సూర్యలంక, దొనకొండ, విజయవాడ, భోగాపురం లలో వైమానిక దళ శిక్షణా కేంద్రాలకు భూమి కేటాయించాలని సదరన్ ఎయిర్ కమాండ్ అధికారి పతర్గే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీని ఆయన కలిశారు. గతంలోనే ప్రతిపాదనలు సమర్పించామన్న పతర్గే, త్వరగా భూమి కేటాయించాలని విన్నవించారు. వైమానిక శిక్షణా కేంద్రాలకు తగిన భూములను నిర్దేశిత ధరలకు కేటాయించే అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా సీఎస్ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
2020-02-19ఏపీలో జనగణనతో పాటు జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్) నవీకరణ కూడా చేపడుతున్నట్టు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అధికారులు బుధవారం స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో 13 జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జనగణన నోడల్ అధికారులు, వివిధ శాఖల కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులు పాల్గొన్నారు. 2020 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య 45 రోజుల పాటు ఎన్.పి.ఆర్., 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జనాభా డేటా సేకరించేందుకు మార్గదర్శకాలను వివరించారు.
2020-02-19కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ పథకం ‘స్వచ్ఛభారత్’ రెండో దశకోసం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను వినియోగించనున్నట్టు కేంద్రం పేర్కొంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 1,40,881 కోట్లు కాగా రూ. 52,497 కోట్లు మాత్రమే బడ్జెట్ (తాగునీరు, పారిశుధ్య శాఖ) నుంచి కేటాయిస్తారు. మిగిలిన రూ. 88,384 కోట్లను 15వ ఆర్థిక సంఘం కేటాయింపులు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్) నుంచి సమీకరించాలని నిర్ణయించారు. ఫైనాన్స్ కమిషన్ నిధులను ఈ పథకానికి మళ్లించడం గ్రామీణ స్థానిక సంస్థలకు నష్టదాయకం.
2020-02-19జర్నలిస్టుగా మొదలై వెయ్యి కోట్లకు పైగా విలువైన మీడియా సంస్థకు అధిపతి అయ్యారు రిపబ్లిక్ టీవీ ప్రధాన వ్యాఖ్యాత ఆర్ణబ్ గోస్వామి. రిపబ్లిక్ టీవీ యాజమాన్య సంస్థ ‘ఎ.ఆర్.జి. ఔట్లియర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్’లో ఇప్పుడాయన వాటా 82 శాతం. ఈ విషయాన్ని రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ బుధవారం స్వయంగా ప్రకంటించింది. డిజిటల్ నెట్వర్క్ ను నిర్వహిస్తున్న సంస్థలో ఆర్ణబ్ కంపెనీ వాటా ఏకంగా 99 శాతంగా ఉంది.
2020-02-19 Read Moreస్వచ్ఛభారత్ (గ్రామీణ్) రెండో దశకు కేంద్ర మంత్రివర్గం బుధవారం పచ్చ జెండా ఊపింది. 2020-21 నుంచి 2024-25 వరకు అమలయ్యే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1,40,881 కోట్లు. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైంది. దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జన పూర్తిగా నిలిచిపోయినట్టు చెబుతున్న ప్రభుత్వం రెండో దశలో ‘ఒడిఎఫ్ ప్లస్’పై కేంద్రీకరిస్తామని ప్రకటించింది. ‘ఒడిఎఫ్’ను సుస్థిరం చేయడం, చెత్త-మురికినీటి శుద్ధి ఈ రెండో దశలో ఉంటాయని కేంద్రం పేర్కొంది.
2020-02-19 Read Moreమహిళలపై నేరాల నియంత్రణకు నియమితురాలైన ‘దిశ’ ప్రత్యేక అధికారి ఎం. దీపిక (ఐపిఎస్)కు ప్రమోషన్ లభించింది. ఇప్పటిదాకా ఆమె సిఐడి అదనపు డీజీ కార్యాలయంలో అదనపు ఎస్పీ హోదాలో ‘దిశ’ ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఆమెకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా ప్రమోషన్ ఇస్తూ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో దిశ ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ జీవో ఆర్టీ నెంబర్ 336 జారీ చేశారు.
2020-02-19తప్పుడు పత్రాలతో ‘ఆధార్’ పొందిన 127 మంది ‘అక్రమ వలసదారుల’కు నోటీసులు జారీ చేసినట్టు యుఐడిఎఐ చేసిన ప్రకటనపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ‘ఆ 127 మందిలో ఎంతమంది ముస్లింలు, దళితులు’’ అని ప్రశ్నించారు. యుఐడిఎఐ వివక్షకు ఈ నోటీసులే సాక్ష్యమని బుధవారం ట్విట్టర్లో విమర్శించారు. పౌరసత్వాన్ని ధ్రువీకరించడానికి యుఐడిఎఐకి అధికారం లేదని, కానీ డిప్యూటీ డైరెక్టర్ జారీ చేసిన నోటీసుల్లో ‘పౌరసత్వ రుజువులు’ కోరారని ఒవైసీ మండిపడ్డారు.
2020-02-19 Read More‘‘చావాలన్న ఉద్ధేశంతో వచ్చేవాడు ఎలా బతికి ఉంటాడు?’’- ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో వేసిన ప్రశ్న ఇది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వ్యతిరేక ఆందోళనకారుల మరణాలపై ఆయన చేసిన ఈ వ్యాఖ్య వివాదాస్పదమైంది. గత డిసెంబరులో యూపీలో జరిగిన ఆందోళనలు హింసాత్మకం కాగా కాల్పులలో 22 మంది చనిపోయారు. అయితే, ఎవరూ పోలీసు బుల్లెట్లతో చనిపోలేదని, అల్లరి మూకల బుల్లెట్లతోనే పోయారని ‘యోగి’ చెప్పారు. డిసెంబరులో పోలీసుల పనికి వారిని ప్రశంసించాలని కూడా యోగి పేర్కొన్నారు.
2020-02-19 Read Moreజాత్యహంకార కథనం రాసిందంటూ ‘వాల్ స్ట్రీట్ జర్నల్’పై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజింగ్ కేంద్రంగా పని చేస్తున్న ఆ పత్రిక ప్రతినిధులు ముగ్గురికి ప్రభుత్వ గుర్తింపును రద్దు చేసింది. ‘‘చైనా ఈజ్ ద రియల్ సిక్ మ్యాన్ ఆఫ్ ఆసియా’’ అనే శీర్షికన ఈ నెల 3న జర్నల్ ప్రచురించిన కథనం చైనా ఆగ్రహానికి కారణమైంది. ఈ ‘జాత్యహంకార’ కథనంపై జర్నల్ క్షమాపణ చెప్పకపోవడంతో చర్య తీసుకున్నట్టు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ బుధవారం చెప్పారు.
2020-02-19విమానం లోపల ఇంటర్నెట్ వైఫై సేవలు ఇండియాలో మార్చిలో ప్రారంభం కానున్నాయి. టాటా గ్రూపు సంస్థ ‘నెల్కో’ పానసోనిక్ ఏవియానిక్స్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో తొలిగా ‘విస్టార’ విమానాలకు ఈ సేవలను అందించనుంది. ‘విస్టార’లో కూడా ‘టాటా’ భాగస్వామి. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ సంయుక్త యాజమాన్యంలో నడుస్తోంది. ‘విస్టార’ సుదూర ప్రయాణాలకు వినియోగించే బోయింగ్ 787, ఎ321 విమానాల్లో తొలుత మార్చి - ఏప్రిల్ మాసాల్లో వైఫై సేవలను ప్రారంభించనున్నారు.
2020-02-19 Read More