నేపాల్ మాజీ రాజు గ్యానేంద్ర, రాణి కోమల్ రాజ్య లక్ష్మీదేవి కరోనా బారిన పడ్డారు. ఆ దంపతులిద్దరూ కొద్ది రోజుల క్రితం ఇండియా వచ్చి హరిద్వార్ లో కుంభమేళాలో పాల్గొన్నారు. ఏప్రిల్ 11న హరిద్వార్ చేరుకున్న గ్యానేంద్ర అక్కడ నిరంజని అఖారాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ కైలాసానంద గిరిని కలుసుకున్నారు. మాస్కు లేకుండానే సాధువులు, భక్తులతో చర్చించారు. గ్యానేంద్రను మత పెద్దలు ‘హిందూ సమ్రాట్’గా కీర్తించారు. సత్కరించారు. ఏప్రిల్ 12న నిరంజని అఖారా ప్రదర్శనలో కూడా గ్యానేంద్ర పాల్గొన్నారు.
2021-04-20కరోనా వైరస్ దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం 24 గంటల్లో 1,761 మందిని బలి తీసుకుంది. ఒక్క రోజులో ఇన్ని మరణాలు నమోదు కావడం తొలిసారి. మంగళవారం వెల్లడించిన సమాచారంలో పరిగణించిన 24 గంటల్లో 2.59 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1.53 కోట్లు దాటింది. వారిలో 1,80,530 వేల మంది మరణించారు. కొత్తగా మహారాష్ట్రలో 58,924 కరోనా కేసులు, ఉత్తర ప్రదేశ్ లో 28,211 కేసులు, ఢిల్లీలో 23,686 కేసులు నమోదయ్యాయి.
2021-04-20ఔషదాలు ఉన్నప్పటికీ, వాటిని అవసరమైన ప్రాంతానికి కాకుండా వేరొక ప్రాంతానికి పంపితే, అలా చేసినవారి చేతులకు రక్తం అంటినట్టేనని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కోవిడ్ చికిత్సకు అవసరమైన వనరుల విషయంలో కేంద్రం వివక్ష పాటిస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించిన నేపథ్యంలో హైకోర్టు వాదనలు విన్నది. ఆక్సిజన్, టీకాల పంపిణీ విధానంపై కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకదానికి ఆక్సిజన్ ను మళ్లించినందువల్ల ఢిల్లీలో కొరత ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం నిన్న కోర్టులో ఆరోపించింది.
2021-04-20ఢిల్లీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతపై ఆ రాష్ట్ర హైకోర్టు స్పందించింది. ఆక్సిజన్ కోసం పరిశ్రమలు వేచి చూడగలవని, కానీ పేషెంట్లు వేచి ఉండలేరని జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లి వ్యాఖ్యానించారు. పరిశ్రమలలో ఆక్సిజన్ వాడకాన్ని ఈ నెల 22 నుంచి నిషేధించినట్టు కేంద్రం బదులివ్వగా, ‘‘అది ఈ రోజే ఎందుకు చేయకూడదు? ఏప్రిల్ 22 దాకా వేచి చూడటం ఎందుకు? ఇక్కడ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఆక్సిజన్ కోసం ఏప్రిల్ 22 దాకా వేచి ఉండమని మీరు పేషెంట్లను అడుగుతారా?’’ అని హైకోర్టు ప్రశ్నించింది.
2021-04-20 Read Moreకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించిన మీదట పరీక్ష చేయించుకున్నట్టు రాహుల్ తెలిపారు. వైరస్ సోకినట్టు తేలాక డాక్టర్ సలహాతో ఆయన ఇంట్లోనే విడిగా ఉంటున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల సభలను రద్దు చేసుకున్నారు. ఆయన గత 12 రోజులుగా తల్లి సోనియాగాంధీని, ఐదు రోజులుగా సోదరి ప్రియాంకాగాంధీని కలవలేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాగా, రాహుల్ గాంధీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
2021-04-20 Read Moreమయన్మార్ శరణార్థులను వెనక్కి తిప్పికొట్టాలంటూ ఈ నెల 26న జారీ చేసిన ఆదేశాలను మణిపూర్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మయన్మార్ లో సైనిక పాలకుల అణచివేత కారణంగా చాలామంది పొరుగు దేశాలకు వలస వస్తున్న నేపథ్యంలో, ఈ నెల 26న ఆ రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు జిల్లాల డిప్యూటీ కమిషనర్లకు ఓ సర్క్యులర్ జారీ చేసింది. శరణార్థుల కోసం క్యాంపులు తెరవవద్దని, ఆహారం- వసతి ఏర్పాట్లు చేయవద్దని అందులో పేర్కొన్నారు. అయితే, దీనిపై పొరుగు రాష్ట్రం మిజోరాంలో ఆగ్రహం వ్యక్తమైంది.
