గుజరాత్... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం. జనాభాలో ముస్లింలు 9.5 శాతం. కానీ, గత 30 సంవత్సరాలుగా ఒక్క ముస్లిం కూడా లోక్ సభకు ఎన్నిక కాలేదు. గుజరాత్ లో ముస్లింలు సామాజికంగానే కాకుండా రాజకీయంగా కూడా వివక్షకు గురయ్యారని ఓ విశ్లేషణను టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ రాష్ట్రం నుంచి లోక్ సభకు ఎన్నికైన చివరి వ్యక్తి అహ్మద్ పటేల్ (1984). 1989లో పటేల్ బీజేపీ అభ్యర్ధిపై ఓడిపోయాక మళ్లీ ఇంతవరకు ఏ ముస్లిం కూడా గెలవలేదు. తొలి లోక్ సభ ఎన్నికల (1962) నుంచీ ముస్లింల ప్రాతినిధ్యం తక్కువే.
2019-04-05 Read Moreఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన చర్యలు ఆయనకు మద్ధతును పెంచాయని సి.ఎస్.డి.ఎస్- లోక్ నీతి సర్వే తేల్చింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జనవరి 7వ తేదీన తీసుకున్న నిర్ణయం, ఫిబ్రవరి 1న ప్రకటించిన పిఎం కిసాన్ పథకం, ఫిబ్రవరి 26వ తేదీన పాకిస్తాన్ లోని బాలాకోట్ లో జెఇఎం స్థావరంపై వైమానిక దాడి.. మోదీకి సానుకూలతను పెంచాయని సర్వే నివేదిక తెలిపింది. 2018 మే నెలలో కేవలం 34 శాతం మంది మోదీ మళ్లీ ప్రధాని కావాలని కోరుకున్నారని, ఇప్పుడు మరో 9 శాతం ప్రజలు ఆయనను బలపరుస్తున్నారని పేర్కొంది.
2019-04-05 Read Moreఫిబ్రవరి 27వ తేదీన జరిగిన ‘డాగ్ ఫైట్’లో పాకిస్తాన్ ఎఫ్16 యుద్ధ విమానాన్ని కోల్పోలేదని అమెరికా పరిశీలనలో తేలింది. ఒక ఎఫ్16 విమానాన్ని తాము కూల్చివేశామని భారత ప్రభుత్వం ఇప్పటివరకు చేస్తున్న వాదనకు ఇది పూర్తి భిన్నంగా ఉంది. అమెరికా సరఫరా చేసిన ఎఫ్16లను ఇటీవల ఆ దేశ నిపుణులు లెక్కించారని, అవన్నీ లెక్క తేలాయని ఫారెన్ పాలసీ మ్యాగజైన్ రాసింది. మిగ్ 21 పైలట్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ ఎఫ్16పై క్షిపణిని ప్రయోగించి.. అది లక్ష్యాన్ని తాకిందని నమ్మి ఉండొచ్చని తన కథనంలో పేర్కొంది.
2019-04-05 Read More‘‘నా జీవితానికి మార్గదర్శక సూత్రం.. మొదట దేశం, తర్వాత పార్టీ, చివరిగా వ్యక్తిగతం. ఏ పరిస్థితుల్లోనైనా ఈ సూత్రానికే కట్టుబడి ఉండటానికి ప్రయత్నించాను. అలాగే కొనసాగుతాను’’ అని బీజేపీ సీనియర్ మోస్ట్ నేత ఎల్.కె. అద్వానీ ఉద్ఘాటించారు. 6వ తేదీన బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అద్వానీ రాసిన వ్యాసంలో అనేక వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్ధేశించి చేసినట్టుగా విశ్లేషణలు వెల్లువెత్తాయి. సత్యం, రాష్ట్ర నిష్ఠ, పార్టీలోనూ వెలుపలా ప్రజాస్వామ్యం అనే మూడు అంశాలు బీజేపీ వికాసానికి దోహదపడ్డాయని అద్వానీ స్పష్టం చేశారు.
2019-04-04తన పార్టీ ఎప్పుడూ రాజకీయంగా విభేదించేవారిని ‘‘జాతి వ్యతిరేకులు’’గా లేదా ‘‘శత్రువులు’’గా భావించలేదని, వారిని ప్రత్యర్ధులుగా మాత్రమే చూశామని బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ ఉద్ఘాటించారు. బీజేపీ వ్యవస్థాపకులలో ఒకరైన 91 సంవత్సరాల అద్వానీ, ఏప్రిల్ 6వ తేదీన బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఓ వ్యాసం రాశారు. ‘‘భిన్నత్వానికి గౌరవం, భావప్రకటనా స్వేచ్ఛ భారత ప్రజాస్వామ్యపు స్వభావాలు’’ అని అద్వానీ పేర్కొన్నారు. వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ ప్రతి పౌరుడికీ ఉన్న ‘ఎంపిక స్వేచ్ఛ’కు పార్టీ కట్టుబడి ఉండేదని నొక్కి చెప్పారు.
