బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు సన్నిహితుడైన రాజస్థాన్ ఎంపీ ఓం బిర్లాను లోక్ సభ స్పీకర్ పదవికోసం ఆ పార్టీ ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. మంగళవారం ఉదయం ఆయన బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి. నడ్డాను కలిశారు. 56 సంవత్సరాల ఓం బిర్లా రాజస్థాన్ లోని కోట లోక్ సభ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎన్నికయ్యారు. బీజేపీ యువజన విభాగంలో పని చేసిన ఆయన రాజస్థాన్ అసెంబ్లీకి మూడుసార్లు ఎన్నికయ్యారు. తనను ఎంపిక చేసినట్టు సమాచారం లేదని ఓం బిర్లా చెప్పగా, ఆయన భార్య అమితా బిర్లా మాత్రం నిర్ధారించారు.
2019-06-18కృష్ణా నది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన భవనంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్కడినుంచి ఖాళీ చేయిస్తామని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. కరకట్ట అక్రమ నిర్మాణాలపై కోర్టులో పోరాడుతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆర్కే మంగళవారం లాబీల్లో మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టుకోని చంద్రబాబు రాజధాని ఏం నిర్మిస్తారని ఎద్దేవా చేశారు.
2019-06-18యూరప్ దేశాల ఆరో తరం యుద్ధ విమానం (ఎఫ్.సి.ఎ.ఎస్) పూర్తి స్థాయి నమూనా సోమవారంనాడు పారిస్ ఎయిర్ షోలో ఆవిష్కృతమైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ సమక్షంలో ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ రక్షణ మంత్రులు ఈ యుద్ధ విమానం అభివృద్ధికోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. 2040 నాటికి యూరోపియన్ యూనియన్ ప్రధాన యుద్ధ విమానంగా ఎఫ్.సి.ఎ.ఎస్. ఉంటుందని అంచనా. గతంలో యూరప్ దేశాలు సంయుక్తంగా ‘యూరోఫైటర్ టైఫూన్’, ‘పనావియా టోర్నడో’ జెట్లను రూపొందించాయి.
2019-06-17 Read Moreసామూహిక అత్యాచారానికి గురైన బాధకు పోలీసుల నిర్లక్ష్యం తోడై బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని దాటగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. 24 ఏళ్ల యూపీ మహిళ తెలంగాణలోని సికింద్రాబాద్ లో అత్యాచారానికి గురైంది. నేరం జరిగిన చోటే ఫిర్యాదు చేయాలని యూపీ పోలీసులు చేతులు దులిపేసుకున్నారు. గత నెలలో తన బంధువు మరో ఇద్దరితో కలసి యూపీనుంచి బలవంతంగా సికింద్రాబాద్ తీసుకెళ్ళాడని, అక్కడ ఒక ఇంట్లో బంధించి రేప్ చేశారని ఆ మహిళ తన ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొంది.
2019-06-18 Read Moreప్రధాని మోదీ ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనను వామపక్షాలు వ్యతిరేకించాయి. ఇది ప్రజాస్వామ్యానికి, సమాఖ్య సూత్రానికి వ్యతిరేకమని లెఫ్ట్ నేతలు చెప్పారు. ఈ అంశమే ప్రధాన ఎజెండాగా మోదీ ఈ నెల 19న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో వామపక్షాలు స్పందించాయి. ‘ఒక రాష్ట్ర ప్రభుత్వం మెజారిటీ కోల్పోతే ఒకే ఎన్నికల ఫార్ములా ప్రకారం అదే ప్రభుత్వాన్ని కొనసాగించాలి..లేదా రాష్ట్రపతి పాలన విధించాలి. కేంద్రంలో ఉన్న పార్టీ అధికారాన్నే రాష్ట్రాలపై రుద్దే విధానం ఇది’ అని సీపీఎం నేత రామచంద్రన్ పిళ్ళై పేర్కొన్నారు.
2019-06-17 Read Moreబీహార్ లోని ముజఫర్ పూర్ లో 100 మంది పిల్లలు ఎన్సెఫలైటిస్ కారణంగా మరణించినట్టు వచ్చిన వార్తలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సి) స్వచ్ఛందంగా స్పందించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో ఈ వ్యవహారంపై సవివరమైన నివేదికలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పిల్లలకు చేసిన వైద్యానికి సంబంధించి కూడా వివరాలను కమిషన్ కోరింది.
2019-06-17 Read Moreఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులుగా మరో పదిహేనేళ్లపాటు జగన్, కేసీఆర్ కొనసాగాలని శారదా పీఠం అధిపతి స్వరూపానంద ఆకాంక్షించారు. వారిద్దరినీ రెండు రాష్ట్రాలకు రాజులుగా అభివర్ణించారు. సోమవారం విజయవాడలో జరిగిన శారదాపీఠం ఉత్తరాధికారి పట్టాభిషేక కార్యక్రమంలో స్వరూపానంద ఇద్దరు సిఎంలను కొనియాడారు. కేసీఆర్ యాదాద్రి, వేములవాడ దేవాలయాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని, దేవాలయాల పరిరక్షణకోసం జగన్ పరితపించారని ప్రశంసించారు.
2019-06-17ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదాభివందనాల పరంపర కొనసాగుతోంది. విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందకు ఆయన సోమవారం విజయవాడలో పాదనమస్కారం చేశారు. శారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మ సన్యాసాశ్రమ దీక్ష స్వీకరణ కార్యక్రమం విజయవాడలో సోమవారం ముగిసింది. కిరణ్ కుమార్ శర్మకు ‘స్వాత్మానందేంద్ర’గా నామకరణం చేశారు స్వరూపానంద. ఈ కార్యక్రమానికి హాజరైన జగన్ ‘స్వాత్మానంద’కు కిరీటం పెట్టి ‘స్వరూపానంద’కు పాదాభివందనం చేశారు.
2019-06-17ప్రముఖ బెంగాల్ మెజీషియన్ చంచల్ లాహిరి (41) ఒక ప్రమాదకరమైన స్టంట్ చేయబోయి హూగ్లీ నదిలో మునిగిపోయారు. చేతులు, కాళ్లకు గొలుసులు కట్టుకొని నదిలో మునిగాక తప్పించుకునే స్టంట్ చేయడంకోసం ఆయన ఆదివారం హౌరా బ్రిడ్జి వద్ద హూగ్లీ నదిలో దిగారు. అయితే, ఆయన ఎంతసేపటికీ పైకి రాకపోవడంతో ప్రేక్షకులు ఆందోళన చెందారు. అప్పటినుంచి వెతుకుతున్నా లాహిరి ఆచూకీ దొరకలేదు. నదిలో లోతైన చోట వేగంగా ప్రవహించే మురికి నీళ్ల మధ్య గాలిస్తున్నవారు ఆశ లేదంటున్నారు.
2019-06-17 Read Moreచైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ ఈ నెల 20-21 తేదీల్లో తొలిసారిగా ఉత్తర కొరియాలో పర్యటించనున్నారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానంమేరకు గ్జి అక్కడికి వెళ్తున్నారు. గత కొద్ది కాలంగా ఇరు దేశాల సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో కొరియా అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించి పలు ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు చైనా కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంలో కిమ్ రెండుసార్లు చైనాలో పర్యటించారు.
2019-06-17 Read More