2021-03-30 Read Moreఎయిర్ పోర్టులలో కోవిడ్ ప్రొటోకాల్స్ తప్పనిసరిగా పాటించేలా నిఘా పెంచాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించారు. కొన్ని ఎయిర్ పోర్టుల్లో కొవిడ్ ప్రొటోకాల్స్ సరిగా పాటించడంలేదని తమ నిఘాలో తేలినట్టు డిజిసిఎ జాయింట్ డైరెక్టర్ సునీల్ కుమార్ మంగళవారం జారీ చేసిన ‘అడ్వైజరీ సర్క్యులర్’లో పేర్కొన్నారు. ఎయిర్ పోర్టులలో ముక్కు, నోరు పూర్తిగా కవర్ అయ్యేలా మాస్కులు ధరించడం, భౌతిక దూరం నిబంధనల పాటింపు వంటి మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని ఎయిర్ పోర్టుల నిర్వాహకులకు సూచించారు.
2021-03-30సూయెజ్ కాలువలో ‘ఎవర్ గివెన్’ అనే సరుకు రవాణా ఓడ చిక్కుకుపోయిన ఉదంతంలో, అందులోని భారతీయ సిబ్బందిని బలిపశువులను చేయబోతున్నారనే అందోళన వ్యక్తమవుతోంది. ఓడలో పని చేస్తున్న 25 మందీ భారతీయులే. వారిపై సూయెజ్ కాల్వ అధారిటీ చర్యలు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 400 మీటర్ల పొడవున్న ‘ఎవర్ గివెన్’ కాలువకు రెండు వైపులా ఒడ్డును తాకి నిలిచిపోగా, ఆరు రోజుల తర్వాత నిన్న సరిగ్గా మళ్లించారు. ఈ అవాంతరం కారణంగా రోజుకు $ 9.6 బిలియన్ విలువైన సరుకుల రవాణా నిలిచిపోయినట్టు అంచనా.
2021-03-30 Read More‘‘జుడాస్ కొన్ని కొన్ని వెండి తునకల కోసం క్రీస్తు దేవుడిని మోసం చేశారు. ఎల్.డి.ఎఫ్. కొన్ని బంగారు తునకల కోసం కేరళను మోసం చేసింది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరపున పాలక్కాడ్ నుంచి పోటీ చేస్తున్న మెట్రో మ్యాన్ శ్రీధరన్ కోసం మోదీ మంగళవారం ప్రచార సభలో మాట్లాడారు. కేరళ బంగారం స్మగ్లింగ్ కేసును నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఆపాదిస్తూ బిజెపి ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీధరన్ ను ప్రత్యామ్నాయంగా పేర్కొన్నారు మోదీ.
2021-03-30 Read More‘స్టాట్యూ ఆఫ్ లిబరేషన్’ వద్దకు పర్యాటకాన్ని పెంపొందించడానికి గుజరాత్ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని ట్రావెల్ ఏజెన్సీలకు టూరిజం కార్పొరేషన్ ఆఫ్ గుజరాత్ లిమిటెడ్ (టిసిజిఎల్) 15 శాతం కమిషన్ ఆఫర్ చేస్తోంది. కార్పొరేషన్ అధికారి అజిత్ కుమార్ శర్మ సోమవారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా ఏజెంట్లతో కాకినాడలో సమావేశమయ్యారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీకి పర్యాటకాన్ని పెపొందిస్తే, అందుకు ప్రతిగా ఏపీలోని ద్రాక్షారామం, పిఠాపురం శక్తి పీఠాలకు తమ వైపు నుంచి సహకరిస్తామని శర్మ చెప్పారు.
2021-03-30 Read More