2019-04-04 Read More‘‘చంద్రబాబు గారి ప్రక్కన గంట కొట్టి భూకబ్జాలు చేసే గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఉంటారు. జగన్ ప్రక్కన క్రిమినల్స్ ఉంటారు. పవన్ కళ్యాణ్ ప్రక్కన జేడీ లక్ష్మీనారాయణ లాంటి నిజాయితీపరులు ఉంటారు’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న పవన్, గురువారం అక్కడ జరిగిన ‘‘ఎన్నికల యుద్ధ శంఖారావం’’ సభలో మాట్లాడారు. విశాఖపట్నం లోక్ సభ జనసేన అభ్యర్ధి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఈ సభలో ఉన్నారు.
2019-04-04భారతీయ రిజర్వు బ్యాంకు మరోసారి వడ్డీ రేటు తగ్గించింది. రెపో రేటును 25 పాయింట్లు తగ్గించడంతో కీలక వడ్డీ రేటు 6 శాతం అయింది. రిజర్వు బ్యాంకు మానెటరీ పాలసీ కమిటీ (ఎంపిసి)లోని ఆరుగురు సభ్యులలో నలుగురు వడ్డీ రేటు తగ్గింపునకు అనుకూలంగా స్పందించారు. వడ్డీ రేటు తగ్గించడం వరుసగా ఇది రెండోసారి. దీంతో నెలవారీ రుణ వాయిదాల్లో కొంచెం తగ్గే అవకాశం ఉంది. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.2 శాతం పెరుగుతుందని బ్యాంకు అంచనా వేసింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్భణం అంచనాను 2.4 శాతానికి తగ్గించింది.
2019-04-04 Read Moreభారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి.ఎస్.ఎన్.ఎల్)లో 54 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి కంపెనీ బోర్డు అంగీకరించిందంటూ ‘డెక్కన్ హెరాల్డ్’ బుధవారం ఓ కథనాన్ని వెలువరించింది. లోక్ సభ ఎన్నికలు ముగిశాక బోర్డు ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటుందని పత్రిక తెలిపింది. ఉద్యోగ విరమణ వయసును 60 సంవత్సరాలనుంచి 58కి తగ్గించాలని, 50 ఏళ్ళు దాటిన అందరికీ ‘స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (విఆర్ఎస్)’ ఇవ్వాలని నిపుణుల కమిటీ చేసిన సిఫారసులకు కూడా బిఎస్ఎన్ఎల్ బోర్డు ఆమోదం తెలిపింది.
2019-04-04 Read Moreభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది 5 మిలిటరీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. భద్రతా బలగాల నిఘా సామర్ధ్యాన్ని పెంచడానికి ఈ ఉపగ్రహాలు దోహదపడతాయి. ‘ఆర్ఐ శాట్’ కొత్త సిరీస్ లో నాలుగు ఉపగ్రహాలతోపాటు అధునాతన కార్టోశాట్ 3 ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించడానికి ‘ఇస్రో’ షెడ్యూలు సిద్ధం చేసుకుంది. మే నెలలో ‘ఆర్ఐ శాట్ 2బి’ని పి.ఎస్.ఎల్.వి-సి46 రాకెట్ ద్వారా, జూన్ మూడో వారంలో కార్టోశాట్ 3ని పి.ఎస్.ఎల్.వి-సి47 రాకెట్ ద్వారా పంపనున్నారు. కార్టోశాట్ 3 ఉపగ్రహానికి భూమిపైన 20 సెంటీమీటర్ల రిజొల్యూషన్ తో ఫొటోలు తీసే సామర్ధ్యం ఉంటుంది.
2019-04-04 Read More‘‘ప్రజలను చంపేవాళ్లను, దాడులు చేసేవాళ్లను తిరస్కరించండి. అసమానతలకు, అరాచకానికి, వివక్షకు, అహేతుకతకు వ్యతిరేకంగా ఓటు వేయండి’’- 150 మంది శాస్త్రవేత్తలు దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపు ఇది. ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఐఐటిలు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్, నేషనల్ సెంటర్ ఫర్ బయొలాజికల్ సైన్సెస్ సహా పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. ‘‘మతం, కులం, భాష, ప్రాంతం కారణంగా వివక్ష చూపించేవారిని తిరస్కరించి తీరాలి’’ అని వారు విన్నవించారు.
2019-04-04 Read More