన, ఐదేళ్ళు జైలు శిక్ష పడిన కేసుల్లో నిందితుల ఎన్నిక రద్దయినట్టు ప్రకటించాలని లోక్ ప్రహారి సంస్థ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ ఎస్ఎన్ శుక్లా కోరారు. 2018లో కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత పార్లమెంటు ఏ చట్టమూ చేయలేదని శుక్లా గుర్తు చేశారు.
2020-11-16ఏపీ సిఎం జగన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం వాదనలు వినినుంది. సుప్రీం సిటింగ్ జడ్జి జస్టిస్ ఎన్.వి. రమణ సహా పలువురు న్యాయమూర్తులపై ‘‘తప్పుడు, నిరాధార, రాజకీయ ఆరోపణలు’’ చేశారంటూ ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ లకు వ్యతిరేకంగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ యు.యు. లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ముందుగా అడ్వొకేట్ జి.ఎస్. మణి పిటిషన్ పైన వాదనలు విననుంది. తర్వాత యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిటిషన్ విచారణకు రానుంది.
2020-11-16 Read Moreజెడి(యు)కు తక్కువ సీట్లు వచ్చినా నితీష్ కుమార్ నే బిహార్ ముఖ్యమంత్రిగా నిర్ణయించిన బిజెపి, తమ పార్టీకి చెందిన ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టబోతోంది. ఎమ్మెల్యేలు తార్ కిషోర్ ప్రసాద్, రేణు దేవి లను శాసనసభా పక్ష నేత, ఉప నేతలుగా ఎంపిక చేసింది. తద్వారా నితీష్ కు ఇద్దరు డిప్యూటీలు ఉంటారన్న సంకేతాన్ని ఇచ్చింది. ఇప్పటిదాకా డిప్యూటీ సిఎంగా ఉన్న సుశీల్ కుమార్ మోడీని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం ఉంది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్.జె.డి.కి 75, బిజెపికి 74, జెడియుకు 43 సీట్లు వచ్చాయి.
2020-11-15