భారత ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి వంటి వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలేవీ ప్రత్యక్షంగా ప్రయోజనాన్ని కలిగించలేకపోయాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పేర్కొంది. వినియోగంలో డిమాండ్ బాగా బలహీనంగా ఉండగా... కార్పొరేట్ పన్ను తగ్గింపులు, బ్యాంకులకు ఉద్దీపన, మౌలిక సదుపాయాలపై వ్యయ ప్రణాళికలు, ఆటోమొబైల్ రంగానికి మద్ధతు వంటి చర్యలు సమస్యను పరిష్కరించలేకపోయాయని తన తాజా నివేదికలో స్పష్టం చేసింది.
2019-12-13జపాన్ ప్రధానమంత్రి షింజో అబె తన మూడు రోజుల ఇండియా పర్యటనను వాయిదా వేసుకున్నారు. భారత ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, దానిపై ఈశాన్య రాష్ట్రాల్లో పెల్లుబికిన నిరసనలు ఈ వాయిదాకు కారణంగా తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి 17 వరకు షింజో అబె ఇండియాలో పర్యటించాల్సి ఉంది. అయితే, ‘‘ఇండియాలో జరిగే పరిణామాలపై జపాన్ నిరాశ చాలా నిరాశ చెందింది’’ అని ఓ అధికారి చెప్పారు. పర్యటన వాయిదా వేయాలని ఇరువైపులా నిర్ణయించినట్టు విదేశాంగ శాఖ పేర్కొంది.
2019-12-132019 కేలండర్ సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 5.6 శాతం పెరుగుతుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సంస్థ తాజాగా అంచనా వేసింది. 2018లో వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంది. ఉపాధి వృద్ధి బాగా తక్కువగా ఉండటంతో వినియోగం బాగా మందగించిందని మూడీస్ తాజా నివేదికలో పేర్కొంది. 2020, 2021లలో జీడీపీ వృద్ధి రేటు మెరుగుపడుతుందని, ఆయా సంవత్సరాల్లో వరుసగా 6.6 శాతం, 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
2019-12-13హత్యాచారాలకు మరణశిక్ష విధించేలా ఏపీ ప్రభుత్వం రూపొందించిన బిల్లుకు శాసనసభ ఆమోదం లభించింది. అత్యాచారం-హత్య, పిల్లలపై లైంగిక నేరాలు, సామాజిక మాథ్యమాల్లో మహిళలకు వేధింపులు వంటి నేరాలకు ‘దిశ చట్టం’ కొత్త శిక్షలను ప్రతిపాదించింది. హత్యాచారాలకు గరిష్ఠంగా మరణశిక్ష, పిల్లలపై నేరాలకు యావజ్జీవ శిక్ష ఉంటాయి. సామాజిక మాథ్యమాల్లో మహిళలను వేధించేవారి తొలి నేరానికి రెండేళ్ల జైలు శిక్ష, మరోసారి అదే నేరానికి పాల్పడితే నాలుగేళ్ల శిక్ష ఉంటాయి.
2019-12-13హత్యాచారాలపై కచ్చితమైన ఆధారాలున్న కేసుల్లో ఉరిశిక్ష విధించేలా ‘దిశ చట్టం’ రూపొందిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 7 పని దినాల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, మరో 14 పని దినాల్లో విచారణ పూర్తి చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో చర్చకు ముగింపునిస్తూ సిఎం మాట్లాడారు. పిల్లలపై నేరాలకు పోస్కో చట్టంలో ఐదేళ్లవరకే శిక్ష ఉందని, ఈ బిల్లులో యావజ్జీవ శిక్షగా మార్చామని పేర్కొన్నారు.
2019-12-13అత్యాచారాలకు కఠిన శిక్షలు విధించేలా చట్టం తేవడాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని చెప్పారు. మహిళను పూజించే చోట దేవతలు ఉంటారన్నది మాటగానే మిగిలిపోయిందని, సమాజంలో కొంతమంది అత్యాచారాలు, క్రూరమైన హత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల హక్కులకోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చిందన్న భవాని... ఎన్టీఆర్ ఆస్తిహక్కును, రిజర్వేషన్లను కల్పించారని గుర్తు చేశారు.
2019-12-13ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సిఎం జగన్మోహన్ రెడ్డిపై పొగడ్తల వర్షం కొనసాగుతోంది. ముఖ్యమంత్రిని భగవంతుని ధూతగా.. కారణ జన్ముడుగా.. యుగ పురుషుడుగా అభివర్ణించారు అధికార పార్టీ (పాతపట్నం) ఎమ్మెల్యే రెడ్డి శాంతి. దిశ చట్టం వంటివి తేగలమని భారత దేశానికే చూపించిన యోధుడని పొగిడారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని...రావణ సంహారాన్ని, ‘దిశ చట్టం’లో పేర్కొన్న శిక్షలను పోల్చారు. దేశమంతా సాహో జగనన్న.. జయహో జగనన్న అంటోందని రజని పేర్కొన్నారు.
2019-12-13ప్రభుత్వాధినేతను అధికార పార్టీ నేతలు పొగడటం కొత్తేమీ కాదు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అవి కాస్త శృతి మించాయి. ‘అత్యాచారానికి ఉరిశిక్ష’ విధించేలా ప్రభుత్వం ‘దిశ చట్టం’ పేరిట ఓ బిల్లును శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బిల్లును పరిచయం చేసిన హోంమంత్రి సుచరిత సహా వైసీపీ మహిళా నేతలంతా సిఎం జగన్మోహన్ రెడ్డిని తెగ పొగిడారు. తానేటి వనిత ఏకంగా ముఖ్యమంత్రిని సృష్టికర్తగా, ఆయన పాలనను త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుడి తరహా పాలనగా అభివర్ణించారు.
2019-12-13అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణం జరగాలని గతంలో తాము ఇచ్చిన తీర్పును సమీక్షించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై దాఖలైన 18 రివ్యూ పిటిషన్లను గురువారం కొట్టివేసింది. వివాదాస్పద స్థలాన్ని రాముడి జన్మస్థలంగా భావిస్తూ కూలిన బాబ్రీ మసీదును మరోచోట నిర్మించడానికి స్థలం ఇవ్వాలని, రామాలయ నిర్మాణానికి ఓ ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచిస్తూ నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
2019-12-12దేశ ఆర్థిక వ్యవస్థలో రోజూ చేదు వార్తలే... గురువారం మరో రెండు... అక్టోబరు మాసంలో పారిశ్రామికోత్పత్తి 3.8 శాతం తగ్గింది. నవంబరుకు సంబంధించిన వినిమయ ధరల సూచీ 5.54 శాతానికి పెరిగింది. ఇది అక్టోబరులో 4.62 శాతంగా ఉంది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) గత ఏడాది అక్టోబరులో 8.4 శాతం పెరిగితే ఈసారి పురోగమించకపోగా తిరోగమించడం గమనార్హం. అందులో తయారీ రంగం 8.2 శాతం దిగజారింది. విద్యుదుత్పత్తి ఏకంగా 12.2 శాతం తగ్గడం అసాధారణం. గత ఏడాది అక్టోబరులో విద్యుదుత్పత్తి 10.8 శాతం పెరిగింది.
2019-12-12